ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానితో శ్రీ అశోక్ కుమార్ లాహిరి భేటీ

నాడు పోస్టు చేయడమైనది: 25 APR 2026 10:43PM by PIB Hyderabad

శ్రీ అశోక్ కుమార్ లాహిరి ఈ రోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారునీతి ఆయోగ్ వైస్ చైర్మన్‌గా నియమితులైన ఆయనకు శ్రీ మోదీ శుభాకాంక్షలు తెలిపారుఆర్థిక శాస్త్రంప్రభుత్వ విధాన రంగాల్లో శ్రీ లాహిరి అపారమైన అనుభవం.. దేశ సంస్కరణల పథాన్ని మరింత పటిష్టం చేస్తుందనీవికసిత భారత్‌గా నిలవాలన్న దేశ సంకల్పాన్ని సాకారం చేయడంలోనూ దోహదపడుతుందనీ ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

శ్రీ అశోక్ కుమార్ లాహిరిని కలిశానునీతి ఆయోగ్ వైస్‌ చైర్మన్ గా నియమితులైన ఆయనకు శుభాకాంక్షలు తెలిపానుఆర్థిక శాస్త్రంప్రభుత్వ విధాన రంగాల్లో ఆయనకున్న అపారమైన అనుభవం దేశ సంస్కరణల పథాన్ని మరింత పటిష్టం చేస్తుందివికసిత భారత్ దిశగా దేశ ప్రస్థానం వేగవంతమవుతుందిఆయన కృషి దేశంలో విధాన రూపకల్పనకు మరింత ఉత్తేజాన్నిస్తుందన్న దృఢమైన విశ్వాసం నాకుందిపదవీకాలాన్ని ఫలప్రదంగా కొనసాగించాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్నాను.”


(రిలీజ్ ఐడి: 2255726) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , हिन्दी , Assamese , Bengali , Manipuri , Gujarati , Kannada