ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

హనుమాన్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 02 APR 2026 10:47AM by PIB Hyderabad

హనుమాన్ జయంతి ఈ రోజు. ఈ సందర్భంగా ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పవిత్ర సందర్భం ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త శక్తినీ, ఉత్సాహాన్నీ అందించాలని శ్రీ మోదీ ప్రార్థించారు. ‘‘మన దేశ సామర్థ్యం మరింత వృద్ధి చెందేటట్లుగా మన అందరికీ బలం, వివేకం, జ్ఞానం సమృద్ధంగా లభించే విధంగా పవన పుత్రుడు హనుమాన్ జీ ఆశీస్సుల్ని అందించాలని నేను కోరుకుంటున్నాను’’ అని శ్రీ మోదీ అన్నారు.      

సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో ప్రధాన మంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ -
‘‘హనుమాన్ జన్మోత్సవ వేళ.. దేశ ప్రజలందరికీ అనంత శుభకామనలు. ఈ పవిత్ర సందర్భం ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త శక్తిని, స్ఫూర్తిని తీసుకురావాలి. అందరికీ విద్యాబుద్ధులతో పాటు బలం కూడా సమృద్ధంగా అందేటట్లు పవన పుత్రుడు హనుమాన్ జీ ఆశీర్వాదాలు అందించాలని నేను కోరుకుంటున్నాను..  దాంతో, దేశ శక్తి సామర్థ్యాలు మరింత పెంపొందుతాయి. జై బజరంగ్‌బలీ’’ అని పేర్కొన్నారు.

 

***


(రిలీజ్ ఐడి: 2248157) సందర్శకుల సూచీ సంఖ్య : : 16
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Assamese , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Gujarati , Kannada , Malayalam