గనుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

2025–26 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో కార్యాచరణలోకి వచ్చిన 30 ఖనిజ బ్లాకులు

నాడు పోస్టు చేయడమైనది: 30 MAR 2026 7:04PM by PIB Hyderabad

భారత గనుల రంగంలో ఓ చారిత్రాత్మక మైలురాయిగా.. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 30 ఖనిజ బ్లాకులు విజయవంతంగా కార్యకలాపాలను ప్రారంభించాయి. ఒకే ఆర్థిక సంవత్సరంలో ఇంత భారీ సంఖ్యలో బ్లాకులు కార్యాచరణలోకి రావడం చరిత్రలో ఇదే మొదటిసారి.

ఈ విజయం పనులను వేగవంతమైన అమలు దిశగా ఒక ప్రధాన మార్పును సూచిస్తుంది. వేలం వేసిన బ్లాకులను క్షేత్రస్థాయిలోవాస్తవ ఉత్పత్తిలోకి తీసుకురావడంలో ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ఇది నిదర్శనం.

గతంలో 2025-26 ఆర్థిక సంవత్సరంలో 200 కంటే ఎక్కువ ఖనిజ బ్లాకులను వేలం వేసినట్లు గనుల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది ఈ రంగంలో ఉన్న బలమైన పురుగోతిని సూచిస్తుంది. అదే సంవత్సరంలో 30 బ్లాకులను నిర్వహణలోకి తీసుకురావడం ..వేలం వేసిన బ్లాకులను నిర్ణీత కాలవ్యవధిలో ఉత్పత్తిలోకి తీసుకురావడంలో సాధించిన గణనీయమైన పురోగతిని తెలియజేస్తుంది.

ఇటీవలి కాలంలో వేలం వేసిన ఖనిజ బ్లాకుల కార్యకలాపాలను వేగవంతం చేయడానికి గనుల మంత్రిత్వ శాఖ వరుస సంస్కరణలను చేపట్టింది. సరళీకృత విధానాలు, వేగవంతమైన చట్టబద్ధమైన అనుమతులు, రాష్ట్ర ప్రభుత్వాలతో బలమైన సమన్వయం, నిరంతర పర్యవేక్షణ ద్వారా గనుల తవ్వకాలను సకాలంలో ప్రారంభించేలా ఒక పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేశారు.

ఈ ఘనత వికసిత్ భారత్ 2047 దార్శనికతకు అనుగుణంగా ఉంది. స్వదేశీ ఖనిజ ఉత్పత్తిని బలోపేతం చేయడం, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం ద్వారా  ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆకాంక్షించిన ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యానికి ఇది తోడ్పడుతుంది.

ప్రధాన ఖనిజ సంపద కలిగిన రాష్ట్రాల్లో కార్యకలాపాలు ప్రారంభించిన ఈ బ్లాకులు విస్తరించి ఉన్నాయి. వీటిలో ఇనుప ఖనిజం, సున్నపురాయి, బాక్సైట్, మాంగనీస్ వంటి ముఖ్యమైన ఖనిజాలు ఉన్నాయి. ఇవి ఉక్కు, సిమెంట్, మౌలిక సదుపాయాల వంటి కీలక రంగాలకు అత్యంత ప్రాధాన్యత కలిగినవి.

2025-26 ఆర్థిక సంవత్సరంలో అందుబాటులోకి వచ్చిన బ్లాకుల జాబితా

 


ఈ మైలురాయి దేశీయ ఖనిజ ఉత్పత్తిని పెంచడం, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం, ఉపాధిని కల్పించడం, ఆర్థిక వృద్ధికి దోహదపడుతుందని భావిస్తున్నారు.

ఇదే ఉత్సాహాన్ని కొనసాగించడానికి, రాబోయే సంవత్సరాల్లో ఖనిజ బ్లాకుల కార్యకలాపాలను మరింత వేగవంతం చేయడానికి గనుల మంత్రిత్వ శాఖ కట్టుబడి ఉంది.

 

***


(రిలీజ్ ఐడి: 2247365) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी