పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఐజీఐ ఎయిర్పోర్టులో స్పైస్ జెట్, ఆకాశ విమానాలకు స్వల్ప ప్రమాదం: విచారణ ప్రారంభించిన డీజీసీఏ

प्रविष्टि तिथि: 16 APR 2026 11:59PM by PIB Hyderabad

న్యూఢిల్లీలోని ఐజీఐ విమానాశ్రయంలో టెర్మినల్ వద్ద బే నెం.106 సమీపంలో ఈ రోజు స్పైస్ జెట్ బీ737-700 ఎయిర్ క్రాఫ్ట్ (ఎస్జీ-124 లేహ్-ఢిల్లీ), ఆకాశ ఎయిర్ బీ 737 మ్యాక్స్ ఎయిర్ క్రాఫ్ట్ (క్యూపీ-1406, ఢిల్లీ-హైదరాబాద్)కు స్వల్ప ప్రమాదం జరిగిందిరన్‌వే పై విమానం నెమ్మదిగా కదిలే టాక్సీయింగ్ సమయంలో ఈ ప్రమాదం జరిగిందిఈ ఘటనలో స్పైస్ జెట్ విమానం కుడి రెక్క ఆకాశ విమాన ఎడమవైపు హారిజెంటాల్ స్టెబిలైజర్‌ను తాకిందిరెండు విమానాలు దెబ్బతినడంతో తనిఖీలుమరమ్మతుల కోసం వాటిని నిలిపివేశారు.

ప్రాథమిక సమాచారం ప్రకారంఆకాశ విమానం బే నెం.104 నుంచి వెనక్కి వెళ్లి ఇంజిన్ ప్రారంభించినడానికి సిద్ధంగా ఉందిబే 108 దగ్గర నిలిపి ఉంచిన స్పైస్ జెట్ విమానం పైలట్.. తమ ఎయిర్ క్రాఫ్ట్ ఆకాశ విమానం నుంచి తగినంత దూరంలో ఉందని నిర్ధారించిన తర్వాత బే నెం.106లోకి రావడానికి ఏటీసీ అనుమతిచ్చిందిఈ సమయంలో వింగ్ వాకర్ అనుమతి లేకుండానే స్పైస్ జెట్ విమానం మలుపు తిరిగేందుకు ప్రయత్నించడంతో ఈ ఘటన జరిగింది.

గ్రౌండ్ హ్యాండ్లింగ్ అంశాలతో సహా ఈ ఘటనపై డీజీసీఏ విచారణ ప్రారంభించిందిదర్యాప్తు పూర్తయ్యేంత వరకు స్పైస్ జెట్ పైలట్లనుసంబంధిత ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారిని విధులనుంచి తప్పించారు.

పరిస్థితిని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నిశితంగా పరిశీలిస్తోందిభద్రతా ప్రమాణాలను పాటించడంలోఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడటంలో అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటోంది.


***


(रिलीज़ आईडी: 2252935) आगंतुक पटल : 53
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी