ప్రధాన మంత్రి కార్యాలయం
సోమనాథ్ అమృత్ మహోత్సవంలో తన ప్రసంగంలోని విశేషాలను పంచుకున్న ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
11 MAY 2026 5:22PM by PIB Hyderabad
సోమనాథ్ అమృత్ మహోత్సవంలో తన ప్రసంగంలోని విశేషాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు పంచుకున్నారు. ఈ మహోత్సవం కేవలం గతాన్ని స్మరించుకునే వేడుక మాత్రమే కాదని, రాబోయే వెయ్యి సంవత్సరాల పాటు దేశానికి స్ఫూర్తినిచ్చే పండుగ కూడా అని ఆయన స్పష్టం చేశారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా చేసిన వరుస పోస్టుల్లో ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.
‘‘సోమనాథ్ అమృత్ మహోత్సవం కేవలం గతాన్ని స్మరించుకునే ఉత్సవం మాత్రమే కాదు. రాబోయే వెయ్యి సంవత్సరాల వరకు దేశానికి స్ఫూర్తినిచ్చే పండుగ కూడా’’
‘‘1998లో పోఖ్రాన్ అణు పరీక్షలతో దేశ శాస్త్రవేత్తల సామర్థ్యాన్ని ప్రపంచం గుర్తించింది. ఆ తర్వాత ప్రతి సంక్షోభాన్ని భారత్ ఎంతటి దృఢత్వంతో ఎదిరించిందో చూసి ప్రపంచమే విస్మయానికి గురైంది’’
‘‘సర్దార్ పటేల్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, కేఎం మున్షీ సహా మన దేశంలో ఎందరో గొప్ప మహానుభావులు సోమనాథ్ సేవలో తమ సర్వస్వాన్ని అర్పించారు. మన సాంస్కృతిక వారసత్వాన్ని నిరంతరం ముందుకు తీసుకెళ్లడానికి వారి స్మృతులు మనకు స్పూర్తినిస్తాయి’’
"మన సాంస్కృతిక కేంద్రాలు వేల సంవత్సరాలుగా దేశానికి గుర్తింపుగా నిలిచాయి. కానీ దురదృష్టవశాత్తూ సోమనాథ్ వంటి ఆత్మాభిమానానికి సంబంధించిన విషయం కంటే స్వార్థ రాజకీయాలకు విలువనిచ్చే వ్యక్తులు నేటికీ దేశంలో ఉన్నారు’’
‘‘దేశవ్యాప్తంగా ఉన్న పవిత్ర తీర్థక్షేత్రాలను అభివృద్ధి చేసే భాగ్యం నాకు లభించింది. పవిత్రమైన సోమనాథ్ ఆలయ సముదాయం దీనికి ఒక శక్తిమంతమైన నిదర్శనం’’
‘‘75 ఏళ్ల క్రితం పునర్నిర్మించిన సోమనాథ్ ఆలయంలో ప్రాణ ప్రతిష్ఠ జరిగినప్పుడు దేశం ఒక కొత్త ప్రయాణాన్ని ప్రారంభించింది. నేడు ఆ ప్రయాణం మరింత విస్తృత రూపంలో మన ముందు ఉంది. దీనిని మనం కొత్త శిఖరాలకు చేర్చాలి’’
***
(రిలీజ్ ఐడి: 2260157)
సందర్శకుల సూచీ సంఖ్య : : 4
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam