భూ శా స్త్ర మంత్రిత్వ శాఖ
పార్లమెంటు ప్రశ్న: సముద్ర అంతర్భాగంలో మైనింగ్
నాడు పోస్టు చేయడమైనది:
19 MAR 2026 12:55PM by PIB Hyderabad
మత్స్య-6000 రూపకల్పన విజయవంతంగా పూర్తయింది. అదే విధంగా 2025 జనవరి, ఫిబ్రవరి నెలల్లో వెట్/హార్బర్ ప్రయోగాత్మక పరీక్షలు ముగిశాయి. వీటిలో కార్యకలాపాలను (తేలడం, వాహన స్థిరత్వం, సామర్థ్యం, శక్తి, సమాచార, నియంత్రణ పరికరాలతో సహా), మానవ తోడ్పాటు, భద్రతా వ్యవస్థల పనితీరును పరీక్షించారు. 500 మీటర్ల షాలో-వాటర్ డైవ్ చేయడానికి అనేక విడి భాగాలను రూపొందించి, వాటిని కలపాల్సిన అవసరం ఉంది. వీటిలో ప్రత్యేకంగా రూపొందించిన సింటాక్టిక్ ఫోమ్ అత్యంత కీలకమైనది. భారత్‌లో రూపొందించిన ఈ ఫోమ్‌ను ఐరోపాలోని ఓ సంస్థ అభివృద్ధి చేస్తోంది. అయితే దురదృష్టవశాత్తూ, తయారీలో లోపం కారణంగా ఇది ఇంకా సిద్ధం కాలేదు. ఇది మే చివరి నాటికి భారతదేశానికి చేరుకుంటుందని అంచనా. ఈ వస్తువులన్నింటినీ ఏకీకరించి, పరీక్షించిన అనంతరం, చివరి త్రైమాసికంలో షాలో వాటర్ డైవ్ చేయడానికి షెడ్యూల్ సిద్ధమైంది.
పాలీమెటాలిక్ నాడ్యూళ్లను సేకరించి, చూర్ణంగా మార్చడానికి ఒక సముద్ర గర్భ మైనింగ్ వ్యవస్థను చెన్నైలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ సాయంతో భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసింది. ఈ వ్యవస్థకు సంబంధించిన రవాణా సదుపాయాలు, వ్యవస్థలకు విద్యుత్ సరఫరా పరీక్షలను 2021లో మధ్య హిందూ మహాసముద్రంలో 5,270 మీటర్ల లోతులో నిర్వహించారు. కాబట్టి 2025లో 5,270 మీటర్ల లోతులో ఎలాంటి లోతైన సముద్ర మైనింగ్ వ్యవస్థ పరీక్షలను నిర్వహించలేదు. అలాగే, వనరుల వినియోగ నియమావళి ద్వారా వాణిజ్య మైనింగ్ కార్యక్రమాలను నిర్వహిస్తారు. అయితే ఈ కోడ్‌ను తయారు చేయడానికి బాధ్యత తీసుకున్న ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ ఇంకా వాటిని రూపొందించలేదు.
‘‘సముద్ర ఆర్థిక వ్యవస్థ’’ వనరుల సుస్థిరాభివృద్ధిలో ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడంలో మంత్రిత్వ శాఖ నిమగ్నమై ఉంది. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు, టెండర్ల ప్రక్రియతో సహా వివిధ రకాల పద్ధతులను అవలంబిస్తోంది.
రాజ్యసభలో 2026 మార్చి 19 న రాజ్యసభలో అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా భూ విజ్ఞానం, శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ సమాచారాన్ని అందించారు.
***
(రిలీజ్ ఐడి: 2242658)
సందర్శకుల సూచీ సంఖ్య : : 9