ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మాతృభూమి పవిత్ర వారసత్వాన్ని చాటిచెప్పే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి..


అందరికీ సమృద్ధి కలగాలని ప్రార్థించిన ప్రధాని

నాడు పోస్టు చేయడమైనది: 21 MAY 2026 9:04AM by PIB Hyderabad

సంస్కృత భాషలోని ఓ సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారుఆధ్యాత్మిక సాధనఆరాధనలతో పాటు ధైర్య సాహసాలకీశక్తికీసర్వజన సంక్షేమానికీ నిలయం అయిన పవిత్ర భూమిగా మన మాతృదేశం అలరారుతోందని ఆయన అన్నారుగొప్ప వారసత్వంతో పాటు ప్రాచీన సంస్కృతికి ఆలవాలమైన ఈ పవిత్ర భూమి ఎల్లవేళలా అందరూ సుఖంతోసమృద్ధితో వర్ధిల్లేటట్లు చేయాలని తాను మనసారా కోరుకుంటున్నానని శ్రీ మోదీ అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి శ్రీ మోదీ పొందుపరుస్తూ :
‘‘
మన మాతృభూమి.. ఉపాసనసాధనలతో పాటు ధైర్య సాహసాలకీశక్తికీసకల జన సంక్షేమానికీ ఆటపట్టయిన పుణ్యభూమిగా నిలిచిందివైభవోపేత వారసత్వంతోనూప్రాచీన సంస్కృతితోనూ విరాజిల్లుతున్న ఈ పవిత్ర ధరిత్రి అందరినీ ఎప్పటికీ సుఖంతోనూసమృద్ధితోనూ పరిపూర్ణులుగా చేయాలని నేను ఆకాంక్షిస్తున్నాను.
యస్యాం పూర్వే పూర్వజనా విచక్రిరే యస్యాం దేవా అసురానభ్యవర్తయన్
గవామశ్చానాం వయసశ్చ విష్ఠా భగం వర్చః పృథివీ నో దధాతు’’.

ఈ శ్లోకానికి.. మన పూర్వికులు ఘనమైనపరోపకార కార్యాలను నిర్వర్తించినదుష్ట శక్తులను దేవతలు ఓడించిన ఈ నేల.. మన ఈ మాతృభూమి.. పశుగణంశక్తీ పరిపూర్ణంగా ఉండే సువిశాల భూభాగాన్నీసమృద్ధినీ మనకు ప్రదానం చేయుగాక అని అర్థం.

 

****

 

(రిలీజ్ ఐడి: 2263634) సందర్శకుల సూచీ సంఖ్య : : 2
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Manipuri , Bengali , Gujarati , Tamil , Kannada , Malayalam