ప్రధాన మంత్రి కార్యాలయం
గోవాలో ఐరన్‌మన్ 70.3 వంటి కార్యక్రమాల్లో యువత ప్రాతినిధ్యం పెరుగడం సంతోషదాయకమన్న ప్రధానమంత్రి
ఐరన్‌మన్ ట్రయథ్లాన్‌ను విజయవంతంగా పూర్తి చేసిన పార్టీ యువ సహచరులు శ్రీ అన్నామలైకీ, శ్రీ తేజస్వి సూర్యకీ ప్రధానమంత్రి అభినందనలు
प्रविष्टि तिथि:
09 NOV 2025 10:00PM by PIB Hyderabad
గోవాలో ఈ రోజు నిర్వహించిన ఐరన్‌మన్ 70.3 వంటి కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో యువత పాల్గొనడం సంతోషాన్నిస్తోందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఫిట్ ఇండియా ఉద్యమానికి తోడ్పాటును అందిస్తాయని శ్రీ మోదీ అన్నారు. ‘‘ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ అభినందనలు. ఐరన్‌మన్ ట్రయథ్లాన్‌ను విజయవంతంగా పూర్తి చేసిన వారిలో మా పార్టీ యువ సహచరులిద్దరు శ్రీ అన్నామలై, శ్రీ తేజస్వి సూర్య ఉండడం నాకు ఆనందాన్నిచ్చింది’’ అని శ్రీ మోదీ అన్నారు.
‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ -
‘‘గోవాలో ఈ రోజు నిర్వహించిన ఐరన్‌మన్ 70.3 వంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్న యువత సంఖ్య పెరుగుతూ ఉండడం సంతోషకరం. ఇలాంటి కార్యక్రమాలు ఫిట్ ఇండియా ఉద్యమానికి దోహదం చేస్తాయి. ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్న వారందరికీ అభినందనలు. ఐరన్‌మన్ ట్రయథ్లాన్‌ను విజయవంతంగా పూర్తి చేసిన వారిలో మా పార్టీలోని యువ సహచరులిద్దరు శ్రీ అన్నామలై, శ్రీ తేజస్వి సూర్య ఉండడం నాకు ఆనందాన్నిచ్చింది’’.
@annamalai_k
@Tejasvi_Surya
అని పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 2254314)
आगंतुक पटल : 17
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam