భారత ఎన్నికల సంఘం
సాధారణ ఎన్నికలు, ఉప ఎన్నికలు 2026: పశ్చిమ బెంగాల్‌లో రూ.510 కోట్లకు పైబడి జప్తు చేసిన మొత్తం
నాడు పోస్టు చేయడమైనది:
27 APR 2026 3:49PM by PIB Hyderabad
భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ విధాన సభలకు సాధారణ ఎన్నికలు, ఉప ఎన్నికల షెడ్యూలును 2026 మార్చి నెల 15న ప్రకటించింది. ఆదర్శ ప్రవర్తన నియమావళి (ఎమ్‌సీసీ)ను ఖచ్చితంగా పాటించేటట్లు చూడాల్సిందిగా రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కమిషన్ ఆదేశాలిచ్చింది.
ఎన్నికలు జరిగే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో పాటు వాటి సరిహద్దు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యనిర్వహణ అధికారులు (సీఈఓలు), డీజీపీలు, ఇతర సీనియర్ అధికారులతో, నేర నియంత్రణ సంస్థల ప్రధానాధికారులతో కమిషన్ అనేక సార్లు సమీక్షా సమావేశాలను నిర్వహించింది. ఎన్నికల సందర్భంగా హింస, బెదరింపులు, ప్రలోభాల వంటివి చోటుచేసుకోకుండా చూడాల్సిందని వారిని ఆదేశించింది.
ఈ దిశగా, మొత్తం 2,728 కన్నా ఎక్కువ ఆకస్మిక తనిఖీ బృందాలను (ఎఫ్ఎస్‌టీస్) రంగంలోకి దించారు. ఫిర్యాదులను 100 నిమిషాల లోపల పరిష్కరించాలన్నదే ఈ చర్య వెనుక ఉన్న ఉద్దేశం. దీనికి అదనంగా, వేర్వేరు స్థానాల్లో ఆకస్మిక నాకాలను ఏర్పాటు చేశారు. 3,142 స్టాటిక్ సర్వేలెన్స్ టీములను (ఎస్ఎస్‌టీస్) కూడా మోహరించారు. దొంగసారా తయారీ, నిల్వ, పంపిణీకి వ్యతిరేకంగా ప్రత్యేక డ్రైవ్‌లను కూడా నిర్వహిస్తున్నారు.
ఎలక్షన్ సీజర్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఈఎస్ఎమ్ఎస్)ను 2026 ఫిబ్రవరి 26 నాటి నుంచి అమల్లోకి తీసుకువచ్చినప్పటి నుంచి 2026 ఏప్రిల్ 27 వరకు సమాచారాన్ని కింద పేర్కొనడమైంది.
|
రాష్ట్రం
|
నగదు
(రూ. కోట్లలో)
|
సారాయి పరిమాణం (లీటర్లు)
|
సారాయి
విలువ
(రూ.కోట్లు)
|
మత్తు పదార్థాల
విలువ
(రూ.కోట్లు)
|
విలువైన లోహం
(రూ.కోెట్లు)
|
ఉచితంగా
ఇచ్చినవి, ఇతరత్రా
(రూ. కోట్లు)
|
మొత్తం
(రూ.కోట్లు)
|
|
పశ్చిమ
బెంగాల్
|
30.00
|
48,46,183
|
126.85
|
110.12
|
58.28
|
184.85
|
510.10
|
దీంతో పశ్చిమ బెంగాల్‌లో దొంగచాటు ప్రలోభాల్లో ఉపయోగిస్తున్న వస్తువుల మొత్తం జప్లు రూ.510 కోట్ల కన్న ఎక్కువగా నమోదయ్యాయి. ఇది 2021లోని జీఈఎల్ఏ కాలంలో రాష్ట్రంలో నమోదైన స్వాధీన రాశి రూ.339 కోట్ల కన్న ఎక్కువగా ఉంది.
***
(రిలీజ్ ఐడి: 2255971)
సందర్శకుల సూచీ సంఖ్య : : 22