రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
ఈ నెల 24న ‘బీఎస్‌ఈ’ జాబితాలో చేరనున్న ‘ఎన్‌హెచ్‌ఏఐ’ ప్రాయోజిత పబ్లిక్ ఇన్విట్ ‘రాజ్‌మార్గ్ ఇన్ఫ్రా ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్’
నాడు పోస్టు చేయడమైనది:
23 MAR 2026 4:56PM by PIB Hyderabad
జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) ప్రాయోజిత ‘రాజ్‌మార్గ్ ఇన్ఫ్రా ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్’ (ఆర్‌ఐఐటీ) తొలి పబ్లిక్ ఇష్యూ ఈ నెల 24న బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్‌ఈ) జాబితాలో చేరనుంది. కేంద్ర రోడ్డు రవాణా-రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీతోపాటు ఆ శాఖలోని సీనియర్ అధికారులు, ‘ఎన్‌హెచ్‌ఏఐ’ అధికారుల సమక్షంలో ఈ కార్యక్రమం పూర్తికానుంది.
ఈ తొలి ‘ఐపీఓ’పై పెట్టుబడిదారుల నుంచి అద్భుత స్పందన లభించడంతో వివిధ వర్గాల పెట్టుబడిదారులు దాదాపు 14 రెట్లు అదనంగా సబ్స్క్రైబ్ చేశారు. వృద్ధి ప్రస్థానం, దాని ఆర్థిక మార్కెట్ల సామర్థ్యం, ప్రభావశీల మూలధన పునరుపయోగం, వేగవంతమైన మౌలిక సదుపాయాల కల్పనకు భారత్ లక్ష్యనిర్దేశం చేసుకుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ పారదర్శక-సంస్కరణాధారిత ఆస్తుల నగదీకరణ కార్యక్రమంపై పెట్టుబడిదారులకుగల దృఢ విశ్వాసాన్ని ఈ పరిణామం స్పష్టం చేసింది.
దేశీయ, రిటైల్ పెట్టుబడిదారులకు అధిక నాణ్యతగల, దీర్ఘకాలిక పెట్టుబడి మార్గం చూపుతూ ప్రస్తుత జాతీయ రహదారి ఆస్తుల విలువను రాబట్టడంలో భాగంగా ‘ఎన్‌హెచ్‌ఏఐ’ ప్రాయోజిత ‘రాజ్‌మార్గ్ ఇన్ఫ్రా ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్’ రూపొందింది. జాతీయ రహదారుల రంగంలో ప్రజా భాగస్వామ్యం విస్తృతితోపాటు దేశంలో మౌలిక సదుపాయాల ఫైనాన్సింగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో కీలక మలుపును ఈ కార్యక్రమం సూచిస్తుంది.
***
(రిలీజ్ ఐడి: 2244206)
సందర్శకుల సూచీ సంఖ్య : : 6