భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారత్ లో విద్యుత్ వాహన విప్లవానికి ఊపిరి పోస్తున్న ప్రధాని శ్రీ మోదీ దార్శనికత


పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద కర్ణాటకకు 1,243 కొత్త విద్యుత్ వాహన చార్జింగ్ కేంద్రాలు; జాతీయ విద్యుత్ వాహనాల చార్జింగ్ పై జాతీయ సదస్సుకు బెంగళూరు ఆతిథ్యం

విద్యుత్ వాహనాలకు ప్రోత్సాహంపై ప్రధాని శ్రీ మోదీ దార్శనికతకు విశేష స్పందన

కర్ణాటకలో విద్యుత్ వాహన చార్జింగ్ రంగం అభివృద్ధికి రూ. 123.26 కోట్ల కేటాయింపును ప్రకటించిన శ్రీ హెచ్.డి. కుమారస్వామి

ప్రధాని శ్రీ మోదీ దార్శనికతతో స్వయం సమృద్ధ విద్యుత్ వాహన వ్యవస్థ వైపు భారత్ అడుగులు: కుమారస్వామి

నాడు పోస్టు చేయడమైనది: 12 MAY 2026 6:23PM by PIB Hyderabad

స్వచ్ఛ ఇంధనంతో రవాణా రంగం మార్పు దిశగా భారత్ ముందడుగు వేసిందిపీఎం ఈ-డ్రైవ్ పథకం కింద దేశ విద్యుత్ వాహన చార్జింగ్ వ్యవస్థను బలోపేతం చేసే లక్ష్యంతోకేంద్ర భారీ పరిశ్రమలుఉక్కు శాఖ మంత్రి శ్రీ హెచ్.డికుమారస్వామి మంగళవారం బెంగళూరులో కీలక ఆమోదాలువిధానపరమైన నిర్ణయాలను ప్రకటించారు

కర్ణాటకకు సంబంధించిరాష్ట్రంలో 123.26 కోట్ల రూపాయల వ్యయంతో 1,243 విద్యుత్ వాహన చార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనల ఆమోదాన్ని కేంద్ర మంత్రి ప్రకటించారుఈ ప్రకటన భారత విద్యుత్ వాహన రంగం మార్పులో కర్ణాటకను అగ్రగామి రాష్ట్రాలలో ఒకటిగా నిలబెట్టింది.

పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద దేశవ్యాప్త విద్యుత్ వాహన చార్జింగ్ మౌలిక సదుపాయాల కల్పనపై బెంగళూరులో జరిగిన జాతీయ సదస్సులో కుమారస్వామి మాట్లాడారుభారత ప్రముఖ విద్యుత్ వాహన చార్జింగ్ కేంద్రాలలో ఒకటిగా బెంగళూరు అవతరించిందని ఆయన పేర్కొన్నారుస్వచ్ఛ ఇంధన వాహన రంగం వైపు దేశవ్యాప్త మార్పును వేగవంతం చేయడంలో ఇతర రాష్ట్రాలు కూడా చురుగ్గా పాల్గొనాలని ఆయన కోరారు.

వివిధ రాష్ట్రాలుకేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో 4,874 విద్యుత్ వాహన చార్జింగ్ కేంద్రాల ఏర్పాటు కోసం ఇప్పటివరకు 503.86 కోట్ల రూపాయల విలువైన ప్రతిపాదనలు ఆమోదం పొందినట్లు మంత్రి తెలిపారుఈ ఆమోదిత ప్రతిపాదనల్లో హెచ్పీసీఎల్ఐఓసీఎల్బీపీసీఎల్ వంటి ప్రధాన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు రాజస్థాన్ఆంధ్రప్రదేశ్ఉత్తరప్రదేశ్గుజరాత్కేరళతెలంగాణకర్ణాటకతమిళనాడు రాష్ట్రాలకు చెందినవి ఉన్నాయి.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వాన్ని కొనియాడుతూ, 2070 నాటికి కర్బన ఉద్గారాల రహిత లక్ష్యాన్ని చేరుకోవడానికి కట్టుబడి ఉంటూనేవికసిత భారత్ 2047 దార్శనికత వైపు భారత్  స్థిరంగా అడుగులు వేస్తోందని కేంద్ర మంత్రి శ్రీ కుమారస్వామి తెలిపారుసుస్థిరతఆవిష్కరణలువిస్తృతికి ప్రధానమంత్రి ఇస్తున్న ప్రాధాన్యత రవాణాఇంధన రంగాల పట్ల భారత్ దృక్పథాన్ని పూర్తిగా మార్చివేసిందని ఆయన పేర్కొన్నారు.

భారతదేశ స్థూల దేశీయోత్పత్తిలో వాహన రంగం వాటా శాతానికి పైగా ఉందనితయారీ రంగ స్థూల దేశీయోత్పత్తిలో ఇది దాదాపు సగం అని మంత్రి చెప్పారుసుమారు కోట్ల మంది జీవనోపాధికి ఈ రంగం అండగా నిలుస్తూదేశ స్వచ్ఛ ఇంధన రవాణా మార్పులో కీలక పాత్ర పోషిస్తోందని ఆయన పేర్కొన్నారు.

భవిష్యత్ రవాణా సాంకేతికతలకు అంతర్జాతీయ కేంద్రంగా భారత్ స్థానాన్ని బలోపేతం చేయడానికి భారీ పరిశ్రమల శాఖ ప్రారంభించిన పలు ప్రధాన కార్యక్రమాలను కూడా ఆయన ప్రస్తావించారువీటిలో బ్యాటరీ సెల్ తయారీ కోసం 18,100 కోట్ల రూపాయల పీఎల్ఐ ఏసీసీ పథకంవిద్యుత్ వాహనాలుహైడ్రోజన్ వాహనాలతో సహా స్వచ్ఛమైన వాహనాలను ప్రోత్సహించే 25,938 కోట్ల రూపాయల పీఎల్ఐ ఆటో పథకంఅరుదైన భూ అయస్కాంతాల తయారీలో స్వయం సమృద్ధి సాధించే లక్ష్యంతో ఇటీవల ప్రారంభించిన 7,280 కోట్ల రూపాయల ఆర్ఈపీఎం పథకం ఉన్నాయి.

పీఎం ఈ-డ్రైవ్ పథకాన్ని భారత్ విద్యుత్ వాహన మార్పునకు మూలస్తంభంగా అభివర్ణిస్తూఈ 10,900 కోట్ల రూపాయల కార్యక్రమం విద్యుత్ ద్విచక్రత్రిచక్ర వాహనాలుబస్సులుట్రక్కుల వినియోగాన్ని వేగవంతం చేస్తోందని శ్రీ కుమారస్వామి తెలిపారుదేశవ్యాప్తంగా పటిష్టమైన విద్యుత్ వాహన చార్జింగ్ మౌలిక సదుపాయాలను ఇది కల్పిస్తోందని ఆయన పేర్కొన్నారుదేశవ్యాప్తంగా విద్యుత్ వాహన బహిరంగ చార్జింగ్ మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రత్యేకంగా 2,000 కోట్ల రూపాయలు కేటాయించినట్లు ఆయన వెల్లడించారు.

దేశవ్యాప్తంగా చార్జింగ్ మౌలిక సదుపాయాల విస్తరణలో బీపీసీఎల్ఐఓసీఎల్హెచ్పీసీఎల్ వంటి చమురు మార్కెటింగ్ సంస్థల కృషిని కూడా మంత్రి ప్రస్తావించారుఫేమ్-2 పథకం కిందభారీ పరిశ్రమల శాఖ నుంచి లభించిన 873.5 కోట్ల రూపాయల రాయితీ సహాయంతో ఈ సంస్థలు దేశవ్యాప్తంగా 8,932 విద్యుత్ వాహన చార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశాయివీటిలో 721 కేంద్రాలు ఒక్క కర్ణాటకలోనే ఏర్పాటయ్యాయి.

ఆవిష్కరణలుఅమలు సామర్ధ్యాల ద్వారా భారత విద్యుత్ వాహన వ్యవస్థను బలోపేతం చేయడంలో చార్జ్ పాయింట్ ఆపరేటర్లుటాటా పవర్చార్జ్ జోన్మహీంద్రా అండ్ మహీంద్రా వంటి పారిశ్రామిక సంస్థల పాత్రను కూడా శ్రీ కుమారస్వామి ప్రశంసించారు.

మంత్రిత్వ శాఖ తదుపరి ప్రధాన కార్యక్రమాన్ని వివరిస్తూజాతీయ ఏకీకృత విద్యుత్ వాహన చార్జింగ్ యాప్ యూనిఫైడ్ భారత్ ఇ-చార్జ్ (యూబీసీని రూపొందిస్తున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారువివిధ సంస్థల చార్జింగ్ కేంద్రాలను  నమ్మకమైన ఒకే వేదిక ద్వారా గుర్తించడానికివినియోగించుకోవడానికిరుసుము చెల్లించడానికి ఈ వ్యవస్థ వీలు కల్పిస్తుందిడిజిటల్ చెల్లింపుల రంగంలో యూపీఐ తీసుకొచ్చిన మార్పుతో దీనిని పోలుస్తూఈ ప్రయత్నం భారత విద్యుత్ వాహన చార్జింగ్ వ్యవస్థను గణనీయంగా బలోపేతం చేస్తుందని ఆయన పేర్కొన్నారు.

దేశంలో విద్యుత్ వాహన రంగ వేగవంతమైన వృద్ధికి తోడ్పడేలా గ్రిడ్ సంసిద్ధతప్రామాణీకరణడిజిటల్ అనుసంధానంపై విద్యుత్ శాఖరాష్ట్ర ప్రభుత్వాలుపరిశ్రమల భాగస్వాములను సమన్వయం చేసుకుంటూ భారీ పరిశ్రమల శాఖ పని చేస్తోందని కుమారస్వామి తెలిపారు.

భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను వివరిస్తూభారత విద్యుత్ వాహన చార్జింగ్ మౌలిక సదుపాయాల వ్యూహం మూడు ప్రధాన సూత్రాలు -  అందరికీ అందుబాటుతక్కువ ధరవిశ్వసనీయత ఆధారంగా ఉంటుందని మంత్రి తెలిపారుదేశవ్యాప్తంగా పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో చార్జింగ్ సదుపాయాలు సులభంగా దొరికేలాసామాన్యుడికి అందుబాటులో ఉండేలానమ్మదగ్గవిగా ఉండేలా చూడటమే ఈ సూత్రాల లక్ష్యమని ఆయన వివరించారు.

"మనం  కేవలం చార్జింగ్ స్టేషన్లను మాత్రమే ఏర్పాటు చేయడం లేదుభారత భవిష్యత్తుకు శక్తిని అందిస్తున్నాంఅని మంత్రి పేర్కొన్నారుప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోప్రపంచ స్వచ్ఛ ఇంధన రవాణా మార్పును ముందుండి నడిపించేందుకు భారత్ సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.

 

***


(రిలీజ్ ఐడి: 2260521) సందర్శకుల సూచీ సంఖ్య : : 15
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Urdu , English , हिन्दी , Kannada