ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పురోగతికి మూలకారణాలను చెప్పే సంస్కృత సుభాషితాన్ని పంచుకున్న ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 28 APR 2026 8:11AM by PIB Hyderabad

సంస్కృత భాషలోని ఓ సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ  నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారు. ప్రయత్నం, సంయమనం, నైపుణ్యం, అప్రమత్తంగా ఉండడం, సహన గుణం, జ్ఞాపక శక్తి, ఏదైనా పనిని అన్నీ ఆలోచించిన తరువాతనే మొదలుపెట్టడం వంటివి మనిషి పురోగతికి మూల కారణాలు అవుతాయని ఆ సుభాషితం మనకు బోధిస్తుంది.
సహనంతో, అంకితభావంతో పట్టు బట్టి కృషి చేస్తే అసాధారణ విజయం అందుతుందని, ఇది దేశ సమృద్ధిలో, సామర్థ్యంలో ఓ కొత్త శక్తిని కూడా ప్రవహింపచేస్తుందని ప్రధానమంత్రి అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో  ప్రధానమంత్రి శ్రీ మోదీ  ఒక సందేశాన్ని పొందుపరుస్తూ -
‘‘సంయమనంతో, అంకిత భావంతో కష్టపడినప్పుడు అది అద్భుత విజయాన్ని అందిస్తుంది. ఇది దేశ సమృద్ధికి, సామర్థ్యానికి ఒక కొత్త శక్తిని కూడా ప్రవహింప చేస్తుంది.
ఉత్థానం సంయమో దాక్ష్యమప్రమాదో ధృతిః స్మృతిః
సమీక్ష్య చ సమారమ్భో విధ్ధిమూలం భవస్య తు.’’
ప్రయత్నం, సంయమనం, నైపుణ్యం, అప్రమత్తంగా ఉండడం, ఓర్పుతో మెలగడం, జ్ఞాపక శక్తిని పెంచుకోవడం, ఏదైనా పనిని బాగా ఆలోచించి మొదలుపెడుతుండడం.. ఇవన్నీ పురోగతికి మూల కారణాలు అవుతాయి’’ అని పేర్కొన్నారు.

***


(రిలీజ్ ఐడి: 2256159) సందర్శకుల సూచీ సంఖ్య : : 4
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati