గణాంకాలు- కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పైమానా పోర్టల్, భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల నిర్వహణ

నాడు పోస్టు చేయడమైనది: 25 MAR 2026 1:11PM by PIB Hyderabad

కేంద్ర రంగ మౌలిక సదుపాయాలకు సంబంధించి రూ.150 కోట్లకు పైగా వ్యయం గల ప్రాజెక్టుల పురోగతిని కేంద్ర గణాంకకార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ (ఎంఓఎస్‌పీఐపర్యవేక్షిస్తోందిఈ ప్రక్రియ కోసం పైమానా (దేశ నిర్మాణానికి ప్రాజెక్టు అంచనా మౌలిక సదుపాయాల పర్యవేక్షణవిశ్లేషణనూతన వెబ్ మానిటరింగ్ వ్యవస్థను రూపొందించింది.

జనవరి 2026 గణాంకాల ప్రకారం.. దేశవ్యాప్తంగా 17 కేంద్ర మంత్రిత్వ శాఖలువిభాగాలు చేపట్టిన 1,702 ప్రాజెక్టుల పురోగతిని పైమానా నమోదు చేసిందిఈ ప్రాజెక్టుల అంచనా వ్యయం రూ.33.71 లక్షల కోట్లు కాగాఇప్పటివరకు రూ.20.01 లక్షల కోట్ల మేర ఖర్చు అయిందిఈ ప్రాజెక్టులకు సంబంధించిన పూర్తి వివరాలను https://ipm.mospi.gov.in/ లో అందుబాటులో ఉన్న ఫ్లాష్ రిపోర్టు ద్వారా చూడవచ్చు.

ప్రస్తుతం కొనసాగుతున్న మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు.. రాజస్థాన్జార్ఖండ్జమ్మూకాశ్మీర్కర్ణాటక రాష్ట్రాలకు సంబంధించి ప్రాజెక్టుల వివరాలు మంత్రిత్వ శాఖ ప్రచురించిన ఫ్లాష్ రిపోర్ట్‌లో అందుబాటులో ఉన్నాయిఆ వివరాలను https://ipm.mospi.gov.in/ReportPage. వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

"ఒకే డేటా ఒక నమోదుసూత్రానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలువిభాగాలుప్రాజెక్టు అమలు చేసే సంస్థలు నివేదించే డేటాను ఆటోమేటిక్‌గా పొందేందుకు పైనామా పోర్టల్‌ను పారిశ్రామిక ప్రోత్సాహకఅంతర్గత వాణిజ్య విభాగం (డీపీఐఐటీ), ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్ మానిటరింగ్ పోర్టల్ (ఐపీఎంపీ)తో అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్‌ఫేస్ (ఏపీఐ)ల ద్వారా అనుసంధానించారుసమగ్ర వేదిక పైమానా వల్ల మాన్యువల్ డేటా నమోదు గణనీయంగా తగ్గిందిరోడ్డు రవాణారహదారుల మంత్రిత్వ శాఖపెట్రోలియంసహజ వాయువుబొగ్గు శాఖలకు సంబంధించిన దాదాపు 64 శాతం ప్రాజెక్టుల వివరాలు ఆటోమేటిక్‌గా అప్‌డేట్‌ అవుతున్నాయి.

భాగస్వాములందరికీ (మౌలిక సదుపాయాల సంబంధిత మంత్రిత్వ శాఖలువిభాగాలుప్రాజెక్టు అమలు తీరుజాప్యాల గురించి పైమానా పోర్టల్‌లోని డేటా అనలిటిక్స్ ఆధారంగా ఎప్పటికప్పుడు సమాచారం అందుతోందితద్వారా వారి ప్రాజెక్ట్ నిర్వహణలో అవసరమైన జోక్యం చేసుకోగలుగుతారుప్రతి నెలా నిర్వహించే సమీక్షా సమావేశాలుఇతర కమ్యూనికేషన్ల ద్వారా వాటాదారులతో సమన్వయం చేసుకుంటూఆధారాలతో కూడిన పర్యవేక్షణ జరుగుతోందిఅదనంగాఅన్ని శాఖలకు ప్రత్యేక డాష్‌బోర్డుల లాగిన్ వివరాలు ఇప్పటికే అందిచటం ద్వారా నేరుగా పోర్టల్‌లోకి వెళ్లిప్రాజెక్ట్ పురోగతిని స్వయంగా సమీక్షించుకునే అవకాశముంది.

గౌరవ ప్రధానమంత్రి ప్రగతి సమావేశాల ద్వారా వీడియో కాన్ఫరెన్స్ సహాయంతో ప్రాజెక్టులను సమీక్షించటంపనితీరును క్షుణ్ణంగా అంచనా వేయటం వంటివి.. మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో జాప్యాన్ని తగ్గించివేగవంతం చేసేందుకు భారత ప్రభుత్వం చేపట్టిన ప్రధాన చర్యల్లో భాగంగా ఉన్నాయి.

పరిశ్రమలుఅంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీపరిధిలోని ప్రాజెక్టు పర్యవేక్షణా బృందం (పీఎంజీఒక సంస్థాగత యంత్రాంగంరూ.500 కోట్లుఅంతకు మించి అంచనా వ్యయం గల ప్రాజెక్టులను లక్ష్యాల వారీగా పర్యవేక్షించటం దీని ప్రధాన ఉద్దేశంకేంద్రరాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం ద్వారా ప్రాజెక్టుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించటానికిఅవసరమైన అనుమతులను వేగవంతం చేయటానికి ఇది కృషి చేస్తుందిగౌరవ ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగే ప్రగతి సమావేశాలతో పాటు జాప్యంసమస్యలను ఎదుర్కొంటున్న ప్రాజెక్టులపై డీపీఐఐటీకేబినెట్ సెక్రటేరియట్ స్థాయిలో క్రమం తప్పకుండా పీఎంజీ సమీక్షా సమావేశాలను నిర్వహిస్తుందిఈ సమీక్షలు సమర్థవంతంగా జరగటానికి పీఎంజీ ఒక ప్రత్యేకమైన 5-అంచెల పరిష్కార వ్యవస్థను అమలు చేస్తోందిఇది సాధారణ సమస్యలను సంబంధిత మంత్రిత్వ శాఖతో ప్రారంభించిసంక్లిష్ట సమస్యలను ప్రగతి వరకు వెళ్లేలాసమస్యలు సరైన స్థాయిలో పరిష్కారమయ్యేలా చేస్తుందిఈ విధానం సమీక్షా యంత్రాంగాన్ని క్రమబద్దీకరించిపునరావృతం కావటాన్ని నివారిస్తుందిజోక్యం అవసరమైన కీలక సమస్యలపై ఉన్నతాధికారులు దృష్టి సారించేందుకు ఈ విధానం వీలు కల్పిస్తుంది.

గణాంకాలుకార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ సహాయమంత్రి (స్వతంత్ర బాధ్యత), ప్రణాళికా మంత్రిత్వ శాఖ సహాయమంత్రి (స్వతంత్ర బాధ్యత), సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సహాయమంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ ఇవాళ లోక్‌సభలో ఈ వివరాలను వెల్లడించారు.

 

***


(రిలీజ్ ఐడి: 2245457) సందర్శకుల సూచీ సంఖ్య : : 10
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी