ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

సువ్యవస్థిత ప్రమాణాలు మానవ ప్రవర్తనకు దారి చూపాలంటూ ఓ సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 20 MAY 2026 10:24AM by PIB Hyderabad

సత్ప్రవర్తన ఓ దీపం లాంటిదనీఅది ఒక వ్యక్తినే కాక పూర్తి సమాజాన్నే ప్రకాశింపచేస్తుందనీ చాటిచెబుతున్న సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారుఈ ఆదర్శ నడవడికను ప్రస్తుతం మన దేశ ప్రజలు ఆచరణలో పెట్టి సంపూర్ణ నిగ్రహంతోనూసామర్థ్యంతోనూకర్తవ్య పరాయణత్వంతోనూ దేశనిర్మాణంలో పాలుపంచుకుంటున్నారని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి శ్రీ మోదీ పొందుపరుస్తూ:
‘‘
శ్రేష్ఠ ఆచరణ దీపం లాంటిది.. దానితో ఒక్క వ్యక్తే ప్రకాశించడం కాకుండా పూర్తి సమాజం కూడా ప్రకాశిస్తుందిఈ ఆదర్శాన్ని పాటిస్తూ మన దేశ ప్రజలు పూర్తి సంయమనంతోసామర్థ్యంతోకర్తవ్యనిష్ఠతో దేశ నిర్మాణంలో నిమగ్నమయ్యారు.
తస్మాచ్ఛాస్త్రం ప్రమాణం తే కార్యాకార్యవ్యవస్థితౌ
జ్ఞాత్వా శాస్త్రవిధానోక్తం కర్మ కర్తృమిహార్హసి’’
ఏమి చేయాలిఏమి చేయకూడదనే నిర్ణయాలను వ్యక్తిగత అభిప్రాయంపై ఆధారపడోలేదా క్షణిక ఆవేశంలోనో తీసుకోకూడదుఇలాంటి నిర్ణయాలను శాస్త్రాలు చెబుతున్న సువ్యవస్థిత ప్రమాణాల ఆధారంగా తీసుకోవాలిఈ ప్రమాణాలే ప్రవర్తనకు దిశనీక్రమశిక్షణనీ అందిస్తాయిఇందువల్లవ్యక్తి ఆయా సుప్రతిష్ఠిత ప్రమాణాల ప్రకారం నడుచుకొన్నప్పుడు ఆ మనిషి ప్రవర్తన సమతౌల్యమైందిగాసక్రమమైందిగాఅర్థవంతమైందిగా ఉంటుంది’’ అని పేర్కొన్నారు.

***


(రిలీజ్ ఐడి: 2263273) సందర్శకుల సూచీ సంఖ్య : : 21