ప్రధాన మంత్రి కార్యాలయం
మిషన్ దృష్టిని విజయవంతంగా ప్రారంభించిన గెలాక్సీఐని అభినందించిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
03 MAY 2026 3:16PM by PIB Hyderabad
మిషన్ దృష్టిని విజయవంతంగా ప్రారంభించిన గెలాక్సీఐ వ్యవస్థాపకులకు, మొత్తం బృందానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.
భారత అంతరిక్ష ప్రయాణంలో గెలాక్సీ చేపట్టిన 'మిషన్ దృష్టి' కీలక విజయమని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ప్రపంచంలోనే తొలి ఆప్టోసార్ ఉపగ్రహం, దేశంలోనే అతిపెద్ద ప్రైవేటు ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించడం... ఆవిష్కరణల పట్ల, దేశ నిర్మాణం పట్ల యువత అభిరుచికి నిదర్శనమని శ్రీ మోదీ ప్రధానంగా ప్రస్తావించారు. గెలాక్సీ వ్యవస్థాపకులకు, వారి బృందానికి ప్రధానమంత్రి హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలూ తెలిపారు.
‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
గెలాక్సీఐ చేపట్టిన 'మిషన్ దృష్టి' మన అంతరిక్ష ప్రయాణంలో కీలక విజయంగా నిలుస్తుంది. ప్రపంచంలోనే తొలి ఆప్టోసార్ ఉపగ్రహం, దేశంలోనే అతిపెద్ద ప్రైవేటు ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించడం... ఆవిష్కరణల పట్ల, దేశ నిర్మాణం పట్ల మన యువత అభిరుచికి నిదర్శనం.
గెలాక్సీఐ వ్యవస్థాపకులకు, వారి బృందమంతటికీ హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు.”
(रिलीज़ आईडी: 2257658)
आगंतुक पटल : 90
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Bengali
,
Bengali-TR
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam