ప్రధాన మంత్రి కార్యాలయం
రైలు మార్గాల ఆధునికీకరణ.. వేగవంతమైన, మరింతగా ఆధారపడదగిన నెట్‌వర్క్‌కు దోహదం.. దీనిపై ఓ వ్యాసాన్ని పంచుకున్న ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
23 APR 2026 2:19PM by PIB Hyderabad
రైలు మార్గాల ఆధునికీకరణ వేగవంతమైన, మరింత ఆధారపడదగిన వ్యవస్థకు ఏ విధంగా దోహదం చేస్తోందీ వివరిస్తూ కేంద్ర మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ రాసిన ఒక వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో ఈ రోజు పంచుకున్నారు. రైలు మార్గాలకు కొత్త రూపును ఇవ్వడం, ఆధునిక పరీక్షా విధానం, నిర్వహణ ప్రక్రియలో యంత్రాల సాయాన్ని తీసుకోవడం వంటి చర్యలు రైలు ప్రయాణ నాణ్యతను మెరుగు పరిచి ఇదివరకటితో పోలిస్తే ఎక్కువ వేగంతో రైళ్లు ప్రయాణించగలగడంలో తోడ్పడుతున్నాయని శ్రీ మోదీ వివరించారు. ‘‘ఈ మార్పులు ఆలస్యాలను కుదించి, యాత్రలు సాఫీగా సాగేలా మద్దతివ్వడంతో పాటు దేశవ్యాప్తంగా రోజు రోజుకూ పెరుగుతున్న ప్రయాణికుల, సరకు రవాణా అవసరాలను తీర్చడంలో రైల్వేలకు సాయపడుతున్నాయి’’ అని శ్రీ మోదీ అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి శ్రీ మోదీ పొందుపరుస్తూ -
‘‘రైల్వేల ఆధునికీకరణ ప్రక్రియ సత్వర, మరింత విశ్వసనీయ నెట్‌వర్క్‌కు వెన్నుదన్నుగా నిలుస్తోంది.
రైలు పట్టాలను సరికొత్తవిగా తీర్చిదిద్దడం, ఆధునిక పరీక్షా విధానాలను అవలంబించడం, నిర్వహణ కార్యకలాపాల్లో యంత్రాల సాయాన్ని తీసుకోవడం రైలు ప్రయాణ నాణ్యతను మెరుగు పరచడంతో పాటు రైళ్లు మునుపటి కన్నా ఎక్కువ వేగంగా పయనించడానికి తోడ్పడుతున్నాయి. ఈ మార్పులు ఆలస్యాలను కుదిస్తున్నాయి. యాత్రలు సాఫీగా సాగేందుకు దోహదపడుతున్నాయి. దేశమంతటా రోజు రోజుకూ పెరుగుతున్న ప్రయాణికుల, సరకు రవాణా అవసరాలను తీర్చడంలో రైల్వేలకు ఈ మార్పులు సహాయకారిగా ఉంటున్నాయి.
కేంద్ర మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ రాసిన వ్యాసం చదివి తీరాలి’’ అని పేర్కొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2254859)
సందర్శకుల సూచీ సంఖ్య : : 10
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Kannada
,
Malayalam