ఆయుష్
azadi ka amrit mahotsav

కేరళలో అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 కౌంట్‌డౌన్.. మహిళల కోసం ప్రత్యేక ఆరోగ్య కార్యక్రమం


కొట్టాయంలో యోగా, ఆయుర్వేదం ద్వారా మెనోపాజ్ ఆరోగ్యంపై ప్రత్యేక సదస్సు

प्रविष्टि तिथि: 21 MAY 2026 6:42PM by PIB Hyderabad

అంతర్జాతీయ యోగా దినోత్సవం (ఐడీవై) 2026కు సంబంధించి నిర్వహిస్తున్న 32 రోజుల కౌంట్‌డౌన్‌లో భాగంగా ‘‘మెనోపాజ్ కోసం యోగా- సంపూర్ణ ఆరోగ్య కార్యక్రమం’’ అనే అంశంపై ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ పరిధిలోని మొరార్జీ జాతీయ యోగా సంస్థ సహకారంతో కేరళలోని కలతిపాడిలోని యంగ్ విమెన్స్ క్రిస్టియన్ అసోసియేషన్ (వైడబ్ల్యూసీఏ) ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.

 

మెనోపాజ్ సమయంలో మహిళల ఆరోగ్యాన్ని కాపాడటంలో, వారి సంపూర్ణ శ్రేయస్సును పెంపొందించడంలో యోగా, ఆయుర్వేదం పోషించే కీలక పాత్రను ఈ కార్యక్రమం ప్రస్తావించింది స్థానిక మహిళలు, యోగా సాధకులు, ఆరోగ్య నిపుణులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

 

ఈ కార్యక్రమంలో భాగంగా ఆయుర్వేద సూత్రాలను సమన్వయం చేయడం, సాంప్రదాయ యోగాసనాలు, ప్రాణాయామం, విశ్రాంతి పద్ధతులు, ధ్యాన ప్రక్రియలు వంటి ప్రత్యేక సెషన్లు నిర్వహించారు.

 

మెనోపాజ్ అనేది హార్మోన్లు, మానసిక స్థితి, జీవక్రియ మార్పులతో కూడిన ఒక సహజమైన దశగా వివరించారు. ఈ సమయంలో శారీరక హాయిని పొందడానికి, మానసిక సమతుల్యతను కాపాడుకోవడానికి, ఒత్తిడిని తగ్గించుకోవడానికి, మంచి నిద్ర, మెరుగైన జీవన ప్రమాణాలను సాధించడానికి యోగా ఎలా సహాయపడుతుందో నిపుణులు వివరించారు.

 

 

ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి నాడీ వ్యవస్థ సమతుల్యతకు, మానసిక ఉల్లాసానికి తోడ్పడే తాడాసనం, బద్ధ కోణాసనం, బాలాసనం, సేతు బంధాసనం, విపరీత కరణి, శవాసనం వంటి సులువైన యోగాసనాలతో పాటు నాడీ శోధన, భ్రమరి వంటి ప్రాణాయామ పద్ధతులను పరిచయం చేశారు.

 

మెనోపాజ్ సమయంలో మహిళల్లో కనిపించే వాత అసమతుల్యత, ధాతు క్షయం వంటి అంశాలపై ఆయుర్వేద దృక్పథాన్ని కూడా  వివరించారు. సంపూర్ణ ఆరోగ్యం కోసం ఈ దశలో ఎలాంటి ఆహార నియమాలు, జీవనశైలి పద్ధతులు పాటించాలనే విషయాలపై అవగాహన కల్పించారు.

 

ఈ కార్యక్రమాన్ని రైట్ రెవరెండ్ డాక్టర్ మలయిల్ సాబు కోశి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైడబ్ల్యూసీఏ ఆఫ్ ఇండియా, సీఎంఎస్ కళాశాల,  కొట్టాయం మున్సిపల్ కార్యాలయానికి చెందిన పలువురు ప్రముఖులు, వక్తలు పాల్గొన్నారు.

 

మహిళల ఆరోగ్య సంరక్షణలో వ్యాధుల నివారణకు, ఆరోగ్యాన్ని పెంపొందించడానికి చికిత్సా సాధనంగా యోగా ఏ విధంగా ఉపయోగపడుతుందో ఈ కార్యక్రమం ద్వారా మరోసారి స్పష్టమైంది. సాంప్రదాయ ఆరోగ్య పద్ధతులను సామాజిక శ్రేయస్సులో, దైనందిన జీవనశైలిలో భాగం చేయాలనే దేశ విస్తృత ఆశయానికి అనుగుణంగా ఈ కార్యక్రమం సాగింది.

 

****


(रिलीज़ आईडी: 2263968) आगंतुक पटल : 41
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Punjabi , Tamil , Malayalam