ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

సోమనాథ్‌లో ఐఏఎఫ్‌కు చెందిన సూర్యకిరణ్ బృందం విస్తుగొలిపే విన్యాసాలను వీక్షించిన ప్రధానమంత్రి


గౌరవం, పరాక్రమాల అద్భత కలయిక ఈ ప్రదర్శన అని స్పష్టం చేసిన పీఎం

నాడు పోస్టు చేయడమైనది: 11 MAY 2026 4:13PM by PIB Hyderabad

పవిత్రమైన సోమనాథ్ అమృత్ మహోత్సవం సందర్భంగా భారత వైమానిక దళానికి చెందిన సూర్యకిరణ్ బృందం ప్రదర్శించిన అద్భుతమైన విన్యాసాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తిలకించారు.

సోమనాథ్ ఆలయ గగనతలంపై త్రివర్ణ పతాకంకాషాయ రంగుల కలయికతో పరాక్రమం, గర్వం ఉట్టిపడేలా సాగిన విన్యాసాలను ప్రధానమంత్రి ప్రశంసించారు. ఈ అద్భుతమైన దృశ్యం భక్తికి, శక్తికి నిదర్శనమని, ఇది ప్రతి భారతీయుడి హృదయాన్ని ఆనందంతో గర్వపడేలా చేసిందని శ్రీ  నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

వరుస ఎక్స్ పోస్టుల్లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

‘‘ఈ రోజు సోమనాథ్‌లో భక్తి, శౌర్యాల అద్భుత సంగమం ఆవిష్కృతమైంది. భారత వైమానిక దళానికి చెందిన సూర్యకిరణ్ బృందం కళ్లు చెదిరే విన్యాసాలతో అందరినీ అలరించింది. భక్తి, శక్తి స్ఫూర్తితో సాగిన ఈ ప్రదర్శనను వీక్షించిన ప్రతి ఒక్కరి హృదయం ఆనందంతో ఉప్పొంగింది.

సోమనాథ్ అమృత్ మహోత్సవ శుభ సందర్భంగా గౌరవం, పరాక్రమాల అద్భుత కలయిక ఆకాశంలో ఆవిష్కృతమైంది. భారత వైమానిక దళానికి చెందిన సూర్య కిరణ్ బృందం.. సోమనాథ్ ఆలయంపై విన్యాసాలు చేస్తూ కాషాయం, త్రివర్ణ రంగులతో ఆకాశాన్ని నింపింది. భక్తి, శక్తి కలగలిసిన ఈ దృశ్యం ప్రతి భారతీయుడి మనసును గర్వంతో నింపింది!’’

***


(రిలీజ్ ఐడి: 2259884) సందర్శకుల సూచీ సంఖ్య : : 14