చట్ట, న్యాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

స్వచ్ఛతా పఖ్‌వాడా-2026 సందర్భంగా న్యాయ విభాగం ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాల నిర్వహణ

నాడు పోస్టు చేయడమైనది: 16 APR 2026 2:23PM by PIB Hyderabad

స్వచ్ఛతా పరిరక్షణ పక్షోత్సవాన్ని (‘స్వచ్ఛతా పఖ్‌వాడా-2026’ను) 2026 ఏప్రిల్ 1 మొదలు ఏప్రిల్ 15 వరకు పాటించిన సందర్భంగా, అనేక కార్యక్రమాలను న్యాయ విభాగం నిర్వహించింది. దీన్లో భాగంగా, డిపార్ట్‌మెంటులోని అధికారులతో పాటు ఉద్యోగుల వ్యక్తిగత జీవితంలో, వృత్తి జీవితంలో ఆరోగ్యం, శారీరక పరిశుద్ధత, మానసిక సంతులతలకు సంబంధించిన అవగాహనని పెంపొందింప చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు.
యోగాను సిబ్బంది జీవన సరళిలో ఒక ముఖ్య భాగంగా చేర్చుకొనే దిశగా ప్రోత్సహించడానికి ఈ నెల 2న అరగంట సేపు యోగా కార్యక్రమాన్ని డిపార్ట్‌మెంటు నిర్వహించింది. వారు స్వీయ జీవితంలోనే కాకుండా పని ప్రదేశంలో కూడా స్వచ్ఛత కి, శారీరక పరిశుద్ధతకి, పొందికైన జీవన విధానానికి ప్రాధాన్యాన్ని ఇస్తామంటూ తమ నిబద్ధతను మరోసారి స్పష్టం చేయాల్సిందిగా వారికి విజ్ఞ‌ప్తి చేశారు.
పరిశుభ్రత, శారీరక పరిశుద్ధతలపై వారు తమ ఆలోచనలను వెల్లడించేందుకు అవకాశాన్ని కల్పిస్తూ అధికారులకు, ఉద్యోగులకు ఈ నెల 9న వ్యాస రచన పోటీని నిర్వహించారు.  
ఈ నెల పదో తేదీన జైసల్మేర్ భవనం ఆవరణలో శ్రమదానాన్ని కార్యదర్శి (న్యాయం) శ్రీ నీరజ్ వర్మ మార్గదర్శకత్వంలో నిర్వహించారు. ఆ తరువాత, మొక్కలను నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. అధికారులు వారి ఇళ్ల సమీప ప్రాంతాల్లో లేదా మరేదైనా తగిన ప్రదేశంలో మొక్కలను పెంచి పర్యావరణంలో పచ్చదనాన్ని ప్రోత్సహించేటట్లు ప్రేరణనందించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వచ్ఛ, హరిత, సుస్థిర పర్యావరణాన్ని ప్రోత్సహించడం కోసం నిరంతర ప్రాతిపదికన ప్రయత్నాలు కొనసాగించడం ముఖ్యమని శ్రీ నీరజ్ వర్మ స్పష్టం చేశారు.
న్యాయ విభాగం (డీఓజే) అధికారులకూ, అధికారుల పిల్లలకూ ఈ నెల 10న ఒక చిత్రలేఖన పోటీని ఏర్పాటు చేశారు. బాలలు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. వారిలో ఈ కార్యక్రమం గొప్ప స్ఫూర్తిని నింపింది.
పక్షోత్సవం కాలంలో,  ఐగాట్ మిషన్ లైఫ్ (iGoT Mission LiFE.. లైఫ్ ఫర్ ఎన్విరాన్‌మెంట్) అంశంపై ఒక కార్యక్రమాన్ని డిపార్ట్‌మెంటు ఈ నెల 13న నిర్వహించింది. పర్యావరణాన్ని కాపాడడానికి, వాతావరణ మార్పు దుష్ప్రభావాలను తగ్గించడానికి ‘ప్రో ప్లానెట్ పీపుల్’ నెట్‌వర్కును తీర్చిదిద్దే లక్ష్యంతో అంతా కలిసి నిత్యం కొన్ని దైనందిన కార్యకలాపాలను పూర్తి చేయాలని కార్యక్రమంలో వివరించారు. వస్తువులను వాడి, పారవేసే పద్ధతికి బదులు ఆయా వస్తువులను మళ్లీ ఉపయోగించే పద్ధతిని అనుసరించడానికి ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చేటట్లు వారిలో చైతన్యాన్ని కలిగించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
స్వచ్ఛత పరిరక్షణ ఉత్సవాల్లో భాగంగా, న్యాయ విభాగం 2026 ఏప్రిల్ 14న భారత్ రత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద ‘మాల్యార్ఫణ్’ కార్యక్రమాన్ని చేపట్టింది. భారత రాజ్యాంగ శిల్పికి నివాళులు అర్పించారు. ఆయన బోధించిన సమానత్వం, న్యాయం, సామాజిక సాధికారత, మహిళలని, శ్రామికులను, సమాజంలో ఆదరణకు నోచుకోని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని సంఘంలో తీసుకురావాల్సిన సామాజిక సంస్కరణలనే ఆశయాలను సాకారం చేసే దిశగా చిత్తశుద్ధిని పునరుద్ఘాటించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. జైసల్మేర్ భవనం ఆవరణ ముందున్న పచ్చిక మైదానంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి చట్ట, న్యాయ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) శ్రీ అర్జున్ రామ్ మేఘ్‌వాల్ పుష్పాంజలి ఘటించారు.
సమాజానికి డాక్టర్ అంబేద్కర్ అందించిన మహత్తర సేవలను కార్యదర్శి (న్యాయం) శ్రీ నీరజ్ వర్మ గుర్తు చేశారు. డాక్టర్ అంబేద్కర్‌కు డిపార్ట్‌మెంటు పూర్వ కార్యదర్శులు, ఇతర సీనియర్ అధికారులు నివాళులు సమర్పించారు.
ఈ కార్యక్రమాలలో అధికారులు, సిబ్బంది సమధికోత్సాహంతో పాల్గొని, పనిప్రదేశాల్లోనూ, ఇతర చోట్లా స్వచ్ఛతనూ, శారీరక పరిశుద్ధతనూ పరిరక్షించడానికి సామూహిక బాధ్యతతో నడుచుకోవాలన్న స్ఫూర్తిని బలోపేతం చేశారు. పఖ్‌వాడా కాలంలో నిర్వహించిన వివిధ విభాగాల కార్యక్రమాలు, పోటీల్లో పాల్గొని రాణించిన అధికారులకు అనేక పురస్కారాలను అందించారు. స్వచ్ఛ్ భారత్ మిషన్ ఆదర్శాలకు కట్టుబడి ఉంటామని, క్రమం తప్పక వేర్వేరు కార్యక్రమాల్ని, ప్రచార ఉద్యమాల్ని, కార్యకలాపాలని చేపడుతూ స్వచ్ఛతని, సుస్థిరతని ప్రోత్సహిస్తామని డిపార్ట్‌మెంటు నిబద్ధతను పునరుద్ఘాటించింది.

 

***


(రిలీజ్ ఐడి: 2252614) సందర్శకుల సూచీ సంఖ్య : : 15
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Punjabi