నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

2026 తైపీ క్యాపిటల్ కప్ వరల్డ్‌ స్కిల్స్ ఇన్విటేషనల్ టోర్నమెంట్‌కు బయలుదేరిన భారత బృందానికి వీడ్కోలు పలికిన కేంద్ర మంత్రి శ్రీ జయంత్ చౌదరి

నాడు పోస్టు చేయడమైనది: 25 MAY 2026 4:58PM by PIB Hyderabad

తైవాన్‌లోని తైపీలో మే 26 నుంచి 28 వరకు జరిగే అంతర్జాతీయ వృత్తిసాంకేతిక నైపుణ్యాల పోటీ తైపీ క్యాపిటల్ కప్ వరల్డ్‌ స్కిల్స్ ఇన్విటేషనల్ టోర్నమెంట్ -2036)లో పాల్గొనేందుకు బయలుదేరిన భారత బృందానికి కేంద్ర నైపుణ్యాభివృద్ధిపరిశ్రమల ప్రోత్సాహక శాఖ సహాయ (స్వతంత్ర హోదామంత్రివిద్యా శాఖ సహాయ మంత్రి శ్రీ జయంత్ చౌదరి వీడ్కోలు పలికారు

భవిష్యత్ ప్రపంచ విజేతలుగా నిలవనున్న ఐదుగురు సభ్యుల భారత బృందం ఈ టోర్నమెంట్‌లో సుమారు 15 దేశాల పోటీదారులతో తలపడనుందివరల్డ్‌ స్కిల్స్ షాంఘై 2026 పోటీలకు సన్నాహక కార్యక్రమంగా దీనిని నిర్వహిస్తున్నారుఈ పోటీలు నైపుణ్యాభివృద్ధినిసాంకేతిక ప్రతిభనుభాగస్వామ్యాన్నికార్మిక రంగ ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూ పోటీలో పాల్గొనే వారికి అంతర్జాతీయ స్థాయిలో అనుభవం కల్పిస్తాయి

కేంద్ర నైపుణ్యాభివృద్ధిపరిశ్రమల ప్రోత్సాహక మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీమతి దేబశ్రీ ముఖర్జీజాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి శ్రీ అరుణ్‌కుమార్ పిళ్లైతో పాటు మంత్రిత్వ శాఖజాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎన్ఎస్డిసీకు చెందిన ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

భారత పోటీదారులను ఉద్దేశించి శ్రీ జయంత్ చౌదరి మాట్లాడుతూ... ఆత్మవిశ్వాసంక్రమశిక్షణప్రతిభతో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాలనిఅంతర్జాతీయ పోటీ ప్రమాణాలుప్రపంచవ్యాప్త అత్యుత్తమ విధానాల నుంచి నేర్చుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారునైపుణ్య పోటీల ప్రాధాన్యతను వివరిస్తూఇటువంటి పోటీలు సాంకేతిక సామర్థ్యాలను మెరుగుపరచడమే కాకుండాభారత నైపుణ్య వ్యవస్థను బలోపేతం చేస్తాయనిఅంతర్జాతీయంగా వస్తున్న నూతన అవకాశాలకు దేశ యువతను సిద్ధం చేస్తాయని ఆయన పేర్కొన్నారు.

"2026 తైపీ క్యాపిటల్ కప్ వరల్డ్‌స్కిల్స్ పోటీలకు వెళ్లనున్న భారత బృందంతో ముచ్చటించడం సంతోషాన్నిచ్చిందిఈ అంతర్జాతీయ వేదికలు కేవలం పతకాల కోసమే కాదుఆత్మవిశ్వాసాన్ని పెంచేదృక్పథాన్ని విస్తృతం చేసేజీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలను అందించే అనుభవాల కోసం కూడా ఉపయోగపడతాయిమన యువ పోటీదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలికొత్త విషయాలు నేర్చుకుంటూస్నేహాలనుభాగస్వామ్యాలను పెంపొందించుకుంటూఉన్నతమైన ఆశలతోవిస్తృతమైన ఆలోచనలతో తిరిగి రావాలిఅంతర్జాతీయ వేదికపై నైపుణ్యం కలిగిన నవ భారత స్ఫూర్తినిప్రతిభనుఆకాంక్షలను ప్రతిబింబిస్తూ మన దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న భారత బృందానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలుఅని శ్రీ జయంత్ చౌదరి పేర్కొన్నారు.

2026 తైపీ క్యాపిటల్ కప్ వరల్డ్‌స్కిల్స్ పోటీలలో భారత్ ఐదు నైపుణ్య విభాగాలలో తలపడనుందిఇందులో మొబైల్ అప్లికేషన్ల డెవలప్‌మెంట్‌లో అర్జున్ సుమతి విజయభాస్కర్సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ డెవలప్‌మెంట్‌లో మహ్మద్ మఫాజ్ పూనైకన్నన్ రబీ అహమద్పెయింటింగ్డెకరేటింగ్‌లో ముస్కాన్ఆటోమొబైల్ టెక్నాలజీలో మహ్మద్ సిరాజ్డిజిటల్ కన్స్ట్రక్షన్‌లో సురేష్ కుమార్ గణేశన్ మీనా దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారుఈ బృందంలో ఇండియాస్కిల్స్ జాతీయ పోటీలు 2025-26 స్వర్ణ పతక విజేతలతో పాటు వైల్డ్‌కార్డ్ ద్వారా ఎంపికైన అభ్యర్థులు కూడా ఉన్నారు.

ఈ సంవత్సరం జరిగే పోటీలలో స్మార్ట్ తయారీడిజిటల్ మార్పునకు సంబంధించిన కీలక రంగాలకు చెందిన 10 నైపుణ్య విభాగాలు ఉన్నాయివీటిలో ఇండస్ట్రియల్ మెకానిక్స్ఐటీ నెట్‌వర్క్ సిస్టమ్స్ అడ్మినిస్ట్రేషన్మొబైల్ అప్లికేషన్స్ డెవలప్‌మెంట్ఇండస్ట్రీ 4.0, ఆటోమొబైల్ టెక్నాలజీడిజిటల్ కన్‌స్ట్రక్షన్ (బీఐఎమ్మొదలైనవి ఉన్నాయి.

ఈ టోర్నమెంట్‌లో భారత్ పాల్గొనడం  48వ వరల్డ్‌స్కిల్స్ షాంఘై 2026 వైపు దేశం సాగిస్తున్న సన్నాహక ప్రయాణంలో ఒక ముఖ్యమైన అడుగుగా నిలుస్తుందిఈ పోటీలు భారత బృందానికి అంతర్జాతీయ ప్రమాణాలపై ముందస్తు అవగాహన కల్పించడంతో పాటుప్రపంచ స్థాయి పోటీలకు ముందు ఒక కీలకమైన సన్నాహక వేదికగా నిలుస్తాయి.  పోటీదారులు తమ సాంకేతిక నైపుణ్యాలకు పదును పెట్టుకోవడానికిఅంతర్జాతీయ అత్యుత్తమ ప్రమాణాలకు అనుగుణంగా తమను తాము మలచుకోవడానికి తోడ్పడతాయి


(రిలీజ్ ఐడి: 2265226) సందర్శకుల సూచీ సంఖ్య : : 8
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Tamil , Malayalam , English , Urdu , हिन्दी