భారత పోటీ ప్రోత్సాహక సంఘం
azadi ka amrit mahotsav

జీవీకే ఎనర్జీ లిమిటెడ్ (లక్ష్యం) 100 శాతం షేర్ క్యాపిటల్‌ను అదానీ పవర్ లిమిటెడ్ (కొనుగోలుదారు) స్వాధీనం చేసుకొనేందుకు ఆమోదం తెలిపిన సీసీఐ

నాడు పోస్టు చేయడమైనది: 12 MAY 2026 7:43PM by PIB Hyderabad

జీవీకే ఎనర్జీ లిమిటెడ్ (లక్షిత సంస్థ)కు సంబంధించిన 100 శాతం షేర్ క్యాపిటల్‌ను అదానీ పవర్ లిమిటెడ్ (కొనుగోలుదారుస్వాధీనం చేసుకోవడానికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐఆమోదం తెలిపింది.

ప్రతిపాదిత విలీనంలో భాగంగా ఇన్‌సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్-2016 కింద ప్రారంభించిన కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియను అనుసరించిలక్షిత సంస్థలో 100 శాతం మూలవాటానునియంత్రణను కొనుగోలుదారు స్వాధీనం చేసుకుంటుంది.

కొనుగోలుదారు.. బీఎస్ఈభారత జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజిలో లిస్టింగ్ అయిన పబ్లిక్ కంపెనీఇది ప్రైవేటు రంగంలోని థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సంస్థగుజరాత్మహారాష్ట్రకర్ణాటకఛత్తీస్‌గడ్మధ్యప్రదేశ్జార్ఖండ్తమిళనాడుల్లో ఉన్న థర్మల్ విద్యుత్ ప్లాంట్లను నిర్వహిస్తోందిఅలాగే గుజరాత్‌లో 40 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్‌ను కూడా నిర్వహిస్తోంది.

లక్షిత సంస్థ జీవీకే పవర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థకు అనుబంధంగా ఉన్న పబ్లిక్ లిమిటెడ్ సంస్థతనకు అనుబంధ సంస్థ అయిన ఏహెచ్‌పీఎల్ ద్వారా ఉత్తరాఖండ్‌లోని శ్రీనగర్‌లో 330 మెగావాట్ల హైడ్రోఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్టు నుంచి విద్యుత్తు ఉత్పత్తి చేస్తుందిఏహెచ్‌పీఎల్ నిర్వహణమరమ్మతులను లక్షిత సంస్థ చేపడుతుంది.

వివరణాత్మక ఉత్తర్వును కమిషన్ తర్వాత జారీ చేస్తుంది.

 

(రిలీజ్ ఐడి: 2260518) సందర్శకుల సూచీ సంఖ్య : : 12
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Gujarati , Urdu , हिन्दी