పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ
6 రాష్ట్రాల్లో గ్రామీణ స్థానిక పాలన బలోపేతం లక్ష్యంగా 15వ ఆర్థిక సంఘం గ్రాంట్ల కింద రూ. 1,500 కోట్లకు పైగా నిధులు విడుదల చేసిన కేంద్రం
తెలంగాణ, రాజస్థాన్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, మిజోరం, మేఘాలయ పీఆర్ఐలకు ప్రయోజనం
నాడు పోస్టు చేయడమైనది:
31 MAR 2026 9:36AM by PIB Hyderabad
తెలంగాణ, రాజస్థాన్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, మిజోరం, మేఘాలయ రాష్ట్రాల్లోని పంచాయతీ రాజ్ సంస్థలు, గ్రామీణ స్థానిక సంస్థల కోసం 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను పదిహేనో ఆర్థిక సంఘం టైడ్, అన్‌టైడ్ గ్రాంట్లను మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం, ఆ నిధులను విడుదల చేసింది. పంచాయతీ రాజ్ సంస్థల్లో క్షేత్రస్థాయి పాలనను మరింత బలోపేతం చేయడంతో పాటు, అవసరాల ఆధారిత స్థానిక అభివృద్ధికీ ఈ గ్రాంట్లు తోడ్పడుతాయి.
తెలంగాణ రాష్ట్రానికి 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 'అన్‌టైడ్ గ్రాంట్లు' (నిర్దిష్ట వినియోగ నిబంధనలు లేని నిధులు) మొదటి విడతగా రూ. 247.94 కోట్లు విడుదల చేశారు. ఈ నిధులు రాష్ట్రంలోని అర్హత కలిగిన 12,600 గ్రామ పంచాయతీల కోసం ఉద్దేశించినవి. ఉత్తరాఖండ్ రాష్ట్రానికి 2025-26 ఆర్థిక సంవత్సరపు అన్‌టైడ్ గ్రాంట్లు రెండో విడతగా రూ. 91.31 కోట్లు విడుదల చేశారు. ఆ రాష్ట్రంలోని మొత్తం 13 జిల్లా పంచాయతీలు, 95 మండల పంచాయతీలు, అర్హత కలిగిన 7,784 గ్రామ పంచాయతీలు ఈ నిధుల ద్వారా లబ్ధి పొందుతాయి. 2025-26 ఆర్థిక సంవత్సరపు అన్‌టైడ్ గ్రాంట్ల మొదటి విడతలో గతంలో నిలిపివేసిన రూ. 1.84 కోట్ల మొత్తాన్ని... అదనంగా అర్హత సాధించిన మరో 216 గ్రామ పంచాయతీలకూ విడుదల చేశారు.
రాజస్థాన్ రాష్ట్రానికి 2025-2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 'అన్‌టైడ్ గ్రాంట్లు' (నిర్దిష్ట వినియోగ నిబంధనలు లేని నిధులు) రెండో విడతగా రూ. 315.61 కోట్లు విడుదల చేశారు. ఈ నిధులు రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లా పంచాయతీలకు, 352 మండల పంచాయతీలకు, అర్హత కలిగిన 3857 గ్రామ పంచాయతీలకు ఉద్దేశించినవి. 2025-26 ఆర్థిక సంవత్సరపు అన్‌టైడ్ గ్రాంట్ల మొదటి విడతలో నిలిపివేసిన రూ. 12.57 కోట్ల మొత్తాన్ని... అదనంగా అర్హత పొందిన 9 జిల్లా పంచాయతీలకు, 13 మండల పంచాయతీలకు విడుదల చేశారు. మేఘాలయ రాష్ట్రానికి 2021-22 ఆర్థిక సంవత్సరపు అన్‌టైడ్ గ్రాంట్ల రెండో విడతగా రూ. 27.00 కోట్లు లభించాయి. ఈ నిధులు రాష్ట్రంలోని అర్హత కలిగిన మూడు స్వయం ప్రతిపత్తి గల జిల్లా మండళ్లకు (ఖాసీ, గారో, జైంతియా) కేటాయించారు. కేంద్ర ప్రభుత్వం మేఘాలయకు 'టైడ్ గ్రాంట్లు' (నిర్దిష్ట ప్రయోజనాల కోసం కేటాయించిన నిధులు) రెండో విడతగా రూ. 22.20 కోట్లను విడుదల చేసింది. ఈ నిధులు రాష్ట్రంలోని స్వయంప్రతిపత్తి గల జిల్లా మండళ్ల పరిధిలో ఉన్నవి సహా, అర్హత కలిగిన మొత్తం 816 గ్రామ మండళ్లకు ఉద్దేశించినవి.
మహారాష్ట్రకు 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 15వ ఆర్థిక సంఘం 'టైడ్ గ్రాంట్లు' (నిర్దిష్ట వినియోగ గ్రాంట్ల) 1వ, 2వ విడతల్లో నిలిపివేసిన మొత్తాలుగా కేంద్ర ప్రభుత్వం ఒక్కో విడతకు రూ. 109.06 కోట్లను విడుదల చేసింది. దీని ద్వారా అదనంగా 12 అర్హత కలిగిన జిల్లా పరిషత్తులు, 125 మండల పరిషత్తులు లబ్ధి పొందాయి. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 15వ ఆర్థిక సంఘ టైడ్ గ్రాంట్ల 1వ విడతలో నిలిపివేసిన మొత్తంగా మహారాష్ట్రకు రూ. 116.97 కోట్లూ లభించాయి. ఈ నిధులు అదనంగా 12 జిల్లా పంచాయతీలు, 125 మండల పంచాయతీలు, 27 గ్రామ పంచాయతీలకు వర్తిస్తాయి. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన టైడ్ గ్రాంట్ల 2వ విడతలో నిలిపివేసిన మొత్తం రూ. 329.21 కోట్లను అదనంగా 12 జిల్లా పంచాయతీలు, 125 మండల పంచాయతీలు, 5,249 గ్రామ పంచాయతీల కోసం విడుదల చేశారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 15వ ఆర్థిక సంఘ 'అన్‌టైడ్ గ్రాంట్లు' (సాధారణ వినియోగ గ్రాంట్ల) 1వ, 2వ విడతల్లో నిలిపివేసిన మొత్తాలుగా ఒక్కో విడతకు రూ. 72.70 కోట్లు విడుదల చేశారు. దీని ద్వారా పైన పేర్కొన్న అదే 12 జిల్లా పంచాయతీలు, 125 మండల పంచాయతీలు లబ్ధి పొందాయి.
పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ, జలశక్తి మంత్రిత్వ శాఖ (తాగునీరు, పారిశుధ్య విభాగం) ద్వారా... పంచాయతీ రాజ్ సంస్థలు, గ్రామీణ స్థానిక సంస్థల కోసం రాష్ట్రాలకు 15వ ఆర్థిక సంఘ గ్రాంట్ల విడుదలను భారత ప్రభుత్వం సిఫార్సు చేస్తుంది. ఆ తర్వాత వీటిని ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేస్తుంది. కేటాయించిన గ్రాంట్లు ఒక ఆర్థిక సంవత్సరంలో 2 వాయిదాల్లో సిఫార్సు చేయడం, విడుదల చేయడం జరుగుతుంది. ఈ అన్‌టైడ్ గ్రాంట్లను జీతాలు, ఇతర స్థాపన ఖర్చులు మినహా రాజ్యాంగంలోని పదకొండో షెడ్యూల్‌లో పొందుపరిచిన ఇరవై తొమ్మిది అంశాల కింద ఆయా ప్రాంతాలకు అవసరమైన నిర్దిష్ట అవసరాల కోసం పంచాయతీ రాజ్ సంస్థలు, గ్రామీణ స్థానిక సంస్థలు వినియోగించుకుంటాయి. టైడ్ గ్రాంట్లను ఈ ప్రాథమిక సేవల కోసం ఉపయోగించవచ్చు: (ఎ) పారిశుధ్యం, బహిరంగ మలవిసర్జన రహిత (ఓడీఎఫ్) స్థితిని నిర్వహించడం. ఇందులో ముఖ్యంగా గృహ వ్యర్థాల నిర్వహణ, శుద్ధి, మానవ మలం, మల వ్యర్థాల నిర్వహణ భాగంగా ఉంటాయి. (బి) తాగునీటి సరఫరా, వర్షపు నీటి సంరక్షణ, నీటి పునర్వినియోగం.
***
(రిలీజ్ ఐడి: 2247169)
సందర్శకుల సూచీ సంఖ్య : : 49