ఆయుష్
azadi ka amrit mahotsav

అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 కు విస్తృత ఏర్పాట్లు చేస్తున్న ఆయుష్ మంత్రిత్వ శాఖ


యోగా దినోత్సవాన్ని ప్రభావవంతంగా నిర్వహించేందుకు ప్రణాళికను సిద్ధం చేసిన ఉన్నతస్థాయి ప్రధాన కమిటీ

ఘనంగా వేడుకల నిర్వహణ కోసం సమగ్ర ప్రభుత్వ దృక్పథానికి ప్రాధాన్యత ఇచ్చిన ఆయుష్ మంత్రిత్వ శాఖ

నాడు పోస్టు చేయడమైనది: 28 APR 2026 6:30PM by PIB Hyderabad

 

అంతర్జాతీయ యోగ దినోత్సవం 2026 ను ఘనంగాప్రభావవంతంగా నిర్వహించే దిశగా కీలక అడుగు వేస్తూ ఆయుష్ మంత్రిత్వ శాఖ ఈరోజు ఉన్నత స్థాయి ప్రధాన కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసిందిఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వైద్య రాజేష్ కొటేచా ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు.  భారత ప్రభుత్వ కీలక మంత్రిత్వ శాఖలు,  విభాగాల ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు.

హోంవిదేశీ వ్యవహారాలుసంస్కృతిసమాచార ప్రసారఎలక్ట్రానిక్స్,  సమాచార సాంకేతికతరక్షణరైల్వేపంచాయతీ రాజ్ఈశాన్య ప్రాంత అభివృద్ధిమహిళా శిశు అభివృద్ధిపర్యావరణఅటవీ వాతావరణ మార్పు మొదలైన కీలక మంత్రిత్వ శాఖలు ఈ సమావేశంలో పాల్గొన్నాయిఆరోగ్య కుటుంబ సంక్షేమఆరోగ్య పరిశోధనపాఠశాల విద్య -  అక్షరాస్యతఉన్నత విద్యయువజన వ్యవహారాలుక్రీడలుతపాలా విభాగాలు కూడా ప్రాతినిధ్యం వహించాయి.

ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి మాట్లాడుతూయోగా దినోత్సవం నిర్వహణలో ప్రభుత్వ నిబద్ధతను పునరుద్ఘాటించారుఅంతర్జాతీయ యోగ దినోత్సవం 2026 గత సంవత్సరాల్లో ఏర్పరిచిన బలమైన పునాదిపై నిర్మితమవుతుందనిప్రజల భాగస్వామ్యంఅంతర్జాతీయ సహకారంలో కొత్త కోణాలను ప్రవేశపెడుతుందని ఆయన చెప్పారుఆరోగ్యంసామరస్యంసామూహిక శ్రేయస్సు కోసం యోగా  ఒక శక్తిమంతమైన సాధనమనిఅన్ని మంత్రిత్వ శాఖలుభాగస్వాముల సమన్వయ ప్రయత్నాలు యోగ అంతర్జాతీయ స్థాయిని మరింత పెంచుతాయని ఆయన పేర్కొన్నారు.

వివిధ మంత్రిత్వ శాఖలుఆయా విభాగాల ప్రాతినిధ్యంతోఈ సమావేశం సంస్థాగత ఏకీకరణసన్నాహక సమీక్షసమన్వయ చర్యలకు కీలక వేదికగా నిలిచిందిఆయుష్ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి మోనాలిసా డాష్ ఈ సమావేశాన్ని నిర్వహించారుఆయుష్ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి అలర్మేల్మంగై డి.  మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు.

 

అంతర్జాతీయ యోగ దినోత్సవం ప్రపంచ విస్తృతినిస్థాయినిప్రభావాన్ని వివరిస్తూ సమావేశంలో సమగ్ర వివరణ ఇచ్చారుఅంతర్జాతీయ యోగ దినోత్సవం 2026 స్థాయినివిస్తృతినిప్రభావాన్ని మరింత పెంచేలా వివిధ మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయం బలోపేతం చేయడంపై ప్రధానంగా చర్చించారుసమాజంలోని అన్ని వర్గాల దైనందిన జీవితంలో యోగాను భాగం చేసేలాప్రణాళికాబద్ధమైన ప్రచార వ్యూహాలుప్రజా భాగస్వామ్యం పెంపువినూత్న కార్యక్రమాలపై దృష్టి సారించారుయోగా ద్వారా సమగ్ర ఆరోగ్యంఆరోగ్య సంరక్షణసంపూర్ణ శ్రేయస్సు పెంపొందించే విస్తృత లక్ష్యంతో తమ కార్యక్రమాలను అనుసంధానించాలని మంత్రిత్వ శాఖలను కోరారు.

గత యోగా దినోత్సవాల అపూర్వ విజయాన్ని, 2025లో సాధించిన విస్తృత ప్రచారాన్ని ఆధారంగా చేసుకుని అంతర్జాతీయ యోగ దినోత్సవం 2026 కోసం ప్రభుత్వం సమగ్ర ప్రభుత్వ దృక్పథాన్ని అనుసరిస్తోందని ఆయుష్ మంత్రిత్వ శాఖ పేర్కొందిప్రణాళికాబద్ధమైన ప్రచారాలుడిజిటల్ భాగస్వామ్య వ్యూహాలుసమ్మిళితత్వంస్థిరత్వంయువత భాగస్వామ్యంపై దృష్టి సారించిన నేపథ్య కార్యక్రమాలు వంటి సన్నాహక ప్రయత్నాలు చురుకుగా సాగుతున్నాయి.

గుర్తింపు కలిగిన ప్రముఖ ప్రదేశాలలో యోగ ప్రదర్శనలు నిర్వహించడంప్రపంచవ్యాప్త ప్రచారాన్ని విస్తరించడంరాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలలో సంస్థాగత భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం వంటి ప్రణాళికలను సమావేశం సమీక్షించింది.

పన్నెండవ అంతర్జాతీయ యోగ దినోత్సవం భారత్ లోనూప్రపంచవ్యాప్తంగానూ అపూర్వమైన స్థాయిదృశ్యమానతప్రభావంతో జరగాలనిఅందుకు అన్ని మంత్రిత్వ శాఖలువిభాగాలు సమన్వయంతో పనిచేయాలనే ఉమ్మడి సంకల్పంతో సమావేశం ముగిసింది.

 

***


(రిలీజ్ ఐడి: 2256400) సందర్శకుల సూచీ సంఖ్య : : 11
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Urdu , हिन्दी , Gujarati