ప్రధాన మంత్రి కార్యాలయం
ఒక ప్రతినిధి సిసలు సంకల్పాన్ని చెప్పే సంస్కృత సుభాషితాన్ని పంచుకున్న ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
29 APR 2026 8:41AM by PIB Hyderabad
ఒక ప్రతినిధి నిజమైన సంకల్పాన్ని వివరిస్తున్న సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.
దేశంలో చైతన్యవంతులైన పౌరులు ప్రజాస్వామ్యాన్ని మరింత శక్తిమంతంగా తీర్చిదిద్దడానికి రికార్డు స్థాయిలో ఓటు హక్కును వినియోగించుకోవడంలో పాలుపంచుకోవడాన్ని కర్తవ్యంగా పాలించాలని ప్రధానమంత్రి తెలిపారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి శ్రీ మోదీ పొందుపరుస్తూ -
‘‘మన ప్రజాస్వామ్యాన్ని ఇప్పటి కంటే ఎక్కువ శక్తిమంతమైందిగా తీర్చిదిద్దుకోవడానికి చైతన్యవంతులైన దేశ పౌరులుగా రికార్డు స్థాయిలో ఓటింగులో పాలు పంచుకోవడం మన అందరి కర్తవ్యం. ఈ విధంగా చేసి, మనం భరతవర్షం నవ నిర్మాణంలో మన వంతుగా చురుకైన భాగస్వామ్యాన్ని అందించ గలగడం ఒక్కటే కాకుండా, సమర్థ - సమృద్ధ దేశ భవిష్యత్ పునాదిని కూడా పటిష్ఠపరచ గలుగుతాం.
‘‘రాజ్ఞో హి వ్రతమృత్థానం యజ్ఞః కార్యానుశాసనమ్
దక్షిణా వృత్తిసామ్యం చ దీక్షితస్యాభిషేచనమ్’’ అని పేర్కొన్నారు.
ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని, వారిని నిరంతరం ఉద్ధరించడానికి కృషి చేస్తుండడం, కర్తవ్యాలను పవిత్ర బాధ్యతలుగా భావించి నిష్ఠతో నిర్వహించడం, నిష్పాక్షిక న్యాయాన్ని నిర్ధారించడం, ఉదార దాన గుణాన్ని అలవరుచుకోవడం, అందరితో సమానంగా మెలగడంతో పాటు, నిన్ను నీవు పవిత్రంగా ఉంచుకుంటూ, క్రమశిక్షణ పూర్వకంగా, అంకితభావంతో నడుచుకోవడం.. ఇవీ ఒక ప్రతినిధి యథార్థ సంకల్పాలు అని ఈ సుభాషితం మనకు బోధిస్తోంది.
***
(రిలీజ్ ఐడి: 2256502)
సందర్శకుల సూచీ సంఖ్య : : 9
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Manipuri
,
Gujarati
,
Kannada
,
Malayalam