సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అంతర్జాతీయ సాంస్కృతిక మార్పిడి కార్యక్రమాల్లో జానపద కళల ప్రదర్శన

నాడు పోస్టు చేయడమైనది: 23 MAR 2026 1:28PM by PIB Hyderabad

భారతదేశ గొప్ప సాంస్కృతిక వారసత్వానికి ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం కల్పించేందుకు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ గ్లోబల్ ఎంగేజ్‌మెంట్ స్కీమ్‌ (జీఈఎస్)ను అమలు చేస్తుందిఈ పథకం ద్వారా విదేశాల్లో జరిగే భారతీయ ఉత్సవాల్లో (ఎఫ్ఓఐలుప్రదర్శన ఇచ్చేందుకు వివిధ కళలకు సంబంధించిన కళాకారులుబృందాలను మంత్రిత్వ శాఖ ఎంపిక చేసిందిమంత్రిత్వ శాఖ వద్ద ప్రస్తుతం 627 కళాకారులుబృందాలు నమోదవగా.. 31 మంది కళాకారులుబృందాలు ఉత్తరప్రదేశ్‌కి చెందినవి.

విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఐసీసీఆర్.. విదేశాల్లో సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చేందుకు అయిదేళ్లలో 52 జానపద కళా బృందాలను పంపింది.

భారతీయ కళలుసంస్కృతులకు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం కల్పించేందుకు 2025-26 ఆర్థిక సంవత్సరంలో విదేశాల్లోని ఇండో-ఫారిన్ ఫ్రెండ్‌షిఫ్ సొసైటీలకు భారత రాయబార కార్యాలయాల ద్వారా రూ.2.58 కోట్లను విడుదల చేశారు.

విదేశాల్లో నిర్వహించే భారతీయ ఉత్సవాల్లో ప్రదర్శనల కోసం కళాకారుల ఎంపికకు అనుసరించే ప్రమాణాలు ఇలా ఉన్నాయి:

I. దరఖాస్తు చేసుకోవాలనుకునే కళాకారులుబృందాలు కచ్చితంగా రాష్ట్రజాతీయఅంతర్జాతీయ స్థాయి ప్రదర్శనలు ఇచ్చి ఉండాలిప్రదర్శనల సంఖ్య రాష్ట్రజాతీయఅంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి.

ii. కళా రూపంప్రదర్శన గురించి ప్రేక్షకులకు వివరించే సామర్థ్యం కళాకారులుబృందాలకు ఉండాలి.

iii. కేటగిరి VII ప్రకారం.. సందర్భోచిత ప్రదర్శనలకు సంబంధించిన దరఖాస్తులను మాత్రమే పరిశీలిస్తారు.

iv. ఎంప్యానెల్‌మెంటుకు దరఖాస్తు చేసుకునే విదేశీయులకు తప్పనిసరిగా ఓవర్‌సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (ఓసీఐకార్డు ఉండాలి.

విదేశాల్లోని భారత రాయబార కార్యాలయాలుపోస్టులుభారత సాంస్కృతిక కేంద్రాల నుంచి వచ్చే సిఫార్సుల మేరకు ప్యానెల్ బృందాల్లోని కళాకారులకు ఐసీసీఆర్ ఆర్థిక సహాయం అందిస్తుందివివిధ దేశాల్లోని స్థానికులకు ప్రాధాన్యతనిస్తూ పలు కళారూపాలకున్న డిమాండ్‌ను బట్టి ఎంపిక జరుగుతుంది.

విదేశాల్లోని భారత రాయబార కార్యాలయాలుపోస్టులుభారత సాంస్కృతిక కేంద్రాల నుంచి వచ్చే ప్రతిపాదనల ఆధారంగా ఐసీసీఆర్ ఏటా వార్షిక కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తుందిఇందులో గుర్తింపునకు నోచుకోని కళలకుభారతదేశంలోని గ్రామీణమారుమూల ప్రాంతాలకు చెందిన కళాకారులకు ప్రాధాన్యతనిస్తారువిదేశాల్లో భారత సంస్కృతిని చాటిచెప్పేందుకు ఐసీసీఆర్ ఈ ఏడాది.. "గిరిజనజానపదఅరుదైన స్వదేశీ కళల ద్వారా ప్రపంచంతో అనుసంధానంఇతివృత్తాన్ని ఎంచుకుంది.

విదేశాలకు వెళ్లే సాంస్కృతిక బృందాల ద్వారా ఆశించిన ఫలితాలను పొందేందుకు పనితీరుని పర్యవేక్షించేఅభిప్రాయ సేకరణ తీసుకునే వ్యవస్థను ఐసీసీఆర్ ఏర్పాటు చేసిందిదేశ సుసంపన్నవైవిధ్యభరిత జానపద కళారూపాలను నిరంతరాయంగా ప్రోత్సహించటంలో సహకారం కోరుతూ ఎంఓయూలు కుదుర్చుకున్న రాష్ట్ర ప్రభుత్వాలను ఐసీసీఆర్ సంప్రదించింది.

ఇవాళ లోక్‌సభలో కేంద్ర సాంస్కృతికపర్యాటక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర షెకావత్ లిఖితపూర్వక సమాధానంగా ఈ సమాచారాన్ని అందించారు.

 

***


(రిలీజ్ ఐడి: 2244036) సందర్శకుల సూచీ సంఖ్య : : 33
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी