రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

ఆయుధాలను సొంతంగా తయారు చేసుకునే దేశం.. స్వయంగా గమ్యాన్ని నిర్దేశించుకుంటుంది: రక్షణ మంత్రి


శిరిడీలో ప్రైవేటు భాగస్వామ్యంతో రక్షణ రంగ ఉత్పత్తుల తయారీ కేంద్రాన్ని ప్రారంభించిన రక్షణ మంత్రి, మహారాష్ట్ర సీఎం

భారత్‌లోనే తొలిసారిగా 300 కి.మీ. పరిధి గల యూనివర్సల్‌ రాకెట్‌ లాంచింగ్‌ వ్యవస్థ ప్రారంభం

"రక్షణ రంగ ఆయుధ సామాగ్రి, ఆటోమేషన్‌ రంగాల్లో ప్రపంచ కేంద్రంగా భారత్‌ను మార్చేందుకు అవసరమైన చర్యలు చెేపట్టేందుకు సిద్ధమైన ప్రభుత్వం"

"రక్షణ రంగంలో ఆత్మనిర్భరత కేవలం యుద్ధ సమయాల్లోనే కాదు.. శాంతి, అభివృద్ధి, ఆర్థిక పురోభివృద్ధికి అత్యంత ఆవశ్యకం"

నాడు పోస్టు చేయడమైనది: 23 MAY 2026 7:15PM by PIB Hyderabad

"ఆయుధాలను సొంతంగా తయారు చేసుకునే దేశం.. స్వయంగా గమ్యాన్ని నిర్దేశించుకుంటుందిఅని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారుమే 23, 2026న శిరిడీలో ప్రైవేటు రంగ సంస్థ నిబే గ్రూప్‌ ఏర్పాటు చేసిన రక్షణ రంగ ఉత్పత్తుల తయారీ కేంద్రాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్‌తో కలిసి రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రారంభించారుఈ కేంద్రం ద్వారా అత్యాధునిక ఫిరంగి వ్యవస్థలుక్షిపణిఅంతరిక్ష సాంకేతికతలురాకెట్‌ వ్యవస్థలుపేలుడు పదార్థాలుస్వయం ప్రతిపత్తి గల రక్షణ వేదికలను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా భారత్‌లో తొలిసారిగా 300 కి.మీపరిధి గల యూనివర్సల్‌ రాకెట్‌ లాంచింగ్‌ వ్యవస్థ 'సూర్యాస్త్ర'ను ప్రారంభించారుఈ వ్యవస్థకు సంబంధించి క్షిపణి కేంద్ర నిర్మాణానికి శంకుస్థాపన చేశారుదేశీయ సాంకేతికతో రూపొందించిన టీఎన్‌టీ ప్లాంట్‌ఆర్‌డీఎక్స్‌ ప్లాంట్‌బయో ఎనర్జీ కంప్రెస్డ్‌ బయోగ్యాస్‌ ప్లాంట్‌లను కూడా ప్రారంభించారుశాటిలైట్‌ అసెంబ్లీ రంగంలో సహకారానికి నిబే గ్రూప్‌బ్లాక్‌ స్కై సంస్థల మధ్య ఎంఓయూ కుదిరింది.

ఆయుధ సామగ్రి ఉత్పత్తిలో స్వావలంబన ఆవశ్యకతను రక్షణ మంత్రి స్పష్టం చేశారుఈ కేంద్రం రక్షణ దళాల కార్యాచరణ అవసరాలను తీర్చటంలో సహాయపడుతుందనిదేశ పారిశ్రామిక వ్యవస్థను బలోపేతం చేయటానికి దోహదపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారుగతంలో ప్రభుత్వ రంగ సంస్థలుఆయుధ కర్మాగారాలకే పరిమితమైన రక్షణ రంగాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం.. ప్రైవేటు రంగానికి అందుబాటులోకి తీసుకువచ్చిందని తెలిపారు. "భారతదేశాన్ని ప్రపంచ తయారీ కేంద్రంగా మార్చగల సామర్థ్యం ప్రైవేటు రంగానికి ఉందని మేం గుర్తించాంఅని ఆయన అన్నారు.

భవిష్యత్తులో యుద్ధ ఫలితాలను దేశ సైన్య పరిమాణం కాదు.. ఆయుధాలుఆటోమేషన్‌లో సాధించిన పురోగతిసామర్థ్యాలే నిర్ణయిస్తాయని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. "ప్రస్తుతం కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ సంఘర్షణలోనూపశ్చిమాసియా పరిస్థితుల్లోనూ ఈ వాస్తవాన్ని మనం గమనించవచ్చుఆపరేషన్ సింధూర్‌ సమయంలో ఈ సామర్థ్యాన్ని భారత్‌ నిరూపించుకుందిఅని అన్నారు.

భవిష్యత్తులో జరిగే యుద్ధాల తీరుపై భారతదేశ ప్రైవేటు పరిశ్రమలకు పూర్తి అవగాహన ఉందనిదేశానికి అత్యాధునిక వ్యవస్థలను సమకూర్చేందుకు అవి అవిశ్రాంతంగా కృషి చేస్తున్నాయని రక్షణ మంత్రి తెలిపారుఆయుధాలుఆటోమేషన్‌ రంగాల్లో ప్రపంచ కేంద్రంగా భారత్‌ను మార్చేందుకు సంబంధిత వర్గాలన్నీ సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారుకీలక సాంకేతికతలనుఅధునాతన వ్యవస్థల్లో 'మేక్-ఇన్-ఇండియాను ప్రభుత్వం నిరంతరం ప్రోత్సహిస్తోందని ఆయన తెలిపారు. "ఆయుధాలుఆటోమేటెడ్ వ్యవస్థల్లో భారత్‌ అగ్రగామిగా నిలిచేందుకు కావాల్సిన అన్ని చర్యలు తీసుకునేందుకు మేం సిద్ధంగా ఉన్నాంఅని వెల్లడించారు.

సాంకేతికత ప్రాథమిక లక్ష్యం.. సైనికుల సామర్థ్యాలను తగ్గించటం కాదనిమరింత బలోపేతం చేయటమేననితుది నిర్ణయం ఎల్లప్పుడూ మానవ మేధస్సుకే ఉండాలని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారుభవిష్యత్ యుద్ధాల్లో ఆధునిక ఆయుధాలుఆటోమేటెడ్ వ్యవస్థలు కీలక పాత్ర పోషిస్తాయనిఈ దిశగా భారత్‌ పురోగమించటం తప్పనిసరని అన్నారు. "రక్షణఅంతరిక్ష సాంకేతిక రంగాల్లో పూర్తి స్వావలంబన దేశంగా భారత్‌ను మార్చటానికి మనమంతా సమష్టిగా ప్రతిజ్ఞ చేద్దాంఅని పిలుపునిచ్చారుభవిష్యత్ యుద్ధాల కోసం భారత్‌ సామర్థ్యాన్ని పెంపొందించాలని రక్షణ సంస్థలను కోరారు.

గత దశాబ్ద కాలంలో రక్షణ మంత్రిత్వ శాఖ చేపట్టిన చర్యలను రక్షణ మంత్రి ప్రస్తావించారుసాహసోపేతమైన విధాన సంస్కరణలుసరళమైన ఎఫ్‌డీఐ నిబంధనలువ్యూహాత్మక భాగస్వామ్య నమూనాను ప్రవేశపెట్టటంసానుకూల స్వదేశీకరణ జాబితాల ప్రకటనఇన్నోవేషన్స్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్ (ఐడెక్స్‌), ఏసింగ్ డెవలప్‌మెంట్ ఆఫ్ ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ విత్ ఐడెక్స్‌ (అదితి), టెక్నాలజీ డెవలప్‌మెంట్ ఫండ్ (టీడీఎఫ్‌వంటి పథకాల ప్రారంభం యువ ఆవిష్కర్తలకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నట్లు తెలిపారుదేశీయ పరిశ్రమలు అందిస్తున్న బలంతో వీర జవాన్లు జాతీయ ప్రయోజనాలను కాపాడుతున్నారని.. ఆత్మనిర్భర్ భారత్‌మేక్-ఇన్-ఇండియా దార్శనికతను సాకారం చేయటంలో ప్రైవేట్ రంగం కీలక పాత్ర పోషిస్తోందని ఆయన స్పష్టం చేశారు.

"ఒకప్పుడు రక్షణ ఉత్పత్తుల రంగంలో ప్రైవేటు భాగస్వామ్యం అతి తక్కువగా ఉండేదిఇప్పుడది సుమారు 25-30 శాతానికి చేరుకుందిరాబోయే ఏళ్లలో ఈ గణాంకాన్ని 50 శాతానికి చేర్చడమే మా లక్ష్యంఇది నూతన భారతంఇక్కడ ప్రైవేటు రంగాన్ని కేవలం చిన్న చిన్న నట్లుబోల్టులు సరఫరా చేసే సంస్థగా మాత్రమే చూడలేంఅత్యాధునిక ఆయుధ వ్యవస్థలను ఆవిష్కరించిస్వయంగా తయారు చేసే స్థాయికి అవి ఎదుగుతున్నాయిప్రభుత్వ దార్శనికతకు ప్రైవేటు రంగ ఆవిష్కరణలు తోడైనప్పుడు దేశం ఉన్నత శిఖరాలను అధిరోహిస్తుందిఅని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.

నేటి ప్రపంచంలో 'భద్రత', 'ఆర్థిక వ్యవస్థ'లను వేరుగా చూడలేమని రక్షణ మంత్రి అన్నారుపటిష్టమైన ఆర్థిక వ్యవస్థే బలమైన సైన్యానికిఆధునిక రక్షణ సామర్థ్యాలకు కీలకమని స్పష్టం చేశారు. "పెట్టుబడులకుపారిశ్రామిక వృద్ధికిసమగ్ర అభివృద్ధికి స్థిరమైన వాతావరణాన్ని జాతీయ భద్రతే సృష్టిస్తుందిప్రస్తుతం వాణిజ్యంసరఫరా వ్యవస్థల నుంచి అరుదైన ఖనిజాల వరకు దాదాపు ప్రతిదాన్నీ ఆయుధాలుగా మార్చటాన్ని మనం చూస్తున్నాంఈ తరుణంలో మన రక్షణ తయారీ అవసరాలకు ఇతరులపై ఆధారపడలేంరక్షణ ఉత్పత్తిలో ఆత్మనిర్భరత కేవలం యుద్ధానికి మాత్రమే కాక.. శాంతిఅభివృద్ధిఆర్థిక స్థిరత్వానికి అత్యవసరంఅని తెలిపారు.

ఇవాళ ప్రారంభమవుతున్న ప్లాంట్లు పరిశోధనా కేంద్రాలుగా మారతాయనిఇవి భారతదేశ రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తాయని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ చెప్పారుయూనివర్సల్ రాకెట్ లాంచింగ్‌ వ‌్యవస్థ కోసం ఏర్పాటు చేసిన క్షిపణి కేంద్రంభారతదేశ భవిష్యత్ యుద్ధ సామర్థ్యాలకు ఒక కొత్త దిశను అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. "స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేసే ఈ రాకెట్ వ్యవస్థదాడి సామర్థ్యాన్ని కొన్ని రెట్లు పెంచివ్యూహాత్మకంగా విప్లవాత్మక మార్పు అని నిరూపించుకుంటుందిఅని శ్రీ రాజ్‌నాథ్‌ స్పష్టం చేశారు.

ఈ కేంద్రం కేవలం అధునిక సాంకేతికత గల పరిశ్రమలకే కాకఎంఎస్ఎంఈలకుచిన్న తరహా పరిశ్రమలకుస్థానిక ఆర్థిక వ్యవస్థకూ విస్తృత వ్యవస్థను సృష్టిస్తుందని రక్షణ మంత్రి అభినందించారు. "పేలుడు సామగ్రిక్షిపణులురాకెట్ వ్యవస్థలుఉపగ్రహ భాగాల ఉత్పత్తి అనుబంధ యూనిట్లుసరఫరాదారులువిక్రేతలకు ఉపాధి కలుగుతుందిఇది ఉద్యోగావకాశాలను సృష్టిస్తుందిఈ ప్రాంత యువతకు అత్యాధునిక సాంకేతిక నైపుణ్యాలను అందించిదేశ నిర్మాణంలో వారు భాగస్వాములయ్యేలా తోడ్పడుతుందిఅని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ.. ఆత్మనిర్భర్ భారత్మేక్-ఇన్-ఇండియా కార్యక్రమాల ద్వారా దేశ రక్షణ సన్నద్ధతను పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రశంసించారుభారత సైనికుల అసమాన ధైర్యానికిపెరుగుతున్న స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ఆపరేషన్ సింధూర్ గొప్ప ఉదాహరణ అని అభివర్ణించారుప్రభుత్వప్రైవేట్ రంగాల క్రియాశీలసమాన భాగస్వామ్యం వల్ల భారత రక్షణ వ్యవస్థ రూపురేఖలు మారాయనిఇది జాతీయ ప్రయోజనాలను కాపాడటానికి రక్షణ దళాలకు నిరంతరం బలాన్నిస్తుందని స్పష్టం చేశారువ్యూహాత్మక శక్తిని పెంపొందించుకుంటూప్రపంచ శాంతిస్థిరత్వాన్ని ప్రోత్సహించటంలో భారత్‌ కీలక పాత్ర పోషిస్తోందని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో సాంకేతిక ప్రదర్శనలుఎంఎస్ఎంఈల రక్షణ సామర్థ్య ప్రదర్శనలుపరిశ్రమల నాయకులురక్షణ రంగ భాగస్వాములతో సమావేశాలు జరిగాయిఈ సందర్భంగా త్రివిధ దళాల అధిపతి జనరల్ అనిల్ చౌహాన్మహారాష్ట్ర ప్రభుత్వ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ ఉదయ్ సమంత్జలవనరుల శాఖ మంత్రి శ్రీ రాధాకృష్ణ ఇవిఖేపాటిల్కార్యదర్శి (రక్షణ ఉత్పత్తులుశ్రీ సంజీవ్ కుమార్రక్షణ పరిశోధనఅభివృద్ధి శాఖ కార్యదర్శిడీఆర్డీఓ ఛైర్మన్ డాక్టర్ సమీర్ వి కామత్ఇతర సీనియర్ పౌరసైనిక అధికారులువ్యూహాత్మక భాగస్వాములుపరిశ్రమల భాగస్వాములు హాజరయ్యారు.


(రిలీజ్ ఐడి: 2264737) సందర్శకుల సూచీ సంఖ్య : : 5
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Tamil , English , Urdu , हिन्दी , Marathi