మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారతదేశ సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు: వృద్ధి నుంచి ప్రపంచ స్థాయి పోటీ దిశగా

నాడు పోస్టు చేయడమైనది: 03 APR 2026 9:40AM by PIB Hyderabad

ఆహార భద్రతఉపాధిఎగుమతి ఆదాయంస్థిరమైన జీవనోపాధిని అందించటంలో భారత మత్స్య రంగం కీలక పాత్ర పోషిస్తోంది. 2015 నుంచి భారత ప్రభుత్వం ఈ రంగంలో రికార్డు స్థాయిలో రూ.39,272 కోట్ల పెట్టుబడులు పెట్టిందిఈ రంగం ప్రాథమిక స్థాయిలో దాదాపు కోట్ల మంది మత్స్యకారులకుచేపలు సాగు చేసే రైతులకు ఉపాధిని కల్పిస్తోందిఇక అనుబంధ రంగాలతో కలిపితే ఈ సంఖ్య రెట్టింపు స్థాయిలో ఉంటుందిప్రపంచ చేపల ఉత్పత్తిలో సుమారు శాతం వాటాతో చేపల పెంపకంలో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశంగా భారత్ నిలిచిందిదశాబ్ద కాలంగా మత్స్య రంగం సంప్రదాయక పోకడలను దాటి వాణిజ్యపరంగా కీలక రంగంగా మారిందిచిన్న తరహా మత్స్యకారులందరితో కలిసి సమగ్ర వృద్ధిని సాధించటం ఉత్పత్తిలో స్పష్టంగా కనిపిస్తోంది. 2019‑20లో 141.64 లక్షల టన్నులుగా ఉన్న చేపల ఉత్పత్తి.. 2024‑25 నాటికి 197.75 లక్షల టన్నులకు చేరుకుందిఈ రంగం ఏటా సగటున శాతం వృద్ధిని నమోదు చేస్తోంది.

గత 11 ఏళ్లలో భారతదేశ సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు సగటున శాతం వార్షిక వృద్ధితో గణనీయమైనస్థిరమైన పురోగతిని సాధించాయి. 2013-14 ఆర్థిక సంవత్సరంలో రూ. 30,213 కోట్లుగా ఉన్న ఈ ఎగుమతులు.. 2024-25 నాటికి రెట్టింపునకుపైగా పెరిగి రూ.62,408 కోట్లకు చేరుకున్నాయిఇందులో రూ. 43,334 కోట్ల విలువైన రొయ్యల ఎగుమతులు ప్రధాన పాత్ర పోషించాయి.

సుమారు 350కి పైగా రకాల సముద్ర ఉత్పత్తులతో భారత్ వైవిధ్యమైన ఎగుమతులు చేస్తుందిఇవి ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 130 దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. 2024-25 గణాంకాల ప్రకారం.. అమెరికాకు భారత ఎగుమతుల్లో అత్యధికంగా 36.42 శాతం వాటాతో అగ్రస్థానంలో కొనసాగుతోందిరెండో ప్రధాన మార్కెట్‌గా చైనా ఉందిఆ తర్వాత యూరోపియన్ యూనియన్ఆగ్నేయాసియాజపాన్మధ్యప్రాచ్య దేశాలుఇతర ప్రపంచ మార్కెట్లన్నింటికీ సుమారు శాతం వాటా ఉందిభారతదేశ సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల్లో ప్రధానంగా శీతలీకరించిన రొయ్యలుఆ తర్వాతి స్థానాల్లో శీతలీకరించిన చేపలుస్క్విడ్ఎండబెట్టిన ఉత్పత్తులుకట్ల్‌ఫిష్సురిమి ఆధారిత ఉత్పత్తులుసజీవశీతలీకరించిన సముద్ర ఉత్పత్తులున్నాయిఇది ప్రపంచవ్యాప్తంగా డిమాండ్‌తో పాటు ఉత్పత్తుల వైవిధ్యతను ప్రతిబింబిస్తోందిమొత్తం సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల్లో విలువ ఆధారిత ఉత్పత్తుల వాటా 2.5 శాతం నుంచి 11 శాతానికి పెరిగిందిదీని ద్వారా లభించే ఎగుమతి విలువ 742 మిలియన్ డాలర్లకు చేరుకుంది.

కొన్ని వస్తువులపై అతిగా ఆధారపడటాన్ని తగ్గించటానికిప్రపంచ సముద్ర ఉత్పత్తుల మార్కెట్లో భారత్ ఉనికిని మరింత బలోపేతం చేయటానికి ఎగుమతి ఉత్పత్తుల వైవిధ్యతను ప్రభుత్వం క్రియాశీలకంగా ప్రోత్సహిస్తోందిప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ద్వారా విలువ ఆధారిత వ్యవస్థ అంతటా విస్తృతమైన మద్దతును మత్స్య శాఖ అందిస్తోందిఇందులో భాగంగా నాణ్యమైన చేప పిల్లల ఉత్పత్తిఉప్పు నీటి సాగుఎగుమతి ఆధారిత జాతులుసాంకేతిక పరిజ్ఞానంవ్యాధులను గుర్తించటంఉత్పత్తుల మూలాలను గుర్తించే వ్యవస్థలను బలోపేతం చేయటంసామర్థ్య పెంపు వంటి అంశాలపై దృష్టి సారిస్తోందిసముద్ర ఉత్పత్తుల రంగాన్ని బలోపేతం చేయటానికి పంట అనంతర మౌలిక సదుపాయాలునిరంతరం అందుబాటులో ఉండే శీతలీకరణ వ్యవస్థలుఆధునిక ఫిషింగ్ హార్బర్లుచేపల ల్యాండింగ్ కేంద్రాల అభివృద్ధిలో పెట్టుబడులను పెంచుతోందిఅంతేకాక.. అంతర్జాతీయంగా ప్రధాన మార్కెట్లలో పట్టు సాధించటానికిఉత్పత్తుల వైవిధ్యతను పెంచటానికి చేపల పెంపకంలో అధిక విలువ గల జాతుల పెంపకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందివాటిలో ట్యూనాసీబాస్కోబియాపొంపానోగిఫ్ట్ తిలాపియాగ్రూపర్ వంటి చేపల రకాలు.. పీతలుటైగర్ రొయ్యలుస్కాంపీసముద్రపు పాచి వంటివి ఉన్నాయిభారతదేశ ఎగుమతి పరిధిని విస్తరించటంఅంతర్జాతీయ మార్కెట్లలో ఉత్తమ ధరలను పొందటమే దీని ఉద్దేశం.

కీలక అంతర్జాతీయ మార్కెట్లలో భారత్ స్థానాన్ని నిలుపుకునేందుకు మత్స్య రంగాన్ని అంతర్జాతీయ నిబంధనలకుస్థిరత్వ ప్రమాణాలకనుగుణంగా క్రమబద్ధీకరిస్తోందిప్రధానంగా అమెరికా నిబంధనలకు అనుగుణంగా ఉండటంపై భారత్ ప్రత్యేక దృష్టి సారించిందిమెరైన్ మామల్ ప్రొటెక్షన్ యాక్ట్ (ఎంఎంపీఏప్రకారం.. సముద్ర క్షీరదాలు వలల్లో చిక్కుకోకుండా తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందిశాస్త్రీయ అంచనాలుసంబంధిత వర్గాలతో జరిపిన సంప్రదింపుల ఫలితంగా 2025లో అమెరికా అధికారుల నుంచి అనుకూలత గుర్తింపును భారత్ పొందిందిదీనివల్ల డిసెంబర్ 2025లో గడువు తర్వాత కూడా అంతరాయం లేకుండా అమెరికా మార్కెట్‌కు సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు కొనసాగాయివన్యప్రాంత రొయ్యల ఎగుమతులపై ఆంక్షలను తొలగించటానికి రొయ్యల ట్రాలీలకు తాబేలు బహిష్కరణ పరికరాలను (టీఈడీలుఅమర్చే ప్రక్రియ వేగవంతంగా సాగుతోందితీరప్రాంత రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున వీటిని ఏర్పాటు చేస్తున్నారుఎగుమతి చేసే ఉత్పత్తుల నాణ్యతను గుర్తించే విధానాలనుధ్రువీకరణ వ్యవస్థలను ప్రభుత్వం మరింత బలోపేతం చేసిందిఆహార భద్రతఅంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ప్రతి దశలోనూ నిశితంగా పర్యవేక్షించేందుకు జాతీయ డిజిటల్ వ్యవస్థను ప్రారంభించిందిభారతదేశ ప్రత్యేక ఆర్థిక మండలిలో సుస్థిరమైన చేపల వేటను నియంత్రించే నూతన నిబంధనలతో పాటు భారతదేశాన్ని బాధ్యతాయుతమైనఅంతర్జాతీయ ప్రమాణాలను పాటించే సముద్ర ఉత్పత్తుల ఎగుమతిదారుగా నిలబెట్టేందుకు జరుగుతున్న సమష్టి కృషిని ఈ చర్యలు ప్రతిబింబిస్తున్నాయి.

మత్స్య రంగంలో వ్యాపార నిర్వహణను సులభతరం చేసేందుకు భారత మత్స్య శాఖ పలు నియంత్రణదిగుమతి ప్రక్రియలను చేపట్టిందిఇందులో భాగంగా శానిటరీ ఇంపోర్ట్ పర్మిట్ (సిప్వ్యవస్థను పూర్తిగా డిజిటలైజ్ చేసిజాతీయ సింగిల్ విండో వ్యవస్థతో అనుసంధానించారుదీనివల్ల గతంలో అనుమతుల కోసం 30 రోజుల సమయం పట్టగా.. ఇప్పుడు 72 గంటల్లోనే పని పూర్తవుతుందివాణిజ్య కార్యకలాపాలను సులభతరం చేసేందుకు ఎస్‌ఎఫ్‌పీ రొయ్యల బ్రూడ్‌స్టాక్చేప నూనెపరిమిత ఆర్‌ అండ్‌ డీ నమూనాలుకేవలం విలువను జోడించటంతిరిగి ఎగుమతి చేసే అడవి చేపల దిగుమతులపై ఎస్‌ఐపీ నిబంధనలను ప్రభుత్వం మినహాయించిందిఇటీవలి చట్టపరమైన సంస్కరణలు చేపల పెంపకం యూనిట్లపై నిబంధనల భారాన్ని మరింత తగ్గించాయిఈ రంగాన్ని వాణిజ్యానికి అనుకూలంగాపెట్టుబడులకు సిద్ధంగా మార్చేందుకు ప్రభుత్వ ప్రయత్నాలను ఇది స్పష్టం చేస్తుంది.

వచ్చే ఐదేళ్లలో భారత ప్రభుత్వం సముద్ర ఉత్పత్తుల ఎగుమతి వ్యూహాన్ని మరింత బలోపేతం చేయాలని యోచిస్తోందిఇందులో భాగంగా అధిక విలువ గల ఎగుమతులుమార్కెట్ విస్తరణనాణ్యతా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి సారించనుందివిస్తృతమైన ప్రాసెసింగ్ సౌకర్యాలునైపుణ్యం గల సిబ్బందిమెరుగైన ధ్రువీకరణ వ్యవస్థల ద్వారా మొత్తం ఎగుమతుల్లో విలువ ఆధారిత ఉత్పత్తుల వాటాను పెంచటమే లక్ష్యంగా పెట్టుకుందియూకేఈయూఏసియాన్పశ్చిమాసియా దేశాలకు మార్కెట్ల ఎగుమతులను పెంచే ప్రయత్నాలతో పాటు దేశీయంగా ఎగుమతి కేంద్రాలనుమంచినీటి సరఫరా వ్యవస్థలను బలోపేతం చేయానికి కృషి చేస్తోందిమెరుగైన శీతలీకరణ వ్యవస్థలుఉత్పత్తి మూలాలను గుర్తించే సాంకేతికతనాణ్యతా ప్రమాణాల నిబంధనలు రాబోయే కాలంలో ప్రపంచంలోనే అత్యంత విశ్వసనీయమైనప్రధానంగా నాణ్యత గల సముద్ర ఉత్పత్తుల ఎగుమతిదారుగా భారత్‌ను నిలబెట్టేందుకు కీలకంగా మారతాయి.

 

***


(రిలీజ్ ఐడి: 2248769) సందర్శకుల సూచీ సంఖ్య : : 30
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Kannada