ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

గుజరాత్‌ ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు

నాడు పోస్టు చేయడమైనది: 01 MAY 2026 9:14AM by PIB Hyderabad

గుజరాత్‌ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఆ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ ద్వారా పంపిన ఆత్మీయ సందేశంలో:

“గుజరాత్ వ్యవస్థాపన దినోత్సవ ప్రత్యేక సందర్భంలో రాష్ట్ర ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. గుజరాత్ సుసంపన్న చరిత్ర, ఉజ్వల సంస్కృతి, అద్భుత స్ఫూర్తికి ప్రతీకగా ఇవాళ మనం వేడుకలు నిర్వహించుకుంటున్నాం. దేశ ప్రగతిలో ఈ రాష్ట్రం తన వంతుగా అద్భుత పాత్ర పోషిస్తోంది. ఇక్కడి ప్రజల చైతన్యయుత, సాహసోపేత స్వభావం ఎంతయినా ప్రశంసనీయం. భవిష్యత్తులో గుజరాత్ సమున్నత ప్రగతి శిఖరాలను అధిరోహించాలని ప్రగాఢంగా ఆకాంక్షిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.


(రిలీజ్ ఐడి: 2257273) సందర్శకుల సూచీ సంఖ్య : : 8
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Bengali , English , Urdu , Marathi , हिन्दी , Assamese , Manipuri , Gujarati , Kannada