రైల్వే మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్ల రిజర్వేషన్ లేని దివ్యాంగుల కోచ్‌లలో చెల్లుబాటు అయ్యే యూడీఐడీ కార్డు కలిగిన దివ్యాంగులకు ప్రయాణించే అవకాశం


రైల్వే రాయితీ పొందేందుకు అర్హులైన వారు లేదా చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డులు కలిగిన దివ్యాంగులు రైలులోని ఎస్ఎల్ఆర్ డీ, ఎల్ఎస్ఎల్ఆర్ డీ కోచ్‌లలో ప్రయాణించేందుకు అనుమతి

అర్హులైన లబ్ధిదారులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు..దివ్యాంగులకు కేటాయించిన కోచ్‌లలో ప్రయాణించిన ఇతరులు, అనధికార వ్యక్తులపై కఠినమైన చర్యలు

నాడు పోస్టు చేయడమైనది: 20 APR 2026 7:21PM by PIB Hyderabad

అందరికీ సమానంగా ప్రయాణ సౌకర్యాలుమెరుగైన సౌకర్యాన్ని కల్పించడంలో భాగంగా.. చెల్లుబాటు అయ్యే ప్రత్యేక వైకల్య గుర్తింపు కార్డు (యూడీఐడీకలిగిన దివ్యాంగులు.. మెయిల్ఎక్స్‌ప్రెస్ రైళ్లలో వారి కోసం ప్రత్యేకంగా కేటాయించిన రిజర్వేషన్ లేని కోచ్‌లలో ప్రయాణించేందుకు భారత రైల్వేశాఖ అవకాశం కల్పించింది.

దివ్యాంగుల సాధికారత విభాగం జారీ చేసిన చెల్లుబాటు అయ్యే యూడీఐడీ కార్డులు కలిగిన దివ్యాంగులుఅలాగే భారతీయ రైల్వే ద్వారా ప్రయాణ రాయితీ సౌకర్యం ఉన్న వారు.. రైలులో దివ్యాంగుల కోసం కేటాయించిన సెకండ్ క్లాస్ లగేజ్ కమ్ బ్రేక్ వ్యాన్ విత్ కంపార్ట్‌మెంట్ ఫర్ దివ్యాంగన్ (ఎస్ఎల్ఆర్ డీలేదా లగేజ్ కమ్ సెకండ్ క్లాస్ లగేజ్ కమ్ బ్రేక్ వ్యాన్ విత్ కంపార్ట్‌మెంట్ ఫర్ దివ్యాంగన్ (ఎల్ఎస్ఎల్ఆర్ డీకోచ్‌లలో ప్రయాణించవచ్చుఅయితే వారు ఖచ్చితంగా సరైన ప్రయాణ పత్రాన్ని కలిగి ఉండాలి.

దివ్యాంగుల బోగీలలో అనధికారికంగా ప్రయాణిస్తూ పట్టుబడిన ప్రయాణికులపై రైల్వే చట్టం 1989లోని నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని రైల్వే శాఖ స్పష్టం చేసిందిలబ్ధిదారులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఈ సదుపాయాలను వినియోగించుకునేలా చూడటమే దీని ముఖ్య ఉద్దేశమని తెలిపింది.

ఈ నిబంధనలను పక్కాగా అమలు చేయాలని భారత రైల్వే అన్ని జోనల్ రైల్వేలను ఆదేశించిందిదివ్యాంగులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండాసంబంధిత అధికారులందరూ ఈ నియమాలను ఖచ్చితంగా పాటించేలా అవసరమైన సూచనలు జారీ చేయాలని సూచించింది.

దివ్యాంగన్ కార్డు.. దీనినే ఈ టికెటింగ్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ (ఈపీఐసీఎస్అని కూడా పిలుస్తారుఇది రైల్వే శాఖ దివ్యాంగులకు ఇచ్చే ప్రత్యేక గుర్తింపు కార్డుఈ కార్డు ఉంటే రైలు టికెట్లపై వచ్చే రాయితీలను సులభంగా పొందవచ్చుచెల్లుబాటు అయ్యే దివ్యాంగ ధ్రువీకరణ పత్రం ఆధారంగా ఈ కార్డును జారీ చేస్తారుఅయితే కొన్ని వర్గాల వారికి యూడీఐడీ కార్డును కూడా అంగీకరిస్తారుకొత్త కార్డు తీసుకోవాలన్నా లేదా ఉన్న కార్డును పునరుద్ధరించుకోవాలన్నా.. భారత రైల్వేకు చెందిన దివ్యాంగజన్ పోర్టల్ లేదా కేంద్ర ప్రభుత్వ సర్వీసుల పోర్టల్ ద్వారా ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

 

***


(రిలీజ్ ఐడి: 2254125) సందర్శకుల సూచీ సంఖ్య : : 17
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Gujarati , Kannada