ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

డీజిల్... విమాన ఇంధనం (ఏటీఎఫ్‌) ఎగుమతిపై ఈ నెల 1 నుంచి 15 రోజులు వర్తించేలా ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకం (ఎస్‌ఈఏడీ) సవరణ


· రహదారులు... మౌలిక సదుపాయాల సెస్సు (ఆర్‌ఐసి) శాతాన్ని కూడా ప్రకటించిన ప్రభుత్వం

· డీజిల్ ఎగుమతిపై సుంకం లీటరుకు రూ.23 (ఆర్‌ఐసి- సున్నా... ఏటీఎఫ్‌పై లీటరుకు రూ.33 (ఎస్‌ఏఈడీ).. పెట్రోల్ ఎగుమతులపైనా సున్నా సుంకం

· దేశీయ వినియోగంలో పెట్రోల్.. డీజిల్‌పై ప్రస్తుత ఎక్సైజ్ సుంకంలో ఎలాంటి మార్పు లేదు

నాడు పోస్టు చేయడమైనది: 30 APR 2026 10:54PM by PIB Hyderabad

పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతి నిరోధం ద్వారా దేశీయ లభ్యతకు భరోసా ఇస్తూ పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం (ఏటీఎఫ్‌) ఎగుమతిపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకంతోపాటు రహదారులు-మౌలిక సదుపాయాల సెస్సు (ఆర్‌ఐసీ) వంటి ఎగుమతి సుంకాలను ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 27 నుంచి అమలులోకి తెచ్చింది. అయితే, వీటి విధింపును ప్రతి 15 రోజులకు ఒకసారి సవరిస్తున్న క్రమంలో చివరి సవరణ 2026 ఏప్రిల్‌ 11న అమలులోకి వచ్చింది. ఈ ఉత్పత్తుల ధరలపై చివరి సమీక్ష నాటి నుంచి ముడి చమురు, పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్‌ సగటు అంతర్జాతీయ ధరల ఆధారంగా వీటిపై సుంకం, సెస్సును ప్రభుత్వం నిర్దేశించింది.

ఈ విధానానికి అనుగుణంగా 2026 మే 1 నుంచి తదుపరి 15 రోజుల సుంకం, సెస్సు శాతాన్ని కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ప్రకటించింది. దీని ప్రకారం- డీజిల్ ఎగుమతులపై లీటరుకు ‘ఎస్‌ఏఈడీ’ రూ.23 (ఆర్‌ఐసీ-సున్నా) కాగా, ఏటీఎఫ్‌ ఎగుమతిపై లీటరుకు (ఎస్‌ఏఈడీ మాత్రమే) రూ.33గా ఉంటుంది. అయితే, పెట్రోల్ ఎగుమతిపై సుంకం సున్నాగానే కొనసాగుతుంది.

దేశీయ వినియోగానికి అనుమతించిన పెట్రోల్.. డీజిల్‌పై ప్రస్తుత ఎక్సైజ్ సుంకంలో ఎలాంటి మార్పు లేదు.

సంబంధిత నోటిఫికేషన్ నం.19/2026 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


(రిలీజ్ ఐడి: 2257277) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , हिन्दी