గనుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జాతీయ డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ (డీఎంఎఫ్) రెండు రోజుల సదస్సు ప్రారంభం డీఎంఎఫ్ సదస్సును ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి

నాడు పోస్టు చేయడమైనది: 23 MAR 2026 9:15PM by PIB Hyderabad

న్యూఢిల్లీలోని స్కోప్ కన్వెన్షన్ సెంటర్‌లో రెండు రోజుల పాటు జరిగే జాతీయ జిల్లా ఖనిజ ఫౌండేషన్ (డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్-డీఎంఎఫ్) సదస్సు 2026ను కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి ఈరోజు ప్రారంభించారు. ఈ సదస్సులో భాగంగా మైనింగ్ ప్రభావిత ప్రాంతాల్లో డీఎంఎఫ్ పాత్రను వివరిస్తూ  వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రభావవంతమైన కార్యక్రమాలు,  విజయగాథలను ప్రదర్శించే ఎగ్జిబిషన్ను కూడా  శ్రీ  కిషన్ రెడ్డి ప్రారంభించారు.

గనుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ పీయూష్ గోయల్ సమక్షంలో ప్రారంభమైన ఈ రెండు రోజుల జాతీయ సదస్సులో సుస్థిర, సమ్మిళిత అభివృద్ధి కోసం డీఎంఎఫ్ నిధుల సమర్థవంతమైన వినియోగంపై చర్చించడానికి కీలక వాటాదారులందరూ పాల్గొంటున్నారు. 

 

కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి మాట్లాడుతూ, దేశంలోని సహజ వనరుల విషయంలో స్థానిక సమాజాల సహకారం ఎంతో ఉందని, వారికి తగిన ప్రయోజనాలు అందాలని స్పష్టం చేశారు. మైనింగ్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణ, జీవనోపాధి పునరుద్ధరణ, సమగ్ర అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన ఉద్ఘాటించారు.

గనుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ పీయూష్ గోయల్ మాట్లాడుతూ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సుమారు 200 మైనింగ్ బ్లాకులను వేలం వేసినట్లు తెలిపారు. ఈ రంగంలో కొనసాగుతున్న సంస్కరణల లక్ష్యం అభివృద్ధి ఫలాలు చివరి లబ్ధిదారుడి వరకు చేరేలా చూడటమేనని ఆయన పేర్కొన్నారు.

"ఆకాంక్షాత్మక జిల్లాల కార్యక్రమం (ఏడీపీ), ఆకాంక్షాత్మక బ్లాకుల కార్యక్రమం (ఏబీపీ) అమలు జరిగే ప్రాంతాల కోసం జిల్లా ఖనిజ ఫౌండేషన్ నిధుల సమర్థవంతమైన వినియోగం" అనే ఇతివృత్తంతో జరుగుతున్న ఈ సదస్సు, వివిధ పథకాల అనుసంధానం, పారదర్శకత,  పర్యవేక్షణ ద్వారా ఫలితాల ఆధారిత వినియోగంపై దృష్టి సారించింది.

పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీ సుశీల్ కుమార్ లోహాని 'పంచాయతీ అడ్వాన్స్‌మెంట్ ఇండెక్స్' పోర్టల్‌ను గురించి ప్రముఖంగా ప్రస్తావించారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా తొమ్మిది ఇతివృత్తాల ఆధారంగా ఉన్న 435 సూచికల ద్వారా ఈ పోర్టల్ డేటా ఆధారిత పాలనను (సాధ్యం చేస్తుందని ఆయన వివరించారు.

నీతిఆయోగ్ అదనపు కార్యదర్శి శ్రీ రోహిత్ కుమార్ మాట్లాడుతూ, మూడు ‘సీ‘ లు — సమన్వయం (కన్వర్జెన్స్), భాగస్వామ్యం ( కొలాబరేషన్), పోటీ (కాంపిటీషన్) -  మూడు ‘ఎఫ్‘ లు — నిధులు (ఫండ్స్), విధులు (ఫంక్షన్స్), నిర్వాహకులు (ఫంక్షనరీస్) — ఆకాంక్షిత ప్రాంతాలను ప్రేరణాత్మక ప్రాంతాలుగా మార్చడానికి కీలక దోహదకారులని అన్నారు.  

 

మొదటి రోజున, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాలు తమ ఉత్తమ విధానాలను పంచుకున్నాయి. వివిధ పథకాల అనుసంధానం, సంతృప్త స్థాయి అమలు, అభివృద్ధి ప్రభావాన్ని గరిష్టంగా పెంచడం వంటి అంశాలపై ఈ రాష్ట్రాలు ప్రధానంగా దృష్టి సారించాయి.

సమ్మిళిత, సుస్థిర అభివృద్ధి కోసం, వాటాదారుల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడం, డీఎంఎఫ్ నిధుల సమర్థవంతమైన వినియోగాన్ని మెరుగుపరచడం ఈ సదస్సు ద్వారా సాధ్యమవుతుందని భావిస్తున్నారు.

సదస్సు సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనలో ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మేఘాలయ, రాజస్థాన్, కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల  డీఎంఎఫ్ లబ్ధిదారులు తమ ఉత్పత్తులను ప్రదర్శించారు. ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ కిషన్ రెడ్డి వారితో ముచ్చటించారు.  

 

***


(రిలీజ్ ఐడి: 2244270) సందర్శకుల సూచీ సంఖ్య : : 13
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , हिन्दी