ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

సత్యం, పట్టుదల విలువను తెలియజెప్పే సంస్కృత సుభాషితాన్ని పంచుకున్న ప్రధాని

प्रविष्टि तिथि: 05 MAY 2026 9:47AM by PIB Hyderabad

అలుపెరగని కృషితోసత్య మార్గంలో పయనించడం ద్వారా సాధించిన విజయం శాశ్వతమైందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారుఇలాంటి విజయం ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడమే కాకుండా గొప్ప మానసిక సంతృప్తిని కూడా ఇస్తుందని పేర్కొన్నారు.
ప్రధానమంత్రి పంచుకున్న సంస్కృత సుభాషితం-

‘‘న తథా బలవీర్యాభ్యాం జయంతి విజిగీషవః

యథా సత్యానృశంస్యాభ్యాం ధర్మేణైవోద్యమేన చ’’
గెలవాలన్న కోరికతో ఉన్నవారు సామర్థ్యంబలంతో మాత్రమే కాకుండా సత్యంకరుణధర్మంనిరంతర కృషి ద్వారా కూడా విజయం సాధిస్తారని ఈ సుభాషితం తెలియజేస్తోంది.
ప్రధానమంత్రి ఎక్స్‌లో ఇలా రాశారు:
‘‘
అలుపెరగని శ్రమసత్య మార్గంలో నడవడం ద్వారా పొందే విజయం శాశ్వతంగా ఉంటుందిదీనివల్ల ఆత్మవిశ్వాసం పెరగడమే కాకుండామనస్సుకు గొప్ప సంతృప్తి కూడా లభిస్తుంది
‘‘న తథా బలవీర్యాభ్యాం జయంతి విజిగీషవః

యథా సత్యానృశంస్యాభ్యాం ధర్మేణైవోద్యమేన చ’’

 

***


(रिलीज़ आईडी: 2257969) आगंतुक पटल : 58
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Bengali-TR , Assamese , Punjabi , Gujarati , Kannada , Malayalam