జాతీయ మానవ హక్కుల కమిషన్
azadi ka amrit mahotsav

హైదరాబాద్‌ లోని కేబీఆర్ జాతీయ పార్క్ సమీపంలో చెట్ల నరికివేతకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న ఐదుగురు పర్యావరణ కార్యకర్తలను పోలీసులు ఏకపక్షంగా అరెస్టు చేసినట్లు వచ్చిన వార్తలను సుమోటోగా విచారణకు స్వీకరించిన ఎన్హెచ్ఆర్సీ


రెండు వారాల్లోగా దీనిపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ తెలంగాణ డీజీపీ, హైదరాబాద్ జిల్లా మేజిస్ట్రేట్లకు నోటీసులు జారీ

प्रविष्टि तिथि: 20 MAY 2026 8:22PM by PIB Hyderabad

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ లోని కాసు బ్రహ్మానందరెడ్డి (కేబీఆర్) జాతీయ పార్క్ చుట్టుపక్కల చెట్ల నరికివేతకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న ఐదుగురు పర్యావరణ కార్యకర్తలను మే 13, 2026న ఏకపక్షంగా అరెస్టు చేసి, పోలీస్ స్టేషన్‌లో గంటల తరబడి నిర్బంధించినట్లు మీడియాలో వచ్చిన వార్తలను భారత జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) సుమోటో విచారణకు స్వీకరించింది.  మీడియా కథనం ప్రకారం, బెయిల్‌పై విడుదల చేయడానికి ముందు వారిపై భారతీయ న్యాయ సంహితలోని వివిధ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. చట్టవిరుద్ధమైన నిరోధం (రాంగ్‌ఫుల్ రీస్ట్రెయింట్), ఆస్తి నష్టాన్ని కలిగించే తీవ్రమైన దుశ్చర్య (అగ్రివేటెడ్ మిస్ఛిఫ్) క్రిమినల్ బెదిరింపులకు సంబంధించిన సెక్షన్ల కింద ఈ కేసులు పెట్టారు.

మీడియా కథనంలోని అంశాలు నిజమైతే, వాటిని మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన తీవ్రమైన అంశాలుగా పరిగణించవలసి వస్తుందని కమిషన్ పేర్కొంది. ఈ విషయమై రెండు వారాల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని కోరుతూ తెలంగాణ పోలీస్ డైరెక్టర్ జనరల్,  హైదరాబాద్ జిల్లా మేజిస్ట్రేట్లకు నోటీసులు జారీ చేసింది.

మీడియా కథనం ప్రకారం, మే 13, 2026న జరిగిన నిరసన అనంతరం స్వచ్ఛంద సేవకులలో  ఒకరిని పోలీసులు నిర్బంధించారు. ఆ తర్వాత అతని గురించి విచారించడానికి పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన మరో నలుగురు కార్యకర్తలను కూడా పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారు.

 

****


(रिलीज़ आईडी: 2263521) आगंतुक पटल : 42
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Tamil