శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
‘‘మానవ రహిత విమాన యానంలో ఆధునిక హైబ్రిడ్ చోదక శక్తి ఆవిష్కరణ కోసం ఉద్దేశించిన
భారత్-బ్రిటన్ సహకారపూర్వక ఆర్ అండ్ డీ కార్యక్రమంలో భాగంగా
కేసీ ఏవియేషన్‌కు టీడీబీ-డీఎస్‌టీ సహకారం
నాడు పోస్టు చేయడమైనది:
13 APR 2026 10:34AM by PIB Hyderabad
‘‘బూస్ట్ ఎలక్ట్రిక్ జంప్ టేకాఫ్ (బీఈ-జేటీఓ) పేరుతో చేపట్టే ఒక ప్రాజెక్టును దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వ సైన్స్, టెక్నాలజీ విభాగం (డీఎస్‌టీ)కి చెందిన టెక్నాలజీ డెవలప్‌మెంట్ బోర్డు (టీడీబీ) ఒక ఒప్పందాన్ని కేసీ ఏవియేషన్‌తో కుదుర్చుకుంది. బోర్డు పారిశ్రామిక సుస్థిరత్వ సాధనకు ఉద్దేశించిన భారత్- బ్రిటన్ సహకార ప్రధాన పరిశోధన, అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా షరతులతో కూడిన గ్రాంటును బ్రిటన్ కేంద్రంగా పనిచేస్తున్న ఏఆర్‌సీ ఏరోసిస్టమ్స్ సంస్థ భాగస్వామ్యంతో మంజూరు చేసింది.

టీడీబీ సహకారాన్ని అందిస్తున్న ఈ ప్రాజెక్టు ఆధునిక హైబ్రిడ్ చోదక శక్తి ఆధారిత జంప్ టేకాఫ్ (జేటీఓ) వ్యవస్థను అభివృద్ధి పరచడం దృష్టిని కేంద్రీకరిస్తుంది. మానవ రహిత, తేలికపాటి విమానాల రూపకల్పనకు తగిన వేదిక (ప్లాట్‌ఫారమ్)లను తయారు చేసి, వాటి నిర్వహణ సామర్థ్యాలను పెంపొందించడం కూడా ఈ ప్రాజెక్టు ధ్యేయం. రోటార్‌క్రాఫ్ట్ ప్రొపల్షన్ వ్యవస్థల ప్రమాణీకరణకొక ప్రత్యేక పరీక్షా వ్యవస్థను ఏర్పాటు చేయడం కూడా ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఈ ప్రత్యేక పరీక్షా వ్యవస్థ వ్యవస్థ తదుపరి తరానికి చెందిన వాయు సంబంధి గతిశీల (ఏరియల్ మొబిలిటీ) సాంకేతికతలను పరీక్షించడానికి, అభివృద్ధి చేయడానికి అవసరమైన కీలక మౌలిక సదుపాయంగా ఉపయోగపడుతుంది.
సరికొత్తగా తయారు చేసే వ్యవస్థ గైరోకాప్టర్లతో పాటు మానవ రహిత వైమానిక వ్యవస్థల వంటి తక్కువ సేపట్లోనే లేదా దాదాపుగా నిట్టనిలువుగా పైకెగరగలిగే హైబ్రిడ్ ప్రొపల్షన్ సాంకేతికతలను కలిగి ఉంటుంది. గగనతలాన్ని చేరుకోవడానికి పైకెగిరేందుకు ప్రయాణిస్తున్న దూరాన్ని తగ్గిస్తూ, కార్య నిర్వహణ పరంగా మెరుగైన సులభమైన పనితీరుతో తీర్చిదిద్దనున్న సరికొత్త సాంకేతికత వివిధ రకాల సేవలకు దన్నుగా నిలవగలదని భావిస్తున్నారు. ఈ విధమైన సేవలలో.. ప్రాంతీయ సంధానం, వైపరీత్యాలు ఎదురైన వేళ తగిన ప్రతిస్పందనపూర్వక చర్యలను చేపట్టడం, వైద్యాన్ని అందించడానికి బాధితులను తరలించడం, మానవ ప్రమేయం ఉండని ఆధునిక రవాణా వ్యవస్థ, నిఘా కార్యకలాపాలు, మరీ ముఖ్యంగా సుదూర ప్రాంతాలతో పాటు చేరుకోవడం చాలా కష్టంగా ఉండే ప్రాతాలకు కూడా పోవడం వంటివి భాగంగా ఉంటాయి.
భారత్‌లో ఉత్తరాది రాష్ట్రాల్లో ఇలాంటి ఒక తొలి ప్రొపల్షన్ టెస్టింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ఈ ప్రాజెక్టు లక్ష్యంగా ఉంది. మానవ రహిత, ఆధునిక వాయు సంబంధి గతిశీల వ్యవస్థల రూపకల్పనలో నిమగ్నమై ఉన్న అంకుర సంస్థలకు, డెవలపర్లకు ఈ కేంద్రం ద్వారా ఒక ప్రమాణీకృత పరీక్షా సంబంధి మౌలిక సదుపాయాల్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. సంస్థాగత అభివృద్ధి ప్రయత్నాలకు సహకారాన్ని అందించడం ఒక్కటే కాకుండా, ఈ కేంద్రం టెస్టింగ్ సేవల్నీ, హైబ్రిడ్ ప్రొపల్షన్ సేవల్నీ వాణిజ్య సరళి లో సమకూర్చి విస్తృత విస్తారిత అనుబంధ వ్యవస్థ తాలూకు ప్రయోజనాలను కల్పిస్తుందని ఆశిస్తున్నారు.
కొత్తగా ఏర్పాటు చేసిన ఏరోస్పేస్ సంస్థ కేసీ ఏవియేషన్.. చిన్న విమానాలకు, ప్రత్యేక విమానయాన సేవలకు రూపురేఖలను తీర్చిదిద్దడంతో పాటు తయారు చేయడంపై దృష్టిని కేంద్రీకరించింది. ఈ సంస్థ భారత విమానయాన రంగంలో, మానవ రహిత వ్యవస్థల రంగంలో పెరుగుతున్న అవసరాలను తీర్చడానికి పరిశ్రమ, విద్యారంగం, పరిశోధన సంస్థల నిపుణులతో కలిసి పని చేస్తోంది .
టీడీబీ కార్యదర్శి శ్రీ రాజేశ్ కుమార్ పాఠక్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, అంతర్జాతీయ కార్యక్రమాల్లో భాగంగా సహకార పూర్వక పరిశోధన, అభివృద్ధి ప్రక్రియలు వ్యూహాత్మక రంగాల్లో అత్యాధునిక సాంకేతికతలను ముందుకు తీసుకు పోవడంలో కీలక పాత్రను పోషిస్తాయన్నారు. హైబ్రిడ్ ప్రొపల్షన్, ఆధునిక టేకాఫ్ వ్యవస్థల్లో నూతన ఆవిష్కరణలు మానవ రహిత విమానయానం, ప్రాంతీయ వాయు గతిశీలతల విషయంలో భారత్ సామర్థ్యాలను చెప్పుకోదగ్గ స్థాయిలో పెంపొదించగలవనీ, దీంతో పాటు స్థిర, సమర్థ విమానయాన సేవల్లో కూడా తోడ్పాటును అందించగలవన్నారు.
తమకు అందుతున్న సహకారానికి గాను కేసీ ఏవియేషన్ ప్రమోటర్లు కృతజ్ఞతలను వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు తమ సంస్థకు వాస్తవిక పరిస్థితుల్లో తమ సాంకేతికతను ప్రమాణీకరించడానికి, మారుతున్న విమానయాన అవసరాలను తీర్చగల సేవల్ని విస్తరించడానికి అనువైన ప్రొపల్షన్ మాధ్యమాల్ని మరింత త్వరగా అభివృద్ధిపరచడంలో తోడ్పడుతుందని వారు అన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2251491)
సందర్శకుల సూచీ సంఖ్య : : 15