ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మతువా ధర్మ మేళాలో పాల్గొనే భక్తులకు ప్రధాని శుభాకాంక్షలు

నాడు పోస్టు చేయడమైనది: 16 MAR 2026 1:12PM by PIB Hyderabad

మతువా ధర్మ మేళాలో పాల్గొనే భక్తులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారుపూర్ణ బ్రహ్మశ్రీ శ్రీ హరిచంద్ ఠాకూర్ జయంతి సందర్భంగా ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ‘‘ఆయనకు వినయపూర్వకంగా ప్రణామాలు అర్పిస్తున్నానుఆయన ఆదర్శాలుబోధనలు అనేక మందికి బలాన్నిఆశాభావాన్ని అందిస్తున్నాయిఅవి గౌరవంసమానత్వంభక్తికి సంబంధించిన శక్తివంతమైన ఉద్యమాన్ని మేల్కొలిపాయిధర్మంసామరస్యంసామూహిక అభ్యున్నతి మార్గంలో నడిచేలా తరతరాలకు ఆయన స్ఫూర్తినిస్తూనే ఉన్నారు” అని శ్రీ మోదీ పేర్కొన్నారు.

సుసంపన్నమైనశక్తిమంతమైన మతువా సంస్కృతికి సంబంధించిన సంప్రదాయాలు బలమైన ఆధ్యాత్మిక శక్తినిసమానత్వం పట్ల అంకిత భావాన్ని ప్రదర్శిస్తాయని ప్రధానమంత్రి అన్నారుఇది మన దేశ సామాజిక నిర్మాణాన్ని బలోపేతం చేస్తుందని వివరించారు. ‘‘గత కొన్నేళ్లుగామతువా సమాజం సంక్షేమానికిసాధికారతకుగౌరవానికి ప్రభుత్వం నిబద్దతతో కృషి చేస్తోంది’’ అని శ్రీ మోదీ తెలిపారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి పోస్టు:

‘‘మతువా ధర్మ మేళాలో పాల్గొంటున్న భక్తులందరికీ నా శుభాకాంక్షలు.

పూర్ణ బ్రహ్మశ్రీ శ్రీ హరిచంద్ ఠాకూర్ జయంతి సందర్భంగా ఈ ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తారుఆయనకు వినయపూర్వకంగా ప్రణామాలను అర్పిస్తున్నానుఆయన ఆలోచనలుబోధనలు అనేక మందికి స్ఫూర్తినిఆశాభావాన్ని అందిస్తున్నాయిగౌరవంసమానత్వంభక్తి కోసం శక్తిమంతమైన ఉద్యమాన్ని మేల్కొలుపుతున్నాయిధర్మంసామరస్యంసామూహిక అభ్యున్నతి మార్గంలో నడిచేలా తరతరాలకు ఆయన స్ఫూర్తిని అందిస్తున్నారు.

సుసంపన్నమైన మతువా సంస్కృతికి సంబంధించిన సంప్రదాయాలు బలమైన ఆధ్యాత్మిక శక్తినిసమానత్వం పట్ల చెక్కు చెదరని అంకితభావాన్ని ప్రదర్శిస్తాయిఇవి దేశ సామాజిక నిర్మాణాన్ని బలోపేతం చేస్తాయిగత దశాబ్ద కాలంగా మతువా సమాజ సంక్షేమానికిసాధికారతకుగౌరవానికి మా ప్రభుత్వం అంకితమై ఉంది’’.

 


(రిలీజ్ ఐడి: 2254241) సందర్శకుల సూచీ సంఖ్య : : 16