మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మానవ అక్రమ రవాణా, వ్యాపారపరమైన లైంగిక దోపిడీ సంబంధిత నేరాలను ఎదుర్కోవడానికి


అక్రమ రవాణా (నివారణ) చట్టం - 1956ను రూపొందించిన భారత ప్రభుత్వం

మహిళల రక్షణ, భద్రతను బలోపేతం చేయడమే లక్ష్యంగా కార్యక్రమాలను

అమలు చేయడానికి నిర్భయ నిధిని ఏర్పాటు చేసిన ప్రభుత్వం

నాడు పోస్టు చేయడమైనది: 27 MAR 2026 12:09PM by PIB Hyderabad

దేశ రాజధానితో సహా ఇతర మెట్రోపాలిటన్ నగరాల్లో వ్యభిచారంలోకి మళ్లుతున్నభిక్షాటన చేస్తున్న మహిళల సంఖ్యపై మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఎలాంటి కేంద్రీకృత సమాచారాన్ని నిర్వహించడం లేదు.

భారత రాజ్యాంగంలోని ఏడో షెడ్యూల్ ప్రకారం ‘పోలీసు’, ‘శాంతి భద్రతలు’ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశాలుశాంతి భద్రతల నిర్వహణపౌరుల ప్రాణాలకుఆస్తులకు రక్షణ కల్పించడంమహిళలపై జరిగే నేరాలను దర్యాప్తు చేయడంవిచారించడం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలుకేంద్ర పాలిత ప్రాంత పరిపాలనా వ్యవస్థల పరిధిలో ఉంటాయిఅమలవుతున్న చట్టాల పరిధిలోని నిబంధనల ప్రకారం ఇలాంటి నేరాలను అదుపు చేయడానికి వాటికి అధికారం ఉందిఅక్రమ రవాణావ్యాపారపరమైన లైంగిక దోపిడీసంబంధిత నేరాలను అరికట్టడానికి అక్రమ రవాణా (నివారణచట్టం - 1956 (ఐటీపీఏ)ను భారత ప్రభుత్వం రూపొందించిందిఈ చట్టం వ్యభిచారాన్ని వ్యాపారపరమైన లైంగిక దోపిడీగా నిర్వచిస్తుందిఇలాంటి దోపిడీకి సహకరించేప్రోత్సహించే లేదా లాభం పొందే వారికి విధించే శిక్షలను సూచిస్తుందిఈ చట్టాన్ని ప్రాథమికంగా అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలుకేంద్ర పాలిత ప్రాంతాల పరిపాలనా వ్యవస్థలపై ఉంది.

దేశవ్యాప్తంగా మహిళల రక్షణ, భద్రతసాధికారత కోసం చేసే ప్రయత్నాలను బలోపేతం చేసే లక్ష్యంతో ‘మిషన్ శక్తి’ పథకాన్ని మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ (ఎండబ్ల్యూసీడీఅమలు చేస్తోందిమిషన్ శక్తిలో రెండు భాగాలు ఉన్నాయిమహిళల భద్రతరక్షణ కోసం ‘సంబల్’మహిళా సాధికారత కోసం ‘సామర్థ్య’ఇంటా బయటా హింసకు గురై ఒత్తిడిలో ఉన్న మహిళలకు అవసరమైన మద్దతునుసాయాన్ని సంబల్ పరిధిలో ఉండే వన్ స్టాప్ సెంటర్లు (ఓఎస్‌సీఅందిస్తాయివైద్యపరమైననాయ్యపరమైన సహాయాన్నిసలహాలనుతాత్కాలిక ఆశ్రయాన్నిపోలీసు సాయాన్నిమానసిక-సామాజిక కౌన్సెలింగ్‌తో సహా అనేక సేవలను అందిస్తాయిఅదేవిధంగాసంబల్ పరిధిలో ఏర్పాటు చేసిన మహిళా హెల్ప్ లైన్ (డబ్ల్యూహెచ్‌ఎల్).. 181 నెంబరు ద్వారా మహిళలకు ఏడాది పొడవునా రోజుకి 24 గంటలూ అత్యవసరఅత్యవసరం కాని సేవలను అందిస్తుందిఇది మహిళలను పోలీస్వన్ స్టాప్ సెంటర్లుఆసుపత్రులున్యాయ సేవా అధికార సంస్థలు లాంటి తగిన విభాగాలతో అనుసంధానిస్తుందిఅదనంగామహిళా సంక్షేమ పథకాలుకార్యక్రమాల గురించి సమాచారాన్ని కూడా అందిస్తుంది. 35 రాష్ట్రాలుకేంద్ర పాలిత ప్రాంతాల్లో మహిళా హెల్ప్ లైన్ పనిచేస్తోందిదీనిని ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ (ఈఆర్ఎస్ఎస్-112)తో కూడా ఏకీకృతం చేశారుఅక్రమ రవాణాకు గురయిన వారితో సహా దుర్భర పరిస్థితుల్లో చిక్కుకున్న మహిళలకు ఉపశమనంపునరావాస సేవలను సామర్థ్య పరిధిలో నిర్వహించే శక్తి సదన్ అందిస్తుందిక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్న మహిళలకు సురక్షితమైనఅనుకూలమైన వాతావరణాన్ని అందించితమకెదురైన ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేలా చేయడమే దీని లక్ష్యంసేవా పంపిణీలో పారదర్శకతనుసౌలభ్యాన్ని బలోపేతం చేసేందుకు ఎండబ్ల్యూసీడీ 22.01.2025న మిషన్ శక్తి డ్యాష్ బోర్డును (https://missionshakti.wcd.gov.in/ప్రారంభించిందిఈ డ్యాష్ బోర్డులో మానవ అక్రమ రవాణా నిరోధక విభాగాలు (ఏహెచ్‌టీయూలు), ఓఎస్సీలుడబ్ల్యూహెచ్ఎల్శక్తి సదన్ తదితర పథకాల నోడల్ అధికారులు తాజా జాబితాలు అందుబాటులో ఉంటాయిప్రజల సౌలభ్యం కోసం అన్ని ప్రధాన హెల్ప్‌లైన్లను ఈ పోర్టల్ ఒకే చోట అందిస్తుందిమిషన్ శక్తి డాష్‌బోర్డ్ సమాచారాన్ని మిషన్ శక్తి మొబైల్ అప్లికేషన్ ద్వారా కూడా పొందవచ్చుఇప్పుడు పోర్టల్మొబైల్ అప్లికేషన్ ద్వారా ఇబ్బందుల్లో ఉన్న మహిళ తనకు దగ్గరలో ఉన్న ఓఎస్సీలో అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు.

మహిళల భద్రతరక్షణను బలోపేతం చేయడమే లక్ష్యంగా అమలు చేస్తున్న కార్యక్రమాల అమలు కోసం ‘నిర్భయ నిధి’ పేరుతో ప్రత్యేక నిధిని భారత ప్రభతు్వం ఏర్పాటు చేసిందిఅవసరానికి అనుగుణంగా నిర్భయ నిధి పరిధిలో అన్ని ప్రాజెక్టులు/పథకాలు అమలవుతాయిఈ నిధి వివిధ పథకాల అమలుకు మంత్రిత్వ శాఖలువిభాగాలురాష్ట్రాలుకేంద్ర పాలిత ప్రాంతాలకు ఆర్థిక సాయం అందిస్తుందివాటిలో ఈఆర్ఎస్ఎస్-112, మహిళలుచిన్నారులపై సైబర్ నేరాల నివారణ (సీసీపీడబ్ల్యూసీఉన్నాయివీటితో పాటు ఎనిమిది నగరాలు అహ్మదాబాద్బెంగళూరుచెన్నైఢిల్లీహైదరాబాద్కోల్‌కతాలక్నోముంబయిలో చేపడుతున్న సేఫ్ సిటీ ప్రాజెక్టుపోలీసు స్టేషన్లలో మహిళా హెల్ప్ డెస్కులు (డబ్ల్యూహెచ్‌డీలు), యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (ఏహెచ్‌టీయూ)లకు కూడా నిధులు అందిస్తుందిఅలాగే రాష్ట్రాల ఫోరెన్సిక్ ల్యాబరేటరీ (ఎస్ఎఫ్ఎస్ఎల్)ల్లో డీఎన్ఏ విశ్లేషణసైబర్ ఫోరెన్సిక్తదితర వసతులను బలోపేతం చేయడానికిఅత్యాచారపోక్సో సహా ఇతర చట్టాల పరిధిలో విచారణలో ఉన్న కేసులను పరిష్కరించడానికి ప్రత్యేక పోక్సో కోర్టులతో పాటుగా ప్రత్యేక ఫాస్ట్ ట్రాకు కోర్టు (ఎఫ్‌టీఎస్‌సీ)లను ఏర్పాటు చేయడానికి కూడా ఆర్థిక సహకారం అందిస్తుంది.

కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీమతి సావిత్రీ ఠాకూర్ ఈ సమాచారాన్ని లోక్‌సభలో అడిగిన ఓ ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా అందించారు.

 

***


(రిలీజ్ ఐడి: 2246107) సందర్శకుల సూచీ సంఖ్య : : 13
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Bengali