ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దిశా కార్యక్రమంలో న్యాయ సేతు ఏఐ చాట్‌బాట్, దిషిక చిహ్నం ఆవిష్కరణ... ఉపరాష్ట్రపతి ప్రసంగాన్ని అప్పటికప్పుడు వివిధ భాషల్లోకి అనువదించిన ‘భాషిణి’

నాడు పోస్టు చేయడమైనది: 31 MAR 2026 5:11PM by PIB Hyderabad

విజ్ఞాన్ భవన్‌లో న్యాయ శాఖ నిర్వహించిన దిశా కార్యక్రమంలో న్యాయ సేతు ఏఐ చాట్‌బాట్‌నుదాని అధికారిక చిహ్నం ‘దిషిక’ను భారత ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్కేంద్ర న్యాయ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యతశ్రీ అర్జున్ రామ్ మేఘవాల్ ఆవిష్కరించారు.

'న్యాయ సేతు'.. ఒక ధ్వని ఆధారితమల్టీమోడల్బహుభాషా కృత్రిమ మేధతో పనిచేసే చట్టపరమైన సహాయకారిఇది పౌరులకు చట్టపరమైన విధానాలుహక్కులువివిధ చర్యలను పలు భారతీయ భాషల్లో సులభమైన మాటలుటెక్స్ట్‌ సంభాషణల ద్వారా అర్థం చేసుకోవడంలో సహాయపడుతుందిన్యాయ సేవలను సామాన్యులకు సైతం అందుబాటులోకి తీసుకొచ్చేందుకు దీనిని రూపొందించారు.

డిజిటల్ ఇండియా భాషిణి విభాగం ద్వారా ఒక సమగ్ర కృత్రిమ మేధ వ్యవస్థగా నిర్మించిన ఈ వేదిక.. పూర్తి స్థాయి వాయిస్ సాంకేతిక వ్యవస్థతో పనిచేస్తుందిభాషిణి ఏఎస్‌ఆర్‌ (ఆటోమేటిక్ స్పీచ్ రికగ్నిషన్), బహుభాషా ఎన్‌ఎల్‌పీ (నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్), సంభాషణాత్మక ఏఐ వ్యవస్థల వంటి సమీకృత సాంకేతికతల ద్వారా వినియోగదారులకు ఎటువంటి ఆటంకం లేని వాయిస్ ఆధారిత సేవలను అందిస్తుందిఈ పరిష్కారం చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగా రూపొందించారుభారతీయ న్యాయ సంహిత వంటి విధానాలకు అనుగుణంగా శిక్షణ పొందడం ద్వారా బాధ్యతాయుతమైనసురక్షితమైనసందర్భానికి అనుగుణంగా సమాధానాలను అందిస్తుంది.

డిజిటల్ ఇండియా భాషిణి విభాగం సీఈఓ శ్రీ అమితాబ్ నాగ్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం ప్రాముఖ్యతను వివరించారున్యాయం అందించే ప్రక్రియలో భాష ఇకపై అడ్డంకిగా మారకూడదనిఅందరికీ సమానంగా న్యాయం చేకూరేలా చేయడంలో న్యాయ సేతు కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారుపూర్తిగా మాటల ద్వారానే పనిచేసే సాంకేతికతో నిర్మించిన ఈ వేదిక.. ఏఐ సాయంతో వినియోగదారులకు ఎటువంటి ఆటంకం లేకుండా వాయిస్ సేవలను ఎలా అందించవచ్చో నిరూపిస్తుందని తెలిపారుపౌర సేవలను ప్రజలకు వారి సొంత భాషల్లో చేరువ చేస్తూన్యాయం అందరికీ అందుబాటులో ఉండాలనే లక్ష్యాన్ని ఇది ముందుకు తీసుకెళ్తుందని చెప్పారు.

దిషిక’... ఒక స్నేహపూర్వక డిజిటల్ సహాయకురాలిగా పనిచేస్తుందిఇది న్యాయపరమైన సందేహాలను నివృత్తి చేయడంలో వినియోగదారులకు మార్గదర్శకత్వం అందిస్తూ.. ముఖ్యంగా న్యాయ వ్యవస్థ గురించి పెద్దగా తెలియని వారిలో నమ్మకాన్నిభాగస్వామ్యాన్ని పెంచుతుంది.

ఈ కార్యక్రమంలో భాషిణికి చెందిన శ్రుతిలేఖ సాంకేతిక వ్యవస్థ ఉపరాష్ట్రపతి ప్రసంగాన్ని ఆయన మాట్లాడుతుండగానే ఇతర భాషల్లోకి అనువదించిందిదీనివల్ల ఎటువంటి అంతరాయం లేకుండా అందరికీ సమాచారం స్పష్టంగా అర్థమైంది.

 

పౌరులకుముఖ్యంగా భాషాపరమైనవిధానపరమైన అడ్డంకులను ఎదుర్కొంటున్న వారికి చట్టపరమైన అంశాలను న్యాయ సేతు సులభతరం చేస్తుందివాయిస్-ఆధారితకృత్రిమ మేధ సాంకేతికతలు ఎలా ఉపయోగపడతాయో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా నిలుస్తుందిప్రతి పౌరుడికి న్యాయాన్ని చేరువ చేసే క్రమంలో విస్తరించదగినఅందరికీ అందుబాటులో ఉంటే వాయిస్‌ ఆధారిత డిజిటల్ మౌలిక సదుపాయాలను అందించడంలో భాషిని పాత్రను ఈ పరిష్కారం మరింత బలోపేతం చేస్తుంది.

కేంద్ర ఎలక్ట్రానిక్స్సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ పరిధిలోని కృత్రిమ మేధ ఆధారిత భాషా సాంకేతిక కార్యక్రమమే భాషిణిదీనిని డిజిటల్ ఇండియా భాషిణి డివిజన్ అమలు చేస్తోందిఇది డిజిటల్‌ ఇండియా కార్పొరేషన్‌కింద ఉన్న స్వతంత్ర వ్యాపార విభాగంప్రపంచంలోనే అతిపెద్ద కృత్రిమ మేధ విశ్లేషణ వేదికలో ఒకటైన నేషనల్ హబ్ ఫర్ లాంగ్వేజ్ టెక్నాలజీ (ఎన్‌హెచ్‌ఎల్‌టీ)ని భాషిణి అభివృద్ధి చేసిందిదేశీయఅంతర్జాతీయ భాషల్లో అత్యాధునిక వాయిస్‌టెక్స్ట్ సాంకేతికతలను అందిస్తుందిభాషిణి ప్రస్తుతం 500 కంటే ఎక్కువ ప్రభుత్వ వెబ్‌సైట్లకు సేవలు అందిస్తోందిప్రతిరోజూ 1.5 కోట్లకు పైగా ఏఐ ప్రాసెసింగ్ పనులను నిర్వహిస్తోందిఇది 36 రాతపూర్వక భాషలు, 23 వాయిస్‌ భాషల్లో 20కి పైగా ప్రత్యేక ఎన్ఎల్‌పీ సేవలను అందిస్తోందిఇందులో సంక్లిష్టమైన గిరిజన మాండలికాలుఅంతర్జాతీయ భాషలు కూడా ఉన్నాయి.

 

ప్రస్తుత న్యాయసేతు అమలును డిజిటల్ ఇండియా భాషిణి డివిజన్ ఒక పూర్తి స్థాయి పరిష్కారంగా అభివృద్ధి చేసిందివినియోగదారులు ఎటువంటి ఆటంకం లేకుండా కేవలం తమ మాటల ద్వారానే చట్టపరమైన సేవలను పొందేలా భాషా ఏఐ పూర్తి సామర్థ్యాన్ని ఇది చాటిచెబుతోంది.

 

***


(రిలీజ్ ఐడి: 2247413) సందర్శకుల సూచీ సంఖ్య : : 21
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी