సహకార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారత్ టాక్సీ విస్తరణ

నాడు పోస్టు చేయడమైనది: 17 MAR 2026 4:45PM by PIB Hyderabad

సహకారం ద్వారా సమృద్ధి’ అన్న భారత ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా.. సహకార రంగాన్ని బలోపేతం చేయడంఅందరికీ అందుబాటులో ఉండేలాప్రజలే కేంద్రంగా రవాణా మార్గాలను ప్రోత్సహించడం లక్ష్యంగా సహకార మంత్రిత్వ శాఖ కృషి చేస్తోందిబహురాష్ట్ర సహకార సంఘాల చట్టం-2002 కింద నమోదైన భారత్ టాక్సీని.. 2025 జూన్ 6న సహకార రంగంలో పనిచేస్తున్న జాతీయ స్థాయి సంస్థలు నెలకొల్పాయిభారత్ టాక్సీ ముఖ్య లక్షణాలిలా ఉన్నాయి:

  1. సహకార యాజమాన్య నమూనాఒక బహు రాష్ట్ర సహకార సంస్థగా ఈ వేదికను రూపొందించారుఇందులో డ్రైవర్లువాహన యజమానులు సభ్యులుగాభాగస్వాములుగా ఉంటారుదీనివల్ల వారికి ఉమ్మడి యాజమాన్య హక్కులు లభించడమే కాకుండానిర్వహణలోనూ భాగస్వామ్యం లభిస్తుంది.

  2. ప్రజాస్వామిక పాలన: సభ్యులు ఎన్నుకున్న సంచాలక మండలి (బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ఈ సహకార సంస్థను నిర్వహిస్తుందిదాంతో నిర్ణయాధికారంలో అందరి భాగస్వామ్యానికీకార్యకలాపాలను ప్రజాస్వామ్యబద్ధంగా పర్యవేక్షించడానికీ అవకాశం లభిస్తుందిడ్రైవర్ల ప్రయోజనాలకు సమర్థమైన ప్రాతినిధ్యం కల్పించడం కోసం.. డ్రైవర్ల తరఫున ఇద్దరు ఎన్నుకున్న ప్రతినిధులు (సారథులుబోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో సభ్యులుగా ఉంటారు.

  3. డ్రైవర్లు కేంద్రంగా భారత్ టాక్సీ వేదికకమిషన్ ఆధారిత సమీకరణ నమూనాలకు ప్రత్యామ్నాయంగా.. సభ్యుల యాజమాన్యంలో నడిచే డిజిటల్ రవాణా వేదికను రూపొందించాలన్నది ఈ కార్యక్రమ ఉద్దేశండ్రైవర్లు తమ ఆదాయాన్ని పూర్తిగా తమ వద్దే ఉంచుకుంటూఅదే సమయంలో ఆ వేదిక యాజమాన్యంలో భాగస్వాములుగా ఉండేలా చేయడం దీని ముఖ్య లక్ష్యం.

  4. అందుబాటు వ్యయంలో పారదర్శకంగా సేవలుప్రజలకు పారదర్శకమైన ధరల విధానాన్నిఅందుబాటులో ఉండే రవాణా సేవలను అందించడం భారత్ టాక్సీ వేదిక లక్ష్యంముఖ్యంగా అల్పాదాయ వర్గాలుఅణగారిన వర్గాల వారికి ఈ సేవలు సులభంగా అందుబాటులో ఉండేలా చేయడంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తుంది.

  5. డిజిటల్ రవాణా మౌలిక సదుపాయాలురైడ్ బుకింగ్వాహనాల ట్రాకింగ్డిజిటల్ చెల్లింపులువినియోగదారు సేవల కోసం అత్యాధునిక సాంకేతిక వ్యవస్థలను భారత్ టాక్సీ వినియోగిస్తుందిదీని ద్వారా వినియోగదారులకు సమర్థమైనపారదర్శకమైనసులభతరమైన సేవలను అందిస్తుంది.

  6. డ్రైవర్ సంక్షేమంఉపాధి భద్రతడ్రైవర్లకు న్యాయబద్ధమైన ఆదాయ అవకాశాలను అందించడంసామాజిక భద్రతా చర్యలను పెంపొందించడంగౌరవప్రదమైన పని పరిస్థితులను కల్పించడంసహకార యాజమాన్యాన్ని అందించడం ఈ కార్యక్రమ ఉద్దేశంతద్వారా డ్రైవర్ల జీవనోపాధి భద్రతను బలోపేతం చేయడం దీని లక్ష్యం.

డ్రైవర్ కేంద్రంగా ఉన్న ఆదాయ నమూనాతో కూడిన సహకార సూత్రాల ప్రాతిపదికన భారత్ టాక్సీ వేదిక ఆర్థికకార్యాచరణ వ్యవస్థ పనిచేస్తాయినిర్వహణ వ్యయాలుప్రయాణించిన దూరంఅప్పటి మార్కెట్ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని.. డ్రైవర్లు ప్రయాణికుల మధ్య ఉత్తమమైన సమన్వయాన్ని కుదిర్చేలా.. ధరల నిర్ధారణ విధానాన్ని ఈ సహకార సంఘం నిర్ణయిస్తుందిపారదర్శకమైననియంత్రిత ప్రయాణ రుసుములను నిర్ధారించేలా ఈ ధరల విధానాన్ని రూపొందించారువీటిని క్రమబద్ధంగా సమీక్షిస్తూఆ ధరల వివరాలను భాగస్వాములందరికీ ఎప్పటికప్పుడు తెలియజేస్తారుడ్రైవర్ల నుంచి భారత్ టాక్సీ ఎలాంటి కమిషన్‌నూ వసూలు చేయదుఈ సహకార నిర్మాణం వల్ల.. వర్తించే చట్టబద్ధమైన చార్జీలు పోను.. మొత్తం ప్రయాణ రుసుము నేరుగా సభ్యులకే అంటే డ్రైవర్లకు చేరుతుందిదీనివల్ల వారి ఆదాయం గరిష్ఠంగా పెరుగుతుందిన్యాయబద్ధమైనసమానత్వంతో కూడిన రవాణా వ్యవస్థ పెంపొందుతుందివాటా మూలధన కంట్రిబ్యూషన్లుసభ్యత్వ రుసుములుసహకార నిబంధనల మేరకు అనుమతించదగిన ఇతర వనరుల ద్వారా సహకార సంఘం వనరులను సమీకరించుకుంటుంది. భారత్ టాక్సీలో భారత ప్రభుత్వం ఎలాంటి పెట్టుబడీ పెట్టలేదుఈ రంగంలోని ఇతర సంస్థలతో సమాన స్థాయిలో ఇది పోటీ పడగలదని భావిస్తోంది.

ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతం – ఢిల్లీగురుగ్రామ్నోయిడాఫరీదాబాద్ఘజియాబాద్‌తోపాటు.. గుజరాత్‌లోని అహ్మదాబాద్రాజ్‌కోట్సోమనాథ్ద్వారకల్లో ప్రస్తుతం భారత్ టాక్సీ కార్యకలాపాలు నిర్వహిస్తోందిఅలాగే వచ్చే మూడేళ్లలో దశలవారీగా ద్వితీయతృతీయ శ్రేణి నగరాలకూఅలాగే దేశవ్యాప్తంగా మండల స్థాయి వరకూ సేవలను విస్తరించాలని భారత్ టాక్సీ లక్ష్యంగా పెట్టుకుందిదీనిద్వారా మరిన్ని ప్రాంతాల్లో అందుబాటు ధరల్లోసహకార ఆధారిత రవాణా సేవలను అందరికీ చేరవేయాలని భావిస్తోంది.

డిజిటల్ లావాదేవీలుసమీకృత సేవలకు అనువైన సాంకేతిక రవాణా వ్యవస్థగా భారత్ టాక్సీ వేదికను రూపొందించారుభవిష్యత్తులో ఇతర విస్తృత రవాణా వ్యవస్థలుసాధ్యమయ్యే చోట డిజిటల్ వాణిజ్య వ్యవస్థలతో కలిసి పనిచేసేలా దీని నిర్మాణం ఉందిభారత్ టాక్సీ ప్రస్తుతం ఓఎన్డీసీ నెట్‌వర్కుతో అనుసంధానమై ఉందిదీంతో ఓఎన్డీసీ నెట్‌వర్కులోని రవాణా సేవల బ్రాండ్లయిన డిజీహాత్బాబ్ రైడ్స్వన్ టికెట్ వంటి వేదికల్లోనూ దీంతో భారత్ టాక్సీ సేవలు కనిపిస్తాయిసాంకేతికంగా ఓఎన్డీసీ నెట్వర్కులోని ఏ రవాణా సేవల వేదిక అయినా.. తగిన అనుమతి ద్వారా భారత్ టాక్సీ సేవలను తమ వేదికలో పొందుపరచవచ్చు.

ఆర్థిక సాంకేతిక సంస్థల భాగస్వామ్యంతో డిజిటల్ చెల్లింపు సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయిఅంతేకాకుండా కార్యకలాపాల్లో పారదర్శకతను మెరుగుపరచడండ్రైవర్ల సంక్షేమాన్ని పెంపొందించడం లక్ష్యంగా.. డిజిటల్ చెల్లింపుల అనుసంధానంబ్యాంకింగ్ఆర్థిక సేవలుడ్రైవర్లకు బీమా సేవల కోసం వివిధ సంస్థలతో ఈ వేదిక అవగాహన ఒప్పందాలను కుదుర్చుకుంది.

లోకసభలో ఇచ్చిన ఒక లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర హోంసహకార శాఖా మంత్రి శ్రీ అమిత్ షా ఈ సమాచారాన్ని అందించారు.

 

***


(రిలీజ్ ఐడి: 2241495) సందర్శకుల సూచీ సంఖ్య : : 11
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी