భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు కార్యాలయం
azadi ka amrit mahotsav

ఇండియా, ఈయూ వాణిజ్య సాంకేతిక మండలి (టీటీసీ) వర్కింగ్ గ్రూపు -2 పరిధిలో ఈవీ బ్యాటరీల రీసైక్లింగుకు 15.2 మిలియన్ యూరోల (దాదాపు రూ.169 కోట్లు) విలువైన ఉమ్మడి కార్యక్రమాన్ని ప్రారంభించిన భారత్, ఈయూ

నాడు పోస్టు చేయడమైనది: 06 MAY 2026 12:40PM by PIB Hyderabad

హరితశుద్ధ ఇంధన సాంకేతిక పరిజ్ఞానాలపై భారత్ఈయూ వాణిజ్యం-సాంకేతిక మండలి (టీటీసీవర్కింగ్ గ్రూపు పరిధిలో ఈవీ బ్యాటరీల రీసైక్లింగుకు సంబంధించి మూడో విడత ప్రతిపాదనల ఉమ్మడి స్వీకరణను ప్రారంభించామని 2026 మే 5న భారత ప్రభుత్వంయూరోపియన్ యూనియన్ ప్రకటించాయిప్రతిపాదనలను సమర్పించడానికి చివరి తేదీ 2026 సెప్టెంబరు 15.

కీలకమైన ముడి ఖనిజాల భద్రతను నిర్ధారించడంపునర్వినియోగ ఆర్థిక వ్యవస్థ దిశగా ప్రపంచ మార్పును వేగవంతం చేయడంభారత్యూరోపియన్ యూనియన్ (ఈయూమధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యందీని కోసం 15.2 మిలియన్ యూరోల (దాదాపు రూ.169 కోట్లు)తో సంయుక్తంగా నిధిని ఏర్పాటు చేశారుదీనికి ఈయూ తరఫున హొరైజాన్ యూరోప్ ప్రోగ్రామ్భారత్ తరఫున భారీ పరిశ్రమల శాఖ (ఎంహెచ్ఐనిధులు సమకూర్చాయి.

అధిక సామర్థ్యం ఉన్న ఖనిజాల సేకరణసురక్షితమైనడిజిటలైజ్ చేసిన సేకరణ వ్యవస్థలుఆవిష్కరణాత్మక ప్రక్రియలను ప్రయోగాత్మకంగా ప్రదర్శించడం సహా అధునాతన రీసైక్లింగ్ సాంకేతికతలను అభివృద్ధి చేయడంపై ఈ కార్యక్రమం దృష్టి సారిస్తుందిప్రముఖ పరిశోధకులుపరిశ్రమలుఅంకుర సంస్థలను ఒక్కచోట చేర్చి.. వాస్తవ ప్రపంచ ధ్రువీకరణనుపారిశ్రామిక విస్తరణను సాధ్యం చేయడానికి భారత్‌లో ఉమ్మడి భారత్-ఈయూ పైలట్ లైన్‌ను ఏర్పాటు చేసేందుకు కూడా తోడ్పడుతుందిలిథియంగ్రాఫైట్కోబాల్ట్ లాంటి సంక్లిష్ట ఖనిజాలకు సంబంధించి అధిక రికవరీ రేటుమిశ్రమ రసాయన నిర్వహణరవాణా-చేరికరక్షణ-పునర్వినియోగంపై ఈ ప్రతిపాదనలు దృష్టి సారిస్తాయి.

భారత్-ఈయూ వ్యూహాత్మక భాగస్వామ్యంలో ప్రతిపాదనల స్వీకరణ ప్రారంభం ముఖ్యమైన సందర్భమని భారత ప్రభుత్వానికి ముఖ్య శాస్త్రీయ సలహాదారు... ప్రొఫెసర్ అజయ్ కుమార్ సూద్ వర్ణించారుభారత్‌లో ఈవీ మార్కెట్టు వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో మన వనరుల భద్రతకుపర్యావరణ లక్ష్యాలకు దేశీయంగా విస్తృతమైన రీసైక్లింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయడం అవసరం.

పర్యావరణ అనుకూలమైన మార్పులకు సంబంధించి ప్రధానాంశంగా బ్యాటరీల ప్రాధాన్యాన్ని భారత్‌లో యూరోపియన్ యూనియన్ రాయబారి శ్రీ హెర్వ్ డెల్ఫిన్ వివరించారుఆవిష్కరణలను అభివృద్ధి దశ నుంచి ఆచరణాత్మక వినియోగం వరకు వచ్చి తద్వారా ఖనిజ భద్రతఉమ్మడి పర్యావరణ లక్ష్యాల్లో నేరుగా పెట్టుబడులు పెట్టొచ్చు.

భారత దేశ పునర్వినియోగ ఆర్థిక వ్యవస్థలో ముఖ్యమైన దశను ఈ ఉమ్మడి కార్యక్రమం సూచిస్తుందని పీఎస్ఏ కార్యాలయానికి శాస్త్రీయ సలహాదారుగా వ్యవహరిస్తున్న డాక్టర్ పర్వీందర్ మైనీ అన్నారుఅసంఘటిత రంగాన్ని ఏకీకృతం చేస్తూపునర్వినియోగ వస్తువులకు అత్యున్నత భద్రతా ప్రమాణాలను నిర్ధారించే డిజిటలీకరించినసమగ్ర రవాణా విధానాన్ని వేగవంతం చేస్తుందని వివరించారు.

హరిత ఆవిష్కరణల్లో భారత్ఈయూ మధ్య సంబంధాన్ని బలోపేతం చేయాలని యూరోపియన్ కమిషన్ పరిశోధనాభివృద్ధి డైరెక్టరేట్ జనరల్ డైరెక్టర్ జనరల్ శ్రీ మార్క్ లైమెట్రే స్పష్టం చేశారుభవిష్యత్తు అవసరాల కోసం వ్యూహాత్మకమైన ఖనిజాలు మన ఆర్థిక వ్యవస్థలకు మాత్రమే అందుబాటులో ఉండేలా స్థిరమైనఖండాంతర విలువ ఆధారిత వ్యవస్థను సంయుక్తంగా ఏర్పాటు చేయాలన్నారు.

***


(రిలీజ్ ఐడి: 2258554) సందర్శకుల సూచీ సంఖ్య : : 10
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Gujarati