గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గిరిజన మహిళల ఆస్తి హక్కులు

నాడు పోస్టు చేయడమైనది: 25 MAR 2026 2:21PM by PIB Hyderabad

కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ దుర్గాదాస్ ఉయికే నేడు రాజ్యసభలో మాట్లాడుతూ.. ఈ ప్రశ్నకు సంబంధించిన అంశం కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుందని తెలిపారుఈ విషయంపై కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ అందించిన సమాచారం ప్రకారం..

‘‘సివిల్ అప్పీల్ సంఖ్య 6901/2022 (కమలా నేతి (మరణించినతరపున ఆమె చట్టపరమైన వారసుల ద్వారా వర్సెస్ ప్రత్యేక భూసేకరణ అధికారిఇతరులు), (2023) 3 ఎస్ సీసీ 528లో నివేదించిన కేసును కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఈ కింది విధంగా పేర్కొంది.

‘‘18. ప్రస్తుతం దాఖలైన ఈ అప్పీల్‌ను మేం కొట్టివేస్తున్నప్పటికీషెడ్యూల్డ్ తెగలకు సంబంధించి హిందూ వారసత్వ చట్టం నిబంధనల వర్తింపు విషయంలో ఉన్న మినహాయింపులను ఉపసంహరించుకోవడం సరైనదేనాఅవసరమాఅనే అంశాన్నిఅలాగే తగిన సవరణను తీసుకురావాలా వద్దా అనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలించాల్సిందిగా ఆదేశిస్తున్నాంభారత రాజ్యాంగంలోని 14, 21వ అధికరణల ప్రకారం సమానత్వ హక్కును పరిగణనలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని క్షుణ్ణంగా పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటుందని మేం ఆశిస్తున్నాం...’.

సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ఈ ఆదేశాల నేపథ్యంలో ఈ తీర్పును ఉమ్మడి పౌర స్మృతికి సంబంధించిన ప్రతిపాదనతో పాటు సమగ్రంగా అధ్యయనం చేయవలసిందిగా కోరుతూ భారత లా కమిషన్ పరిశీలనకు పంపించాం’’.

 

***


(రిలీజ్ ఐడి: 2245085) సందర్శకుల సూచీ సంఖ్య : : 26
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी