జాతీయ మానవ హక్కుల కమిషన్
azadi ka amrit mahotsav

మానవ హక్కుల లఘు చిత్రాల పోటీ-2025లో గెలుపొందిన ఏడుగురు విజేతలకు అవార్డులు ప్రదానం చేసిన భారత ఎన్‌హెచ్ఆర్‌సీ


భారతదేశ వైవిధ్యాన్ని ప్రతిబింబించిన మానవ హక్కుల చిత్రాలు: ఎన్‌హెచ్ఆర్‌సీ ఛైర్‌పర్సన్ జస్టిస్ వి. రామసుబ్రమణ్యన్

మానవ హక్కులను ప్రచారం చేయటంలో, పరిరక్షించటంలో సినిమాల పాత్రను స్పష్టం చేసిన ఎన్‌హెచ్ఆర్‌సీ సభ్యుడు జస్టిస్ (డాక్టర్) బిద్యుత్ రంజన్ సారంగి

మానవ హక్కులపై అవగాహన కల్పించేందుకు మార్గదర్శకులుగా ఉండే సామర్థ్యం యువ సినీ రూపకర్తలకు ఉందన్న సభ్యురాలు శ్రీమతి విజయ భారతి సయాని

మానన హక్కుల ప్రచారంలో ప్రధాన అవగాహనా కార్యక్రమంగా ఎన్‌హెచ్ఆర్‌సీ లఘు చిత్ర పోటీ రూపుదిద్దుకున్న తీరును వివరించిన సెక్రటరీ జనరల్ శ్రీ భరత్ లాల్

నాడు పోస్టు చేయడమైనది: 07 APR 2026 8:25PM by PIB Hyderabad

మానవ హక్కుల లఘు చిత్రాల పోటీ-2025లో గెలుపొందిన ఏడుగురు విజేతలకు అవార్డులను అందించేందుకు ఇవాళ న్యూఢిల్లీలో కార్యక్రమాన్ని నిర్వహించారుజాతీయ మానవ హక్కుల సంఘం కార్యాలయ (ఎన్‌హెచ్ఆర్‌సీప్రాంగణంలో అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగిందిఈ సందర్భంగా ఎన్‌హెచ్ఆర్‌సీ ఛైర్‌పర్సన్ జస్టిస్ విరామసుబ్రమణ్యన్ మాట్లాడుతూ.. విజేతలకు శుభాకాంక్షలు తెలిపారుసినిమాను రూపొందించటం పట్ల వారికున్న ఆసక్తిని అభినందించారుఆడియో-విజువల్ మాధ్యమం సృజనాత్మకమైనదనిఇది మనసుపై బలమైన ప్రభావాన్ని చూపుతుందని ఆయన స్పష్టం చేశారుదేశవ్యాప్తంగా 24 భారతీయ భాషల్లో ఎంట్రీలు రావటం విశేషమని.. ఈ చిత్రాల్లోని వైవిధ్యం కమిషన్ జాతీయ స్వభావాన్ని ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారుఈ కార్యక్రమంలో ఎన్‌హెచ్ఆర్‌సీ సభ్యులు జస్టిస్ (డాక్టర్బిద్యుత్ రంజన్ సారంగిశ్రీమతి విజయ భారతి సయానిసెక్రటరీ జనరల్ శ్రీ భరత్ లాల్డైరెక్టర్ జనరల్ (ఇన్వెస్టిగేషన్శ్రీమతి అనుపమ నీలేకర్ చంద్ర ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

2015లో పోటీలు ప్రారంభమైనప్పటి నుంచి ఏటా పెరుగుతున్న ఆదరణ.. మానవ హక్కులపై ప్రజల్లో పెరుగుతున్న అవగాహనను ప్రతిబింబిస్తుందని జస్టిస్ రామసుబ్రమణ్యన్ అన్నారుసమాజంలోని సమస్యలను ఎత్తిచూపేందుకు సృజనాత్మక వేదికలను ప్రజలు వినియోగిస్తున్నారనిఈ ధోరణి కొనసాగాలని ఆయన అన్నారు.

 

ఎన్‌హెచ్ఆర్‌సీ సభ్యుడు జస్టిస్ (డాక్టర్బిద్యుత్ రంజన్ సారంగి మాట్లాడుతూ.. ఏడుగురు విజేతల సినిమాలు వైవిధ్యమైన సందేశాలను అందించాయన్నారుమానవ హక్కులను ప్రచారం చేయటంలోపరిరక్షించటంలో సినిమాల పాత్రను ఆయన స్పష్టం చేశారుఅణగారిన వర్గాల జీవితాలను సున్నితంగా చిత్రీకరించిన 'ద డస్క్ ఆఫ్ లైఫ్డాక్యుమెంటరీ, 'రాణిలఘు చిత్రాలను ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు.

ఎన్‌హెచ్ఆర్‌సీ సభ్యురాలు శ్రీమతి విజయ భారతి సయాని ప్రసంగిస్తూ.. సామాజిక మార్పునకు సినీ రూపకల్పన శక్తిమంతమైన సాధనమనిమూస ధోరణులను ఇవి సవాలు చేస్తాయనిసామాజిక కట్టుబాట్లను తొలగిస్తాయనికార్యాచరణకు స్ఫూర్తినిస్తాయని అన్నారుమానవ హక్కులపై అవగాహన కల్పించేందుకు మార్గదర్శకులుగా వ్యవహరించే సామర్థ్యం యువ సినీరూపకర్తలకు ఉందని ఆమె తెలిపారు.

 

పోటీకి పెరుగుతున్న ఆదరణను సెక్రటరీ జనరల్ శ్రీ భరత్ లాల్ వివరించారు. 2024లో ఈ పోటీలకు 303 దరఖాస్తులు అందగా.. 2025లో ఆ సంఖ్య 526కు పెరిగినట్లు వెల్లడించారుమూడంచెల ఎంపిక ప్రక్రియలో 438 లఘు చిత్రాలు జ్యూరీ పరిశీలనకు అర్హత సాధించినట్లు తెలిపారుమానవ హక్కుల పరిరక్షణను ప్రోత్సహించే దిశగా.. ప్రముఖ చైతన్య కార్యక్రమంగా ఈ పోటీ రూపుదిద్దుకుందని ఆయన అన్నారు.

సంయుక్త కార్యదర్శి శ్రీమతి సైడింగ్‌పుయి ఛక్‌చువాక్ విజేతల పేర్లను ప్రకటించారుసారికా జైన్ రూపొందించిన 'రాణిచిత్రానికి మొదటి బహుమతిగా రూ.2లక్షలతో పాటు ట్రోఫీధ్రువీకరణ పత్రాన్ని అందించారుఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో ఉన్న ఈ హిందీ చిత్రం.. వర్గ విభేదాలనుఇళ్లల్లో పనిచేసే మహిళా కార్మికుల సమస్యలను తెలియజేస్తుంది.
 

 

శ్రీ అమల్ ఎస్ రూపొందించిన 'మీన్‌వైల్ షీచిత్రానికి రెండో బహుమతిగా రూ.1.5 లక్షలను అందించారుఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో ఉన్న మలయాళ చిత్రంలో.. గృహ హింసలింగ వివక్షత వల్ల మహిళా ఉద్యోగులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను వివరించారు.

తమిళనాడుకు చెందిన సాయి శశాంక్ తాటి రూపొందించిన 'ది డెలివరీచిత్రానికి మూడో బహుమతిగా లక్ష రూపాయాలను అందించారుగిగ్ వర్కర్లు ఎదుర్కొనే సామాజిక భద్రతా లేమిఉద్యోగ అభద్రత వంటి సవాళ్లను ఈ చిత్రం తెలియజేస్తుంది.

ప్రత్యేక ప్రశంసలు పొందిన నాలుగు చిత్రాలకు రూ.50,000 నగదు బహుమతిని అందించారుఅవిఫాల్గుణి భక్త సినిమా 'మాలతి', రవి కర్ణవాల్ రూపొందించిన ‘సెకండ్ ఛాన్స్’దామోదర్ డిపవార్ చిత్రం ‘డస్క్ ఆఫ్ లైఫ్’మనోజ్ అప్పాసోజాన్వేకర్ రూపొందించిన ‘భాగ్యశ్రీ’గిరిజన విద్యజైలు సంస్కరణలువృద్ధుల మనోధైర్యంగ్రామీణ భారతదేశంలోని వితంతు హక్కుల వంటి అంశాలపై ఈ సినిమాలను చిత్రీకరించారు.

 

ఈ కార్యక్రమంలో అవార్డులు పొందిన సినీ రూపకర్తలు సృజనాత్మకతకు సంబంధించిన విశేషాలను పంచుకున్నారుఅవార్డులు పొందిన సినిమాలను కమిషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారుమానవ హక్కులపై అవగాహనను ప్రోత్సహించేందుకు ప్రభుత్వ సంస్థలువిద్యా సంస్థలుపౌర సమాజ సంస్థలు వీటిని వినియోగించుకోవచ్చు.

 

***


(రిలీజ్ ఐడి: 2250017) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , हिन्दी