భూ శా స్త్ర మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పార్లమెంటు ప్రశ్న: భూకంప తీవ్రత, ముప్పును తగ్గించేందుకు తీసుకున్న చర్యలు

నాడు పోస్టు చేయడమైనది: 25 MAR 2026 12:52PM by PIB Hyderabad

దేశంలో సంభవించే భూకంపాలపై భారత ప్రభుత్వం పలు శాస్త్రీయ అధ్యయనాలను చేపట్టింది. భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ (ఎంఏఈఎస్) అనుబంధ కార్యాలయమైన జాతీయ భూకంప కేంద్రం (ఎన్‌సీఎస్‌) ద్వారా ఈ అధ్యయనాలను నిర్వహిస్తోంది. వీటితో పాటు ఇతర శాస్త్రీయ సంస్థలు, విద్యాసంస్థలు కూడా ఈ పరిశోధనల్లో పాల్గొంటున్నాయి.

అధ్యయన వివరాల్లో.. 169 భూకంప పరిశీలన కేంద్రాలతో ఉన్న జాతీయ భూకంప వ్యవస్థ (ఎన్‌ఎస్‌ఎన్‌) ద్వారా భూకంప కార్యకలాపాలను నిరంతరం పర్యవేక్షించటం, భూకంప మూల పారామితుల విశ్లేషణ, భూకంప ముప్పు అంచనా, ప్రధాన నగరాల్లో భూకంపాలు రావడానికి అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించడం వంటి అంశాలున్నాయి. భూమి పైపొరల్లో వచ్చే మార్పులు, ఫాల్ట్‌ మ్యాపింగ్, పాలియోసిస్మాలజీ, భూకంప సూచనల అధ్యయనాలకు సంబంధించిన పరిశోధన ప్రాజెక్టులకు కూడా ప్రభుత్వం మద్దతును అందిస్తోంది.

భూకంప సంబంధిత అధ్యయానాలకు బడ్జెట్‌లో ప్రభుత్వం నిధులను కేటాయించింది. భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ (ఎంఓఈఎస్) పరిధిలోని పలు కేంద్ర పథకాల ద్వారా ముఖ్యంగా పృథ్వీ పథకంలో భాగమైన సిస్మోలజీ, జియోసైన్సెస్‌ విభాగాల ద్వారా ఈ అధ్యయనాలకు మద్దతు లభిస్తోంది. భూకంప పరిశీలన వ్యవస్థలను బలోపేతం చేయటం, పరిశోధనా ప్రాజెక్టులు, మైక్రోజోనేషన్ అధ్యయనాలు, సామర్థ్య పెంపుదల వంటి కార్యక్రమాలకు ఈ నిధులను కేటాయించారు.

భూకంప ముప్పు, తీవ్రతను తగ్గించేందుకు ప్రభుత్వం తీసుకునే చర్యల్లో భాగంగా.. భూకంపాలకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత వర్గాలు, ప్రజలకు వేగంగా చేరవేయటం ద్వారా విపత్తు సమయాల్లో సత్వరమే స్పందించేలా చేయటం, ముప్పు తీవ్రతను అంచనా వేయటమే లక్ష్యంగా ఎన్‌ఎస్‌ఎన్‌ విస్తరణ, ఆధునికీకరణ పనులను ఎన్‌సీఎస్‌ చేపట్టింది.

భూకంప ముప్పు అంచనా, ముందస్తు ప్రణాళికల కోసం భూకంప ముప్పు ఎక్కువగా ఉన్న నగరాలను గుర్తించి వాటిలో సీసమిక్ హజార్డ్‌ మైక్రోజోనేషన్ ప్రక్రియను ఎన్‌సీఎస్‌ చేపట్టింది. సామర్థ్య పెంచటం, ప్రజల్లో అవగాహన కల్పించటం, శిక్షణ కార్యక్రమాలను జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ (ఎన్‌డీఎంఏ), జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్‌ఐడీఎం), రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయి.

 

***


(రిలీజ్ ఐడి: 2245041) సందర్శకుల సూచీ సంఖ్య : : 76
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी