జాతీయ మానవ హక్కుల కమిషన్
azadi ka amrit mahotsav

పారిపోయిందన్న ఆరోపణతో.. భర్తను భుజాలపై మోయిస్తూ గ్రామస్తులు ఓ మహిళను ఊరేగించిన ఘటనను సుమోటోగా స్వీకరించిన ఎన్‌హెచ్ఆర్సీ: మధ్యప్రదేశ్‌లోని ఝాబవా జిల్లాలో ఘటన


మహిళకు గుండు కూడా చేశారని పేర్కొన్న మీడియా కథనాలు

ఝాబవా జిల్లా మెజిస్ట్రేట్, ఎస్పీలకు కమిషన్ నోటీసులు.. రెండు వారాల్లోగా సమగ్ర నివేదికను అందించాలని ఆదేశాలు

దర్యాప్తులో పురోగతి, బాధితురాలికి పరిహారం (ఒకవేళ ఇస్తే) వివరాలను కూడా చెప్పాలన్న కమిషన్

నాడు పోస్టు చేయడమైనది: 24 APR 2026 12:56PM by PIB Hyderabad

పారిపోయిందన్న ఆరోపణలపైభర్తను భుజాలపై మోయిస్తూ గ్రామస్తులు ఓ మహిళను ఊరేగించినట్టు మీడియాలో వచ్చిన వార్తలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించింది2026 ఏప్రిల్ 13న మధ్యప్రదేశ్‌లోని ఝాబువా జిల్లాలో జరిగిన ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిందినివేదికల ప్రకారం.. గ్రామస్తులు ఆమెకు గుండు కూడా చేశారువీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

మీడియాలో వచ్చిన వార్తలు నిజమైతేబాధితుల మానవ హక్కుల తీవ్ర ఉల్లంఘన జరిగినట్టేనని కమిషన్ అభిప్రాయపడిందిఈ మేరకు మధ్యప్రదేశ్‌లోని ఝాబువా జిల్లా కలెక్టర్ఎస్పీలకు నోటీసులు జారీ చేసిందిఈ ఘటనపై రెండు వారాల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించిందిదర్యాప్తులో పురోగతితోబాధితురాలికి పరిహారం (ఒకవేళ అందిస్తేవంటి వివరాలు ఈ నివేదికలో ఉండాలని కమిషన్ పేర్కొన్నది.

2026 ఏప్రిల్ 15న వెలువడిన మీడియా కథనం ప్రకారం.. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో పోలీసులు స్పందించారుబాధితురాలిని గుర్తించి ఆమెకు రక్షణ కల్పించారుఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంతోపాటు కొందరిని అరెస్టు కూడా చేశారు.  

 

***


(రిలీజ్ ఐడి: 2255264) సందర్శకుల సూచీ సంఖ్య : : 16
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Gujarati , Urdu , हिन्दी