గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ
ఆంధ్రప్రదేశ్‌లో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (ఈఎంఆర్ఎస్)
నాడు పోస్టు చేయడమైనది:
02 APR 2026 3:53PM by PIB Hyderabad
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 28 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలు (ఈఎంఆర్ఎస్) మంజూరయ్యాయని, అవన్నీ ప్రస్తుతం పని చేస్తున్నాయని కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ జువల్ ఓరం ఈరోజు లోక్‌సభలో తెలిపారు. జిల్లా వారీగా వివరాలు:
|
వరస నెం.
|
జిల్లా
|
మంజూరైన ఈఎంఆర్ఎస్ ల సంఖ్య
|
పని చేస్తున్న ఈఎంఆర్ఎస్ ల సంఖ్య
|
2025-26 లో విద్యార్థుల సంఖ్య
|
|
1
|
అల్లూరి సీతారామ రాజు
|
17
|
17
|
6300
|
|
2
|
ఏలూరు
|
1
|
1
|
445
|
|
3
|
మన్యం పార్వతీపురం P
|
5
|
5
|
1936
|
|
4
|
ప్రకాశం
|
1
|
1
|
402
|
|
5
|
శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు
|
1
|
1
|
430
|
|
6
|
శ్రీకాకుళం
|
1
|
1
|
422
|
|
7
|
తిరుపతి
|
2
|
2
|
775
|
|
|
మొత్తం
|
28
|
28
|
10710
|
షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) విద్యార్థులకు వారి సొంత సామాజిక-సాంస్కృతిక వాతావరణంలో నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేశారు. ఆధునిక డిజైన్‌తో 15 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న సుసంపన్నమైన ప్రాంగణాలు వీటికి ఉన్నాయి. 6 నుంచి 12వ తరగతి వరకు 480 మంది విద్యార్థుల సామర్థ్యం కలిగిన ఈ పాఠశాలల్లో బాలురు, బాలికలకు వేర్వేరు హాస్టళ్లు, ఉమ్మడి భోజన, వంట సౌకర్యాలు, బోధన, బోధనేతర సిబ్బందికి క్వార్టర్లు, గాలి వెలుతురు ధారాళంగా ఉండే తరగతి గదులు, విద్యా సంబంధిత అభ్యాసానికి అవసరమైన అత్యాధునిక ప్రయోగశాలలు గ్రంథాలయ సౌకర్యాలు కల్పించారు.
ప్రస్తుత తేదీ నాటికి, వివిధ స్థాయిల తరగతులతో 499 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలు పని చేస్తున్నాయి. 480 మంది విద్యార్థుల పూర్తి సామర్థ్యంతో, 12వ తరగతి వరకు ఉన్న ప్రతి పాఠశాలకు 31 బోధనా సిబ్బంది పోస్టులు, 21 బోధనేతర సిబ్బంది పోస్టులు మంజూరయ్యాయి. మొదటి దశ నియామక ప్రక్రియ పూర్తయింది. ఎంపికైన అభ్యర్థులను ఆంధ్రప్రదేశ్‌తో సహా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ పాఠశాలల్లో నియమించారు. అంతేకాకుండా, ఈఎస్ఎస్ఈ - 2025 కింద రెండవ దశ నియామక ప్రక్రియ ప్రారంభమైంది. దీనికి తోడు, విద్యా సంబంధిత కార్యకలాపాలకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు, ఖాళీగా ఉన్న పోస్టులలో డెప్యుటేషన్ ద్వారా లేదా అవుట్‌సోర్సింగ్ పద్ధతిలో సిబ్బందిని నియమించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు.
జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) మార్గదర్శకాలు, పాఠశాలలో గురుకుల వ్యవస్థ అవసరాలకు అనుగుణంగా బోధన, బోధనేతర సిబ్బందికి నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ (ఎన్ఈఎస్టీఎస్) శిక్షణ అందిస్తోంది. ప్రస్తుత తేదీ నాటికి, సుమారు 4455 మంది బోధన, బోధనేతర సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ఐఎస్‌టీఎమ్, ఢిల్లీ యూనివర్సిటీ, ఐఐటీలు, సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఎన్‌సీఈఆర్‌టీ, సీబీఎస్ఈ వంటి ప్రముఖ సంస్థలకు చెందిన విషయ నిపుణుల సహకారంతో ఈ శిక్షణ కొనసాగుతోంది. శిక్షణ ప్రణాళికలో ప్రాక్టికల్ లెర్నింగ్, విద్యార్థుల సంక్షేమం, గిరిజన తెగల పట్ల అవగాహన, విద్యలో సాంకేతికత వినియోగం వంటి అంశాలపై ఇంటరాక్టివ్ సెషన్లు ఉన్నాయి.
ఏకలవ్య పాఠశాలల్లో మధ్యలో మానివేసే విద్యార్థుల (డ్రాపౌట్) రేటు గత కొన్నేళ్లుగా చాలా తక్కువగా ఉన్నప్పటికీ, ఎన్ఈఎస్టీఎస్ దీనిని నిశితంగా పర్యవేక్షిస్తోంది. డ్రాపౌట్‌లను ఇంకా తగ్గించడానికి అవగాహన సదస్సులు, విద్యార్థుల ఇళ్లకు ఉపాధ్యాయుల సందర్శనలు, కెరీర్ కౌన్సెలింగ్, వృత్తి విద్య, నైపుణ్య శిక్షణ వంటి వివిధ కార్యక్రమాలను చేపట్టారు.చేపట్టడం
***
(రిలీజ్ ఐడి: 2248624)
సందర్శకుల సూచీ సంఖ్య : : 29