ఎరువుల విభాగం
azadi ka amrit mahotsav

భౌగోళిక రాజకీయ ముప్పు తొలగింపు:


ఎరువుల ముడి పదార్థాల సరఫరా కోసం దీర్ఘకాలిక ఒప్పందాలు చేసుకున్న భారత్

యూరియాపై ఆధారపడటాన్ని తగ్గించడం:

సమతుల్య ఎరువుల వినియోగం, అధునాతన పోషక పద్ధతులను ప్రోత్సహిస్తోన్న ఐకార్

నాడు పోస్టు చేయడమైనది: 27 MAR 2026 2:38PM by PIB Hyderabad

ఎరువుల లభ్యతను నిర్ధారించడంతో పాటు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం, నేలలోని పోషకాల అసమతుల్యత వంటి సవాళ్లను పరిష్కరించడానికి నిబద్ధతతో ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం పునరుద్ఘాటించింది. ఈ రోజు లోక్‌సభలో అడిగిన ఒక నక్షత్ర గుర్తు గల ప్రశ్నకు సమాధానంగా రసాయనాలు- ఎరువులు, ఆరోగ్య- కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ జగత్ ప్రకాష్ నడ్డా.. ప్రస్తుతం కొనసాగుతున్న చర్యల వివరాలను వెల్లడించారు.

దేశీయంగా నిల్వలు పరిమితంగా ఉన్న కారణంగా కీలకమైన ఎరువుల ముడి పదార్థాలు, మధ్యంతర పదార్థాల కోసం భారత్ ఇప్పటికీ గణనీయంగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. భౌగోళిక రాజకీయ అంతరాయాల నుంచి రక్షణ పొందేందుకు, దేశీయ ఉత్పత్తికి నిరంతర సరఫరాను నిర్ధారించడానికి వనరులు పుష్కలంగా ఉన్న దేశాలతో పలు దీర్ఘకాలిక ఒప్పందాలు (ఎల్‌టీఏ), అవగాహన ఒప్పందాలను (ఎంఓయూ) ఎరువుల విభాగం కుదుర్చుకుంది. ఈ దీర్ఘకాలిక ఒప్పందాల వివరాలు అనుబంధం-Iలో ఉన్నాయి. 

ఎరువుల ముడి పదార్థాల దిగుమతి (అంచనా) (2024-25):

క్ర. సం.

ముడి పదార్థం/ మధ్యంతర పదార్థాలు

దిగుమతి వాటా అంచనా(శాతం)

1

రాక్ ఫాస్ఫేట్

86

2

సల్ఫర్

52

3

యూరియా రంగానికి సహజ వాయువు

78

4

కాంప్లెక్స్ ఎరువుల కోసం అమ్మోనియా

75

5

ఫాస్ఫారిక్ ఆమ్లం

52

6

మురియేట్ ఆఫ్ పొటాష్

100

(మూలం: భారత రసాయన ఎరువుల అసోసియేషన్)

దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి స్వదేశీ ప్రత్యామ్నాయాన్ని సాధించడానికి 'పోషక ఆధారిత రాయితీ' (ఎన్‌బీఎస్) పథకం కింద ఉత్పత్తి సామర్థ్య విస్తరణను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఎరువుల కంపెనీలు ప్రస్తుతం వార్షికంగా 59.65 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) మొత్తం సామర్థ్యంతో కొత్త డీఏపీ లేదా ఎన్‌పీకే ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాయి. వీటితో పాటు 44.21 ఎల్ఎంటీ సామర్థ్యంతో ఫాస్ఫారిక్, సల్ఫ్యూరిక్ ఆమ్ల ఉత్పత్తి కేంద్రాలను కూడా నిర్మిస్తున్నాయి. అంతేకాకుండా 'జాతీయ హరిత హైడ్రోజన్ మిషన్' కింద ఎరువుల రంగం కోసం 7.24 ఎల్ఎంటీ హరిత అమ్మోనియాను సేకరించడానికి ప్రత్యేక ఏర్పాట్లు జరిగాయి. 

భూసార పరీక్షల ఆధారంగా సమతుల్య ఎరువుల వినియోగాన్ని భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్) సిఫార్సు చేస్తోంది. దీనివల్ల నేలలో ఉన్న పోషకాలకు అదనంగా పంటల వాస్తవ అవసరాలకు అనుగుణంగా పోషకాలను అందించడం సాధ్యమవుతుంది. కేవలం నైట్రోజన్‌పైనే అతిగా ఆధారపడకుండా ఎన్‌పీకే ఎరువులను సమతుల్యంగా వాడేందుకు కూడా ఇది వీలు కల్పిస్తుంది. రసాయన ఎరువులతో పాటు పశువుల ఎరువు, కంపోస్ట్, పచ్చిరొట్ట ఎరువు, జీవ ఎరువులు, పంట వ్యర్థాల రీసైక్లింగ్ వంటి సేంద్రియ వనరులను కలిపి వాడే 'సమగ్ర పోషక నిర్వహణ' (ఐఎన్ఎం) పద్ధతిని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఇది నేల ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు రసాయన ఎరువులపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది.

పోషక నష్టాలను తగ్గించడానికి నత్రజనిని దఫాలవారీగా అందించడం, ఎరువులను సరైన పద్ధతిలో వేయడం,, నెమ్మదిగా విడుదలయ్యే ఎరువులు, వేపపూత పూసిన యూరియా, నైట్రిఫికేషన్ ఇన్హిబిటర్ల (నేలలోని నత్రజని వృథా కాకుండా మొక్కలకు దీర్ఘకాలం పాటు అందేలా చేసే రసాయన లేదా సహజ పదార్థాలు) వంటి పద్ధతులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. జీవ ఎరువుల వినియోగం, సేంద్రియ వ్యవసాయ పద్ధతులను అవలంబించడం ద్వారా యూరియా వినియోగాన్ని తగ్గించి సుస్థిరమైన పోషక సరఫరాకు దోహదపడుతుంది. సరైన నేల, నీటి యాజమాన్య పద్ధతులు పోషక వినియోగ సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా లీచింగ్ (నేల అడుగుపొరల్లోకి పోషకాలు ఇంకిపోవటం), రన్-ఆఫ్ (పోషకాలు కొట్టుకుపోవటం) ద్వారా జరిగే పోషక నష్టాలను నివారిస్తాయి.

రైతుల శిక్షణ, క్షేత్ర ప్రదర్శనలు, అవగాహన కార్యక్రమాల ద్వారా సామర్థ్య పెంపులో ఐకార్ చురుగ్గా నిమగ్నమై ఉంది. ఇది ఈ పద్ధతులను ప్రాచుర్యంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ చర్యలన్నీ కలిసి యూరియా అధిక వినియోగాన్ని తగ్గించడానికి, సమతుల్య పోషకాల వినియోగాన్ని నిర్ధారించడానికి, పర్యావరణాన్ని రక్షిస్తూ నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయి.

అనుబంధం- I

రాక్ ఫాస్ఫేట్

జోర్డాన్

భారతీయ కంపెనీ

సంబంధిత విదేశీ కంపెనీ

ఉత్పత్తి

వార్షిక పరిమాణం (ఎంటీ)

వ్యవధి (సంవత్సరాలు)

ఓస్త్వాల్

జేపీఎంసీ

రాక్ ఫాస్ఫేట్

5,00,000

10 సంవత్సరాలు

2022 మే నుంచి 2032 ఏప్రిల్ వరకు


 

మొరాకో

భారతీయ కంపెనీ

సంబంధిత విదేశీ కంపెనీ

ఉత్పత్తి

వార్షిక పరిమాణం (ఎంటీ)

వ్యవధి (సంవత్సరాలు)

పీపీఎల్

ఓసీపీ

రాక్ ఫాస్ఫేట్

16,00,000 నుంచి 18,00,000

10 సంవత్సరాలు


 

(31-డిసెంబర్-2023 నుంచి 30-నవంబర్-2033 వరకు)


 

టోగో

భారతీయ కంపెనీ

సంబంధిత విదేశీ కంపెనీ

ఉత్పత్తి

వార్షిక పరిమాణం (ఎంటీ)

వ్యవధి (సంవత్సరాలు)

ఎఫ్ఏసీటీ

ఎస్ఎన్‌పీటీ

రాక్ ఫాస్ఫేట్

2,40,000 (కట్టుబడి ఉండనిది- నాన్ బైన్డింగ్)

3 సంవత్సరాలు

10.02.2025 నుంచి 09.01.2028 వరకు


 

మారిటానియా

భారతీయ కంపెనీ

సంబంధిత విదేశీ కంపెనీ

ఉత్పత్తి

వార్షిక పరిమాణం (ఎంటీ)

వ్యవధి (సంవత్సరాలు)

ఆర్‌సీఎఫ్

ఎం/ఎస్. అట్లాంటిక్ మినరల్స్ ఎస్ఏఆర్ఎల్

రాక్ ఫాస్ఫేట్

1,50,000 (కట్టుబడి ఉండనిది)

3 సంవత్సరాలు

2025 నుంచి 2028


 

2. ఫాస్ఫారిక్ ఆమ్లం

మొరాకో

భారతీయ కంపెనీ

సంబంధిత విదేశీ కంపెనీ

ఉత్పత్తి

వార్షిక పరిమాణం (ఎంటీ)

వ్యవధి (సంవత్సరాలు)

పీపీఎల్

ఓసిపి

ఫాస్ఫారిక్ ఆమ్లం

3,00,000 నుంచి 3,50,000

వార్షిక


 

(త్రైమాసిక పునరుద్ధరణ ఒప్పందం)

ఇండోరామా

ఓసిపి

ఫాస్ఫారిక్ ఆమ్లం

1,20,000 మెట్రిక్ టన్నుల పీ2ఓ5

ప్రస్తుతం కొనసాగుతోంది. 01.06.2021న సంతకాలు అయ్యాయి.

 

 

మొత్తం:

4,20,000 నుంచి 4,70,000

 


 

ట్యునీషియా

భారతీయ కంపెనీ

సంబంధిత విదేశీ కంపెనీ

ఉత్పత్తి

వార్షిక పరిమాణం (ఎంటీ)

వ్యవధి (సంవత్సరాలు)

జీ‌ఎస్‌ఎఫ్‌సీ

టిఫెర్ట్

ఫాస్ఫారిక్ ఆమ్లం

1,80,000

30 సంవత్సరాలు


 

(21/08/2006 నుంచి 21/08/2036 వరకు)


 

సెనెగల్

భారతీయ కంపెనీ

సంబంధిత విదేశీ కంపెనీ

ఉత్పత్తి

వార్షిక పరిమాణం (ఎంటీ)

వ్యవధి (సంవత్సరాలు)

ఐఎఫ్‌ఎఫ్‌సీఓ

ఐసీఎస్

ఫాస్ఫారిక్ ఆమ్లం

5,50,000

34 సంవత్సరాలు

ప్రారంభం: 17-మే-99

3. అమ్మోనియా

సౌదీ అరేబియా

భారతీయ కంపెనీ

సంబంధిత విదేశీ కంపెనీ

ఉత్పత్తి

వార్షిక పరిమాణం (ఎంటీ)

వ్యవధి (సంవత్సరాలు)

సీఐఎల్

మాడెన్ 

అమ్మోనియా

6,00,000 (+/-10%)

3 సంవత్సరాలు


 

(01/01/2024 నుంచి 31/12/2026 వరకు)


 

ఒమన్

భారతీయ కంపెనీ

సంబంధిత విదేశీ కంపెనీ

ఉత్పత్తి

వార్షిక పరిమాణం (ఎంటీ)

వ్యవధి (సంవత్సరాలు)

పీ పీ ఎల్

ఈస్ట్ వెస్ట్ జనరల్ ట్రేడింగ్, దుబాయ్

అమ్మోనియా

3,50,000

3 సంవత్సరాలు

01-ఆగస్టు-24 నుంచి 31-జూలై-27 వరకు


 

జపాన్

భారతీయ కంపెనీ

సంబంధిత విదేశీ కంపెనీ

ఉత్పత్తి

వార్షిక పరిమాణం (ఎంటీ)

వ్యవధి (సంవత్సరాలు)

ఇండోరామా

ఇటొచ్చు

అమ్మోనియా

15,000 - 60,000 మెట్రిక్ టన్నులు

1 సంవత్సరం


 

(01.01.25 నుంచి 31.12.25 వరకు)


 

మలేషియా

భారతీయ కంపెనీ

సంబంధిత విదేశీ కంపెనీ

ఉత్పత్తి

వార్షిక పరిమాణం (ఎంటీ)

వ్యవధి (సంవత్సరాలు)

పీపీఎల్

ఇటొచ్చు 

కార్పొరేషన్

అమ్మోనియా

50,000 నుంచి 90,000

1 సంవత్సరం


 

(01-01-25 నుంచి 31-12-25 వరకు)

 


(రిలీజ్ ఐడి: 2246496) సందర్శకుల సూచీ సంఖ్య : : 70
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Gujarati