ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఇండియన్ ఫార్మకోపియా కమిషన్ ఆధ్వర్యంలో శాస్త్రీయ సదస్సు, ఇండియన్ ఫార్మకోపియా-2026పై చర్చ: తెలంగాణలోని హైదరాబాద్‌లో ఉన్న నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చి (నైపర్)లో జరిగిన కార్యక్రమం


ఔషధ నాణ్యతను నిర్ధారించడంలో భారతీయ ఫార్మకోపియా నిర్దేశక ప్రమాణాలు, మలినాల ప్రమాణాల ప్రాధాన్యంపై దృష్టి సారించిన సదస్సు

ఫార్మాస్యూటికల్ రంగంలో నాణ్యత, క్లినికల్, నియంత్రణ, పారిశ్రామిక విభాగాలకు చెందిన నిపుణులను ఒక్కచోట చేర్చిన సదస్సు: ఫార్మకోపియల్ మలినాల వల్ల ఎదురయ్యే క్లినికల్ ప్రభావాలు, రోగుల భద్రతపై తొలిసారి జరిగిన చర్చ

నాడు పోస్టు చేయడమైనది: 15 MAY 2026 6:18PM by PIB Hyderabad

తెలంగాణలోని హైదరాబాద్‌లో ఉన్న జాతీయ ఫార్మాస్యూటికల్ విద్యపరిశోధన సంస్థ (నైపర్)లో శాస్త్రీయ  సదస్సునుభారతీయ ఫార్మకోపియా-2026పై చర్చా కార్యక్రమాన్ని భారత ప్రభుత్వ ఆరోగ్యంకుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ ఫార్మకోపియా కమిషన్ (ఐపీసీనిర్వహించిందినైపర్ హైదరాబాద్కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎస్‌సీవో), ఐడీఎంఏ తెలంగాణ ఛాప్టర్ సహకారంతో వీటిని నిర్వహించింది. ‘‘ఔషధ నాణ్యతను నిర్దారించడంలో ఇండియన్ ఫార్మకోపియా నిర్దేశక ప్రమాణాలుమలినాల ప్రమాణాల ప్రాధాన్యం’’ అనే ఇతివృత్తంపై ఈ సదస్సు జరిగింది.

ఔషధాల నాణ్యతనుభద్రతనుహేతుబద్ధమైన వినియోగాన్ని ప్రోత్సహించడంతో పాటు ఔషధాల నాణ్యతను బలోపేతం చేయడంరోగి భద్రతను పరిరక్షించడమే లక్ష్యంగా ఐపీసీ వివిధ కార్యక్రమాలను చేపడుతోందిప్రజారోగ్య రక్షణలో ఔషధాల నాణ్యత కీలకమైన అంశమని గుర్తించిశాస్త్రీయనియంత్రణభాగస్వాములతో సహకార వేదికల ద్వారా ఔషధ నాణ్యతకు సంబంధించిన సమస్యలను ఐపీసీ నిరంతరం పరిష్కరిస్తోందిఔషధాల నాణ్యతభద్రతసామర్థ్యాన్ని నిర్ధారించడంలో ఇండియన్ ఫార్మకోపియా రిఫరెన్స్ సబ్‌స్టాన్సెస్ (ఐఆర్‌పీఎస్), మలినాల ప్రమాణాల ప్రాముఖ్యతపై చర్చించడానికి ఈ సదస్సును నిర్వహించారు.

ఈ సదస్సును హైదరాబాద్ నైపర్ డైరెక్టర్ ప్రొఫెసర్ శైలేంద్ర సరఫ్ లాంఛనంగా ప్రారంభించారుఫార్మాస్యూటికల్నాణ్యతా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లేలా విద్యాసంస్థలతో కలసి పనిచేస్తున్నందుకు ఐపీసీని ఆయన అభినందించారునైపర్ హైదరాబాద్గతంలో నైపర్ అహ్మదాబాద్ లాంటి ప్రతిష్ఠాత్మక సంస్థలతో ఏర్పాటు చేసుకున్న ఈ తరహా సహకారాలు.. నియంత్రణా సంస్థలువిద్యాసంస్థలుపారిశ్రామిక భాగస్వాముల మధ్య శాస్త్రీయ పరిజ్ఞాన వినిమయానికిసామర్థ్య నిర్మాణానికి ముఖ్యమైన వేదికను అందిస్తాయని తెలియజేశారు.

ఫార్మాస్యూటికల్ మలినాల వల్ల ఎదురయ్యే దుష్ప్రభావాలను తగ్గించడంలో వ్యర్థాల ప్రొఫైలింగ్శాస్త్రీయంగా ఏర్పాటు చేసిన ఫార్మకోపియా ప్రమాణాలు ముఖ్యమైన అంశాలని ఐపీసీ కార్యదర్శిగాశాస్త్రీయ సంచాలకులుగా వ్యవహరిస్తున్న డాక్టర్ వీ కలైసెల్వన్ స్పష్టం చేశారువిస్తృతమైన ఫార్మకోపియా ప్రమాణాలునాణ్యతా హామీ యంత్రాంగాల ద్వారా ఔషధ నాణ్యతా వ్యవస్థలను బలోపేతం చేసి వికసిత్ భారత్ లక్ష్యానికి దోహదపడేందుకు ఐపీసీ కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు.

ప్రారంభ కార్యక్రమానికి ఐపీసీసీడీఎస్‌సీవోనైపర్ హైదరాబాద్‌కు చెందిన ఉన్నతాధికారులుఫార్మాస్యూటికల్ పరిశ్రమ  ప్రతినిధులు పాల్గొన్నారుహైదరాబాద్‌లోని సీడీఎస్‌సీవో డిప్యూటీ డ్రగ్స్ కంట్రోలర్ (ఇండియాశ్రీ కే నరేంద్రన్ ఈ కార్యక్రమానికి హాజరైన వారిని ఉద్దేశించి ప్రసంగించారుఔషధాల నాణ్యతకు హామీ ఇచ్చేలా ఏకీకృత ప్రమాణాలునియంత్రణ సంస్థల పర్యవేక్షణ ప్రాధాన్యాన్ని వివరించారు.

ఔషధ నాణ్యతవైద్య రంగాలకు చెందిన వారు పాల్గొన్నారుఔషధాల వల్ల ఎదురయ్యే తీవ్రమైన ప్రతికూల ప్రభావాలురోగి భద్రతా సమస్యలతో పాటుగా ఫార్మకోపియల్ మలినాల వల్ల ఎదురయ్యే క్లినికల్ ప్రభావాలపై చర్చించేందుకు తొలిసారిగా నియంత్రణవిశ్లేషణపారిశ్రామికక్లినికల్ రంగాలకు చెందిన నిపుణులను ఐపీసీ ఒకే వేదిక మీదకు తీసుకొచ్చిందిఐపీఆర్ఎస్మలినాల ప్రమాణాల అభివృద్ధిస్వీకరణఅమల్లో చురుగ్గా పాల్గొంటున్న ఫార్మాస్యూటికల్ పరిశ్రమలకు తమ అనుభవాలనుఆలోచనలను పంచుకొనే అవకాశాన్ని ఈ సదస్సు అందించింది.

ఫార్మకోపియా ప్రమాణాలుమలినాల నియంత్రణనియంత్రణల అమలుభారతీయ ఫార్మకోపియా -2026లో పురోగతులుమలినాల నిర్దేశక ప్రమాణాలుఫార్మాస్యూటికల్ నాణ్యతకు హామీప్రమాద అంచనా విధానాలుఫార్మాస్యూటికల్ మలినాల నిర్వహణ-నియంత్రణలో అంతర్జాతీయంగా ఎదురవుతున్న సవాళ్లు తదితర సమకాలీన అంశాలపై సాంకేతిక సెషన్లలో ఐపీసీసీడీఎస్‌సీవోవిద్యాసంస్థలుఫార్మాస్యూటికల్ రంగానికి చెందిన నిపుణులు చర్చించారు.

ఫార్మాస్యూటికల్ మలినాలువిశ్లేషణ పద్ధతులునియంత్రణల అంచనాలుఅమలులో ఎదురయ్యే సవాళ్లకు సంబంధించిన వివిధ అంశాలపై ఐపీసీసీడీఎస్‌సీవోరాష్ట్రాల లైసెన్సింగ్ అథారిటీలువిద్యావేత్తలువైద్యులుపరిశోధకులుపరిశ్రమల ప్రతినిధులతో జరిగిన చర్చా కార్యక్రమంతో సదస్సు ముగిసింది.

దేశవ్యాప్తంగా ఉన్న నియంత్రణ సంస్థల ప్రతినిధులుఫార్మాస్యూటికల్ పరిశ్రమ నిపుణులువిద్యావేత్తలువైద్యులుఅనలిటికల్ శాస్త్రవేత్తలుపరిశోధకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారుశాస్త్రీయంగా పటిష్టంగా ఉన్న ఫార్మకోపియా ప్రమాణాల ద్వారా ఔషధ  నాణ్యత వ్యవస్థలను బలోపేతం చేయడంప్రజారోగ్య భద్రతను ప్రోత్సహించడంలో ఐపీసీ నిబద్ధతను ఈ సదస్సు పునరుద్ఘాటిస్తుంది.

 

***


(రిలీజ్ ఐడి: 2261666) సందర్శకుల సూచీ సంఖ్య : : 10
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Tamil