ఔషధాల విభాగం
అందుబాటు ధరల్లో ఔషధాలు, ప్రైవేటు ఆస్సత్రుల నియంత్రణ
నాడు పోస్టు చేయడమైనది:
17 MAR 2026 3:25PM by PIB Hyderabad
ఔషధాల (ధరల నియంత్రణ) ఉత్తర్వులు – 2013 (డీపీసీవో–2013) నిబంధనల ప్రకారం దేశవ్యాప్తంగా ఔషధాల ధరలను నియంత్రిస్తారు. డీపీసీవో–2013లోని ప్రస్తుత నిబంధనల ప్రకారం, షెడ్యూల్-Iలో పేర్కొన్న మందుల గరిష్ట ధరలనూ, అలాగే డీపీసీవో–2013 పేరా 2(1)(యూ)లో నిర్దేశించిన విధంగా కొత్త ఔషధాల రిటైల్ ధరలనూ.. జాతీయ ఔషధ ధరల ప్రాధికార సంస్థ (ఎన్‌పీపీఏ) నిర్ణయిస్తుంది. అలాగే షెడ్యూల్-Iలో లేని మందుల విషయంలో.. తయారీదారులు వాటి గరిష్ఠ రిటైల్ ధరను గత 12 నెలల కాలంలోని ధరకు పది శాతం కన్నా ఎక్కువగా పెంచడానికి వీలు లేదు. దానితోపాటు అసాధారణ పరిస్థితుల్లోనూ, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కూడా.. డీపీసీవో – 2013లోని పేరా 19 ప్రకారం ఏ ఔషధానికైనా గరిష్ట లేదా రిటైల్ ధరను ఎన్‌పీపీఏ నిర్ణయిస్తుంది. డీపీసీవో–2013 కింది నిబంధనలు.. ఔషధాలు/సూత్రీకరణలను విక్రయించే ప్రైవేటు ఆసుపత్రులకు కూడా సమానంగా వర్తిస్తాయి. ఔషధాల ధరలను ఎన్‌పీపీఏ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. నిర్ణీత ధర కంటే ఎక్కువ వసూలు చేసే ఘటనలపై డీపీసీవో–2013లోని సంబంధిత నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటుంది.
రాజ్యసభలో ఇచ్చిన ఓ లిఖితపూర్వక సమాధానంలో రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి శ్రీమతి అనుప్రియా పటేల్ ఈ సమాచారాన్ని అందించారు.
***
(రిలీజ్ ఐడి: 2241540)
సందర్శకుల సూచీ సంఖ్య : : 9