PIB Headquarters
azadi ka amrit mahotsav

6జీతో వికసిత్ భారత్‌ నిర్మాణం

4G స్వావలంబన నుంచి 6Gతో ప్రపంచ నాయకత్వం వరకు

నాడు పోస్టు చేయడమైనది: 26 OCT 2025 2:07PM by PIB Vijayawada

ముఖ్యాంశాలు

భారతదేశ 6జీ విజన్ 2030 నాటికి దేశాన్ని తదుపరి తరం టెలికాం ఆవిష్కరణలలో ప్రపంచ అగ్రగామిగా ఉంచడమే లక్ష్యం

భారత్ 6జీ అలయన్స్ ప్రపంచ పరిశోధనాతో కలిసి స్వదేశీ ఆవిష్కరణల కోసం స్టార్టప్‌లు, పరిశ్రమ, విద్యాసంస్థలు పరిశోధనా సంస్థలను ఏకం చేయడం

2035 నాటికి 10% ప్రపంచ 6జీ పేటెంట్లు, యూఎస్డీ 1.2 ట్రిలియన్ జీడీపీ అంచనా

5జీ-6జీ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి టెలికాం టెక్నాలజీ డెవలప్‌మెంట్ ఫండ్  (టీటీడీఎఫ్) కింద 310.6 కోట్ల విలువైన 115+ ఆర్&డీ ప్రాజెక్టులకు  ఆమోదం.

భారతదేశంలో తయారైన 4జీ స్టాక్, లక్ష స్వదేశీ 4జీ టవర్లు బలమైన 6జీ ఫ్రేమ్‌వర్క్‌కు పునాది.

 

పరిచయం

భారత ప్రభుత్వం వ్యూహాత్మక కార్యక్రమాల శ్రేణి ద్వారా తదుపరి తరం కనెక్టివిటీ దిశగా సాగుతూ 6జీ టెక్నాలజీలను అభివృద్ధే లక్ష్యంగా దేశ పరివర్తన. స్థోమత, స్థిరత్వం, సర్వవ్యాప్తి సూత్రాలలో దృఢ భారతదేశ 6జీ స్వదేశీ ఆవిష్కరణలు, అధునాతన పరిశోధనాభివృద్ధి, ప్రపంచ సహకారంతో సమాజాన్ని శక్తివంతం చేయడంపై దృష్టిసారింపు. పరిశ్రమ, విద్యాసంస్థలు, పరిశోధనా సంస్థల నుండి చురుకైన భాగస్వామ్యంతో, భారతదేశం 2047 నాటికి వికసిత భారత్‌ను నిర్మించాలనే విస్తృత జాతీయ లక్ష్యంతో అనుసంధానమై భవిష్యత్ టెలికాం సాంకేతికతకు ప్రపంచ కేంద్రంగా తనను తాను నిలబెట్టుకుంటోంది.

6G అంటే ఏమిటి?

6జీ, లేదా ఆరవ తరం వైర్‌లెస్ సాంకేతికత. 5జీని విజయవంతం చేస్తూ ఇంటర్నెట్ కనెక్షన్‌లను గణనీయమైన వేగంతో  సజావుగా సాగేలా చేస్తుంది. ఇది 5జీ కన్నా ఎక్కువ రేడియో ఫ్రీక్వెన్సీలను ఉపయోగిస్తూ ఆలస్యం లేకుండా ఒకేసారి భారీ డేటాను నిర్వహిచేందుకు వీలు కల్పిస్తుంది.

కేవలం ఒక మైక్రోసెకన్‌లో సమాచారాన్ని పంపడం, స్వీకరించడమే 6జీ లక్ష్యం. అంటే 5జీ ప్రతిస్పందన సమయం కంటే 1,000 రెట్లు వేగం. దీని అర్థం దాదాపు సున్నా లాగ్‌తో నిరంతరం/తక్షణమే కనెక్షన్‌లు. ఇది రిమోట్ మెడికల్ సర్జరీలు, స్మార్ట్ రోబోటిక్స్, రియల్-టైమ్ గేమింగ్ వంటి వాటికి ఉపయోగం

6G నెట్‌వర్క్ అధునాతన ఇమేజింగ్, ఖచ్చితమైన లొకేషన్ ట్రాకింగ్, లైఫ్‌లైక్ వర్చువల్ అనుభూతిని సృష్టించడం వంటి లక్షణాలను కూడా మెరుగుపరుస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో కలిపినప్పుడు, డేటా నిల్వ, ప్రాసెస్, పంచుకోవడం వంటి ఎక్కడ చేయాలో స్వయంచాలితంగా నిర్ణయించుకునేంత స్మార్ట్‌గా ఉంటుంది. సాంకేతికతను ప్రతిచోటా మరింత సమర్థవంతంగా, ప్రతిస్పందించేలా చేస్తుంది.

భారతదేశం యొక్క 6జీ విజన్: భారతదేశాన్ని ప్రపంచ టెలికాం ఆవిష్కర్తగా నిలబెట్టడం

భారత్ 6జీ విజన్ మ్యానిఫెస్టో భారతదేశాన్ని వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా అధునాతన టెలికాం సాంకేతికతకు ప్రధాన సరఫరాదారుగా మార్చడమే లక్ష్యం. 5జీ వేగవంతమైన అమలు, దేశీయ స్వీకరణ భారతదేశ 6జీ విజన్‌కు పునాది. భవిష్యత్ టెలికాం ఆవిష్కరణలలో దేశాన్ని ప్రపంచ అగ్రగామిగా ఉంచుతోంది. 6జీ విజన్ స్థోమత, స్థిరత్వం, సర్వవ్యాప్తి సూత్రాలపై ఆధారపడి ఉంటుంది.

మార్చి 22, 2023న , "భారత్ 6జీ విజన్" డాక్యుమెంట్ విడుదలయింది, 2030 నాటికి 6జీ సాంకేతికత రూపకల్పన, అభివృద్ధి, విస్తరణలో భారతదేశం వరుస సహకారిగా ఉంటుందని అంచనవేయడమైంది. దేశంలో 6జీ టెక్నాలజీ అభివృద్ధిని సులభతరం చేయడానికి ప్రభుత్వం ఈ క్రింది కార్యక్రమాలను చేపట్టింది:

  • దేశంలో పరిశోధనాభివృద్ధి (ఆర్&డి), ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు 6జీ టీహెచ్జ్ టెస్ట్‌బెడ్, అడ్వాన్స్ ఆప్టికల్ కమ్యూనికేషన్ టెస్ట్‌బెడ్ అనే రెండు టెస్ట్‌బెడ్‌లకు నిధులను సమకూర్చడం.

  • దేశంలో సామర్థ్య పెంపుదల, 6జీ సిద్ధంగా ఉన్న విద్యా, స్టార్టప్ పర్యావరణ వ్యవస్థను నిర్మిణానికి భారతదేశమంతటా 2023-24 ఆర్థిక సంవత్సరంలో విద్యా సంస్థలలో 100 5జీ ల్యాబ్‌ల మంజూరు.

  • 6జీ టెక్నాలజీ కోసం ప్రపంచ ప్రణాళికలకు అనుగుణంగా పరిశోధన, ఆవిష్కరణలను ప్రోత్సహించి 6జీ నెట్‌వర్క్ పర్యావరణ వ్యవస్థలపై 104 పరిశోధన ప్రతిపాదనలను ఆమోదించడమైంది.

భారత్ 6జీ అలయన్స్

భారతీయ పరిశ్రమలు, టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు, విద్యాసంస్థలు, జాతీయ పరిశోధనా సంస్థలు, ప్రమాణిక సంస్థలతో భారత్ 6జీ అలయన్స్ (బీ6జీఏ). ప్రభుత్వం, పరిశ్రమల మద్దతుతో అధునాతన కమ్యూనికేషన్ టెక్నాలజీల కోసం స్వావలంబన, ప్రపంచవ్యాప్తంగా పోటీతత్వ పర్యావరణ వ్యవస్థ సృష్టికి స్వదేశీ 6జీ పరిశోధనాభివృద్ధిని ముందుకు తీసుకెళ్లుతుంది. అత్యాధునిక ప్రయోగశాలలు, మల్టీ-చిప్ మాడ్యూల్స్, ఎస్ఓసీలు, అధునాతన ఐఓటి అప్లికేషన్‌లపై ఆవిష్కరణ దృష్ట్యా భారతదేశం ప్రపంచ 6జీ ఉద్యమానికి నాయకత్వం వహించాలని లక్ష్యంగా పెట్టుకుంది. బీ6జీఏ పరిశ్రమల నేతృత్వంలోని సంస్థ, ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేయడమైంది. ప్రభుత్వ/ప్రైవేట్ కంపెనీలు, విద్యాసంస్థలు, పరిశోధనా సంస్థలు, ప్రామాణిక అభివృద్ధి సంస్థలతో సహా సాంకేతిక వాటాదారులకు ఒక సహకార వేదిక. స్పెక్ట్రమ్, టెక్నాలజీ, అప్లికేషన్లు, గ్రీన్, సస్టైనబిలిటీ, వినియోగ వంటి ఆరు వివిధ ఆంశాలపై భారత్ 6జీ అలయన్స్ ఏడు వర్కింగ్ గ్రూపులను ఏర్పాటు చేసింది.

గ్లోబల్ కమ్యూనికేషన్ భవిష్యత్తును పునర్నిర్వచించే దిశగా ముందడుగా భారత్ 6జీ అలయన్స్, నెక్ట్స్ జీ అలయన్స్ (యూఎస్ఏ), 6జీ ఐఏ (యూరప్), 6జీ ఫ్లాగ్‌షిప్ ఔలు విశ్వవిద్యాలయం (ఫిన్లాండ్) 6జీ ఫోరం దక్షిణ కొరియా, ఎక్స్జీఎంఎఫ్  జపాన్, ఎన్జీఎంఎన్ అలయన్స్, 5జీ ఏసీఐఏ, యూకెఐ ఎఫ్ఐ, యూకె  టిన్, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఇఎస్ఎ) మరియు 6జీ బ్రెజిల్ (బ్రెజిల్) వంటి ప్రముఖ పరిశోధనా కూటములతో సహకార పరిశోధన, ప్రామాణీకరణ కోసం అవగాహన ఒప్పందం (ఎంఓయూ)పై సంతకం చేసింది. జాతీయ సినర్జీని ఉపయోగించుకోనేందుకు టీఎస్డీఎస్ఐ, నాస్స్కామ్ తో ఎంఓయూను కలిగి ఉంది. 6జీ పరిశోధన కూటములతో ఈ ఒప్పందాలు స్థిరమైన సరఫరా గొలుసులతో సహా సురక్షితమైన, విశ్వసనీయ టెలికమ్యూనికేషన్ టెక్నాలజీ అభివృద్ధిని మరింతగా సాధ్యం చేస్తాయి.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002MLZH.jpg

భారత్ 6జీ మిషన్

భారతదేశం 6జీ ఆశయంతో ముందుకు సాగుతోంది. తదుపరి తరం వైర్‌లెస్ కమ్యూనికేషన్లలో ప్రపంచ అగ్రగామిగా నిలవాలనే ఆశయంతో ఈ 6జీ దార్శనికత ప్రారంభమైంది. ఈ దార్శనికత ఆవిష్కర్తలు, పరిశోధకులు, స్టార్టప్‌లు, విధాన రూపకర్తలతో డైనమిక్ పర్యావరణ వ్యవస్థ ఆవిర్భావానికి దారితీసింది. వీరందరూ కనెక్టివిటీని అభివృద్ధి చేయడంలో అంకితభావంతో ఉన్నారు. ఈ మిషన్ తదుపరి దశలోకి అడుగుపెడుతున్నప్పుడు, సాధించిన గత విజయాలతో సాంకేతిక ఆవిష్కరణలను మరింతగా పెంచి భారతదేశానికి 6జీ ప్రయోజనాన్ని చేకూర్చడమే కాకుండా ఇక్కడే ఉద్భవించేలా చేయడం పై దృష్టిని కేంద్రీకరించడమైంది. సహకార భాగస్వామ్య ప్రయోజనం ద్వారా భారతదేశం ప్రపంచ డిజిటల్ భవిష్యత్తులో నాయకత్వానికి ఇది మార్గం సుగమం చేస్తోంది.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003V9BL.jpg

ఇండియా మొబైల్ కాంగ్రెస్, 2025 పై దృష్టి

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004621B.jpg

ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ) 2025 సందర్భంగా జరిగిన అంతర్జాతీయ 6జీ సింపోజియం 2025 తదుపరి తరం కమ్యూనికేషన్ టెక్నాలజీల దిశగా కొనసాగుతున్న భారతదేశ ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా గుర్తించింది. ఈ కార్యక్రమం టెలికాం ఆవిష్కరణ, స్వదేశీ పరిశోధనాభివృద్ధి (ఆర్&డీ) మరియు ప్రపంచ డిజిటల్ నాయకత్వంలో పెరుగుతున్న భారతదేశ ప్రాముఖ్యతను చాటుతుంది.

భారతదేశ సాంకేతిక స్వావలంబనను అభివృద్ధి

భారతదేశ మేడ్-ఇన్-ఇండియా 4జీ స్టాక్ ఒక మైలురాయి విజయంతో పాటుగా దేశ సాంకేతిక స్వావలంబన, ఎగుమతి సంసిద్ధతను ప్రదర్శిస్తుంది. ఈ స్వదేశీ అభివృద్ధి భవిష్యత్తులో సిద్ధంగా, సురక్షితమైన స్థాయిలో టెలికాం నెట్‌వర్క్‌లను సృష్టించే లక్ష్యంతో 'ఇండియా 6జీ విజన్ 2030' కు పునాది.

భారతదేశ 6జీ ప్రణాళిక ఈ రంగం 2035 నాటికి జాతీయ జీడీపీకి దాదాపు యుఎస్డీ 1.2 ట్రిలియన్లను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దేశం ప్రపంచ 6జీ పేటెంట్లలో 10% శాతాన్ని  లక్ష్యంగా పెట్టుకుంది. ఇది టెలికాం సాంకేతికతలో ఆవిష్కరణలకు కేంద్రంగా దేశ ఆవిర్భావాన్ని చాటుతుంది. దీనికి అనుగుణంగా ఉపగ్రహ కమ్యూనికేషన్ల మార్కెట్ 2033 నాటికి మూడు రెట్లు పెరుగుతుందని అంచన. ఇది భారతదేశ అంతరిక్ష-సంబంధిత కనెక్టివిటీ పర్యావరణ వ్యవస్థను బలపరుస్తుంది.

సహకార సమ్మిళితత్వంపై దృష్టసారింపు

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00566ZO.png

ఈ సింపోజియం అంతర్జాతీయ సహకారం , స్వదేశీ పరిశోధనాభివృద్ధి (ఆర్&డీ ), విద్యాసంస్థలు, పరిశ్రమలు ప్రభుత్వాల మధ్య సమన్వయం, సమ్మిళిత, సరసమైన ప్రపంచ 6జీ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించడానికి పిలుపునిచ్చింది. దేశవ్యాప్తంగా లక్ష స్వదేశీ 4జీ టవర్లను అందుబాటులోకి తీసుకురావడం వంటి పురోగతి స్వదేశీ టెలికాం పర్యావరణ వ్యవస్థను నిర్మించడంపై ప్రాధాన్యత ఇవ్వబడింది. ఇది తదుపరి తరం నెట్‌వర్క్‌ల కోసం స్థితిస్థాపక మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంలో కీలకమైన అడుగు.

భారతదేశం సాంకేతిక పరిజ్ఞాన వినియోగదారుడిగా ఉండటం కంటే 6జీ విప్లవంలో సహ-సృష్టికర్త, సహ-నాయకుడిగా మారుతోందని , దేశీయ, ప్రపంచ అవసరాల కోసం కమ్యూనికేషన్ భవిష్యత్తును రూపొందిస్తుందని మార్గదర్శక దృష్టి నొక్కి చెప్పింది.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image006B9LP.jpg

కీలక ప్రకటనలు మరియు విడుదలలు

భారతదేశ 6జీ సంసిద్ధతను వేగవంతం చేసే లక్ష్యంతో ఈ కార్యక్రమంలో అనేక ముఖ్యమైన ఫలితాలు:

  • 6జీ సూత్రాలపై ఉమ్మడి ప్రకటన అక్టోబర్ 10, 2025 న విడుదలైంది.

  • భారత్ 6జీ అలయన్స్ రెండు అవగాహన ఒప్పందాలపై (ఎంఓయూలు) సంతకం చేసింది: 6జీ అనుబంధ సాంకేతిక పరిజ్ఞానాలలో సహకార పరిశోధన ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ఒకటి నాస్స్కామ్ తో మరియు మరొకటి  యూరోపియన్ స్పేస్ ఏజెన్సీతో.

  • భారత్ 6జీ అలయన్స్ ఈ రంగానికి వ్యూహాత్మక దిశానిర్దేశం చేస్తూ నాలుగు శ్వేతపత్రాలను కూడా విడుదల చేసింది.

  భారతదేశంలో 6జీ కోసం స్పెక్ట్రమ్ ప్రణాళిక 

  నెక్స్ట్-జెన్ టెలికాంకు శక్తినివ్వడం

  5జీ పరిణామక్రమనానికి ఏఐ, నెట్‌వర్క్

  ఆర్ఎఫ్ సెన్సింగ్ కోసం 6జీ ఆర్కిటెక్చర్, భద్రత, ఎక్స్‌పోజర్ ఫ్రేమ్‌వర్క్

 

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/Screenshot2025-10-26140353J4FQ.png

న్యూఢిల్లీ డిక్లరేషన్

 

అంతర్జాతీయ భారత్ 6జీ సింపోజియం 2025లో భారత్ 6జీ, 6జీ- ఐఏ, ఏటిఐఎస్ నెక్స్ట్ జీ అలయన్స్ మరియు ఇతరులతో సహా ప్రముఖ ప్రపంచ కూటములు 6జీని ప్రపంచ ప్రజా ప్రయోజనంగా రూపొందించడానికి ఒక ఉమ్మడి ప్రకటనను విడుదల చేశాయి.

6జీ నెట్‌వర్క్‌లను ఈ క్రింది విధంగా రూపొందించనున్నట్లు న్యూఢిల్లీ డిక్లరేషన్ ధృవీకరిస్తుంది:

విశ్వసనీయత, సురక్షితమైన

స్థితిస్థాపకత, నమ్మదగిన

ఓపెన్, పరస్పర కార్య నిర్వహణ

సమ్మిళిత, సరసమైన

స్థిరత్వం, ప్రపంచవ్యాప్త అనుసంధానం

 

భూసంబంధమైన, భూసంబంధితం కాని (ఉపగ్రహ, అధిక-ఎత్తు వేదిక) నెట్‌వర్క్‌ల ఏకీకరణ ద్వారా శక్తి సామర్థ్యం, సార్వత్రిక కవరేజీపై దృష్టి సారించి, స్థిరత్వమే ప్రధాన అంశంగా ఉంచడమైంది. ఈ ప్రకటన నిరంతర నైపుణ్య అభివృద్ధి అవసరాన్ని ముఖ్యంగా తెలుపుతూ 6జీ సమాజాలను అభ్యున్నతిని ఎవరినీ వెనుకంజలో ఉంచకుండా వాటాదారులు, ప్రభుత్వాలు, పరిశ్రమ, విద్యాసంస్థలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చింది.

అంతర్జాతీయ 6జీ సింపోజియం 2025 ప్రపంచ సహకారాన్ని పెంపొందించుకుంటూ స్వదేశీ టెలికాం సామర్థ్యాలను పెంపొందించుకోవడంలో భారతదేశ నిబద్ధతను పునరుద్ఘాటించింది. ఆవిష్కరణ, స్థోమత, చేరికపై దృష్టి సారించి, భారతదేశం 'ఇండియా 6జీ విజన్ 2030' కోసం దాని దార్శనికతకు అనుగుణంగా అనుసంధానిచిన, స్వావలంబన, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న 6జీ  పర్యావరణ వ్యవస్థకు మార్గం సుగమం చేస్తూనే ఉంది.

 

భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న 6జీ టెలికాం పర్యావరణ వ్యవస్థ కోసం ప్రభుత్వ చొరవలు

తదుపరి తరం టెలికాంలో ఆవిష్కరణ, సహకారం, నైపుణ్యాలను పెంచే చొరవల ద్వారా భారతదేశం 6జీ సంసిద్ధత పర్యావరణ వ్యవస్థ వైపు ముందుకు సాగుతోంది. ఈ ప్రయత్నాలు స్వదేశీ పరిశోధన, పరిశ్రమ-విద్యా భాగస్వామ్యాలు, అత్యాధునిక పరిష్కారాలను ప్రారంభించడానికి స్టార్టప్ మద్దతుపై దృష్టి సారించాయి.

విద్యాసంస్థలలో 100 5జీ ల్యాబ్‌లు: 6జీ-సంసిద్ధత ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్‌ను నిర్మించడం

అధునాతన టెలికాం టెక్నాలజీలలో నైపుణ్యాలు, పరిశోధన, ప్రయోగాలను పెంపొందించడానికి, భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా విద్యాసంస్థలలో 100 5జీ ల్యాబ్‌లను ఏర్పాటు చేసింది. 

ముఖ్య లక్ష్యాలు:

  • విద్యార్థులు, విద్యావేత్తలలో 5జీ టెక్నాలజీలలో సామర్థ్యాలను, వొడంబడికను పెంపొందించడం.

  • 5జీ వాతావరణాన్ని ఉపయోగించే విద్యార్థులకు యూజీ, పిజీ స్థాయిలో ప్రాజెక్టులను ప్రారంభించడం.

  • విద్యా-పరిశ్రమల వొడంబడికను ప్రోత్సహించేందుకు 5జీ వినియోగాన్ని రూపొందించి, అభివృద్ధి చేయడం

  • సంస్థ చుట్టూ ఉన్న స్టార్టప్‌లు, ఎంఎస్ఎంఈ లకు 5జీ పరీక్షల సేట్ అప్లను ఏర్పాటు చేసి స్థానిక ప్రాప్యతను అందించడం.

  • భారతీయ విద్యాసంస్థ & స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ 6జీకి సిద్ధం చేస్తోంది.

టెలికాం టెక్నాలజీ డెవలప్‌మెంట్ ఫండ్ (టిటిడిఎఫ్): టెలికాంలో స్వదేశీ పరిశోధన మరియు అభివృద్ధికి చోదక శక్తి

1 అక్టోబర్ 2022 న ప్రారంభమైన టెలికాం టెక్నాలజీ డెవలప్‌మెంట్ ఫండ్ (టిటిడిఎఫ్) పథకం 6జీ టెక్నాలజీలతో సహా టెలికాంలో ఆవిష్కరణ, పరిశోధన మరియు అభివృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యం.

ముఖ్యాంశాలు:

  • గ్రామీణ, మారుమూల ప్రాంతాలలో సరసమైన బ్రాడ్‌బ్యాండ్, మొబైల్ సేవలను ప్రారంభించేందుకు టెలికమ్యూనికేషన్ ఉత్పత్తుల రూపకల్పన, అభివృద్ధి, వాణిజ్యీకరణ, పరిష్కారాలలో పాల్గొన్న దేశీయ కంపెనీలు, సంస్థల కోసం టెలికాం టెక్నాలజీ డెవలప్‌మెంట్ ఫండ్ పథకం ప్రకటించబడం జరిగింది.

  • భారతదేశంలో టెలికాం పర్యావరణ వ్యవస్థను మెరుగుపరచడానికి విద్యాసంస్థలు, స్టార్టప్‌లు, ఎంఎస్ఎంఈలు, పరిశోధనా సంస్థలు, పరిశ్రమల మధ్య సహకారాన్ని పెంపొందించడం, టెలికాం టెక్నాలజీలలో పరిశోధనాభివృద్ధి (ఆర్&డీ), ఆవిష్కరణలకు నిధులు సమకూర్చడమే ఈ పథక లక్ష్యం.

  • 5జీ, 6జీ కి సంబంధించిన మొత్తం 115 ప్రాజెక్టులకు సెప్టెంబర్ 30, 2025 నాటికి టిటిడిఎఫ్ పథకం కింద రూ. 310.6 కోట్లు ఆమోదం పొందాయి. ఈ పరిశోధనాఅభివృద్ధి ప్రాజెక్టుల వ్యవధి 1 నుండి 5 సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ ప్రాజెక్టులు ప్రస్తుత అభివృద్ధి ప్రారంభ దశలో ఉన్నాయి.

 భారత్ 6జీ అలయన్స్: ప్రపంచ 6జీ నాయకత్వం కోసం ఏకీకృత జాతీయ ప్రయత్నం

భారత్ 6జీ విజన్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు భారతదేశ పరిశ్రమ, విద్యాసంస్థలు, స్టార్టప్‌లు, పరిశోధనా సంస్థలు మరియు ప్రామాణీకరణ సంస్థలను ఒకచోట చేర్చి భారత్ 6జీ అలయన్స్‌ను ప్రారంభించింది. ఈ కూటమి స్వదేశీ ఆవిష్కరణలను ప్రారంభించడం మరియు ప్రపంచ సహకారాన్ని నడిపించడంపై దృష్టి సారించింది.

  • జూలై 2025 నాటికి , ఈ కూటమిలో 80+ సభ్య సంస్థలు ఉన్నాయి. వాటిలో 30+ స్టార్టప్‌లు ఉన్నాయి .

  • ప్రపంచ జ్ఞాన మార్పిడి, ఉమ్మడి అభివృద్ధిని పెంపొందించడానికి అంతర్జాతీయ 6జీ పొత్తులతో బహుళ అవగాహన ఒప్పందాలపై సంతకం.

  • ప్రపంచానికి అధిక-నాణ్యత జీవన అనుభవం కోసం సర్వవ్యాప్త, ఉత్తమమైన, సురక్షితమైన కనెక్టివిటీని అందించడమే లక్ష్యం.

  • గ్రామీణ-పట్టణ అంతరాలను తగ్గించి ప్రపంచ డిజిటల్ సమ్మిళితను ప్రారంభించడమే దీని లక్ష్యం.

  • ఆలోచన దశ నుంచి వాస్తవంతో భారతదేశం, ప్రపంచ సమాజం కోసం సాంకేతిక పరిష్కారాల విస్తరణ.

ఐఐఐటీ-బిలో టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్: 6జీ-రెడీ టెక్నాలజీలకు మార్గదర్శకత్వం

నేషనల్ మిషన్ ఆన్ ఇంటర్ డిసిప్లినరీ సైబర్-ఫిజికల్ సిస్టమ్స్ (ఎన్ఎం-ఐసీపీఎస్) కింద భవిష్యత్తులో 6జీ నెట్‌వర్క్‌లను రూపొందించే అడ్వాన్స్‌డ్ కమ్యూనికేషన్ సిస్టమ్‌లపై దృష్టిసారించి,ఐఐఐటీ బెంగళూరులో టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ను  స్థాపించడం జరిగింది.

  • ఈ హబ్ ప్రస్తుత, భవిష్యత్తు జాతీయ అవసరాలు మరియు అంతర్జాతీయ ధోరణులను పరిష్కరించే అడ్వాన్స్‌డ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్‌కు అంకితం చేయడమైంది.

  • కవరేజ్, సామర్థ్యం, సెన్సింగ్‌ను మెరుగుపరించేందుకు రీకాన్ఫిగరబుల్ ఇంటెలిజెంట్ సర్ఫేసెస్ మరియు ఓ-రాన్ మాసివ్ మీమో అభివృద్ధి.

  • 5జీ–అధునాతన (5జీ+), 6జీ వ్యవస్థలు, నెట్‌వర్క్‌ల కోసం టెక్నాలజీ బిల్డింగ్ బ్లాక్‌లను రూపొందించి అభివృద్ధి చేయడం పై ప్రధానంగా దృష్టి సారించాయి.

  • వాణిజ్య అనువర్తనాల కోసం ఉత్పత్తి ఐపి వంటి మేధో సంపత్తి (ఐపి) సృష్టికి దారితీసే స్వదేశీ పరిశోధనలకు ప్రాధాన్యతను ఇవ్వడం.

  • ఉత్పత్తి ఆధారిత ఆవిష్కరణలను ప్రోత్సహించి రాబోయే 5జీ-అధునాతన మరియు 6జీ ప్రమాణాలలో విలీనం చేయడమే వీలుగా పేటెంట్లను (ఐపీఆర్)ను రూపొందించడంమే ముఖ్య ప్రాధాన్యత.

ఈ చొరవలు అన్ని కలిసి సురక్షిత, సమ్మిళిత భవిష్యత్తుకు బలమైన డిజిటల్ మౌలిక సదుపాయాలను రూపొందిస్తున్నాయి. ఇది ప్రపంచ 6జీ పరుగులో భారతదేశ నాయకత్వాన్ని బలోపేతం చేయడమే కాకుండా అందరికీ సమాచారం, కనెక్టివిటీ, సేవలకు సమాన ప్రాప్యతను ప్రోత్సహిస్తుంది. స్టార్టప్‌లను శక్తివంతం చేయడం, ప్రతిభను ప్రోత్సాహించడం, ప్రపంచ భాగస్వామ్యాలను బలోపేతం చేయడం ద్వారా భారతదేశం స్వావలంబన, డిజిటల్‌ సమ్మిళిత భవిష్యత్తుకు పునాది వేస్తోంది.

 ముగింపు

భారతదేశం తదుపరి తరం టెలికాం టెక్నాలజీలను అనుసరణ స్వావలంబన, ఆవిష్కరణ ప్రపంచ సహకారం అనే దృక్పథంతో మార్గనిర్దేశం చేయడమైంది. అంతర్జాతీయ భారత్ 6జీ సింపోజియం 2025 లో జరిగిన చర్చలు, ప్రకటనలు సురక్షితమైన, సమగ్రమైన, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న డిజిటల్ పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడంలో దేశ నిబద్ధతను పునరుద్ఘాటించాయి . భారత్ 6జీ అలయన్స్, టెలికాం టెక్నాలజీ డెవలప్‌మెంట్ ఫండ్, ప్రపంచ పరిశోధనా సంస్థలతో క్రియాశీల భాగస్వామ్యాల వంటి చొరవల ద్వారా భారతదేశం సాంకేతికతను స్వీకరించే స్వీకర్త నుంచి సాంకేతికత సృష్టికర్త, ప్రమాణాలను నిర్దేతకర్త వరకు స్థిరంగా మారుతోంది .

ఈ వ్యూహాత్మక కార్యక్రమాలు దేశీయ టెలికాం పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడమే కాకుండా, ప్రపంచ 6జీ ఫ్రేమ్‌వర్క్‌కు భారతదేశాన్ని కీలక సహకారిగా ఉంచుతాయి. స్థోమత, స్థిరత్వం, సర్వవ్యాప్తిపై నిరంతర ప్రాధాన్యత భారతదేశ సాంకేతిక పురోగతి సమాజంలోని ప్రతి వర్గానికి ప్రయోజనాన్ని చేకూరుస్తుందని నిర్ధారిస్తుంది. అలాగే 2047 నాటికి దేశ వికసిత భారత్ దార్శనికతకు మద్దతునిస్తుంది.

 

ప్రస్తావనలు

టెక్ టార్గెట్ : https://www.techtarget.com/searchnetworking/definition/6G

కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ:

భారత్ 6జీ అలయన్స్ :

 

సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం 

 https://comet.iitb.ac.in/wp-content/uploads/2024/10/IIITB-COMET-Brochure-3.pdf


(రిలీజ్ ఐడి: 2255179) సందర్శకుల సూచీ సంఖ్య : : 5
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: हिन्दी , Gujarati , Nepali , Tamil , Bengali , English , Urdu