బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గడువు కంటే ముందే 140 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించిన ఎన్‌సీఎల్

प्रविष्टि तिथि: 30 MAR 2026 5:31PM by PIB Hyderabad

సింగ్రాలి కేంద్రంగా పనిచేస్తున్న కోల్ ఇండియా ప్రధాన అనుబంధ సంస్థ నార్తర్న్ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎన్సీఎల్)  140 మిలియన్ టన్నుల వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన గడువు కంటే ముందే 2026 మార్చి 30 (మొదటి షిఫ్ట్ తర్వాత)  ఈ ఘనతను సొంతం చేసుకుందిఅత్యాధునిక యంత్రాలతో కూడిన  10 ఓపెన్కాస్ట్ గనుల ద్వారా దశాబ్ద కాలంగా వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను ఎన్సీఎల్‌ విజయవంతంగా చేరుకుంటోందిఅద్భుతమైన పనితీరును కనబరుస్తూతన వారసత్వాన్ని నిలకడగా కొనసాగిస్తోంది.

కోల్ ఇండియా లిమిటెడ్ ప్రధాన అనుబంధ సంస్థగా ఉన్న నార్తర్న్ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్.. దేశ ఇంధన భద్రతను కాపాడటంలో కీలకంగా వ్యవహరిస్తుందిప్రస్తుత ఇంధన పరిస్థితుల్లో దేశీయంగా ఉత్పత్తి అయ్యే బొగ్గు భారత విద్యుత్ రంగానికి మరోసారి నమ్మదగిన వెన్నెముకగా నిరూపితమైందిఈ నేపథ్యంలో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు నిరంతరాయంగా బొగ్గు సరఫరాను అందించడంలో ఎన్సీఎల్ స్థిరమైనమెరుగైన ఉత్పత్తి కీలక పాత్ర పోషించింది.

ఈ ఘనత పట్ల ఎన్సీఎల్ యాజమాన్యం హర్షం వ్యక్తం చేసిందిఎన్సీఎల్ బృందం కనబరిచిన అచంచలమైన నిబద్ధతపట్టుదలఅవిశ్రాంత కృషిని ప్రశంసించడంతో పాటు.. సహకరించిన భాగస్వాములందరికీ అభినందనలు తెలిపింది.

 

***


(रिलीज़ आईडी: 2247063) आगंतुक पटल : 63
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी