పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ
15వ ఆర్థిక సంఘం సిఫార్సులు
నాడు పోస్టు చేయడమైనది:
17 MAR 2026 3:05PM by PIB Hyderabad
2020-21 ఆర్థిక సంవత్సరానికి (మధ్యంతర కాలం) గ్రామీణ స్థానిక సంస్థల (ఆర్ఎల్ బీ) కోసం రూ. 60,750 కోట్లు.. 2021-2026 ఆర్థిక సంవత్సరాలకు రూ. 2,36,805 కోట్లు కేటాయించాలని 15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది.
15వ కేంద్ర ఆర్థిక సంఘం నిర్ణయించిన నిధుల కేటాయింపు నిబంధనల ప్రకారం.. రాష్ట్రాల మధ్య జరిగే అంతర్గత నిధుల పంపిణీలో జనాభాకు 90 శాతం ప్రాధాన్యతకు, రాష్ట్రాల విస్తీర్ణానికి 10 శాతం ప్రాధాన్యతకు కేటాయించారు. అన్ని స్థాయిల మధ్య ఈ అంతర్గత పంపిణీని తాజా రాష్ట్ర ఆర్థిక సంఘం (ఎస్ఎఫ్ సీ) ఆమోదించిన సిఫార్సుల ఆధారంగా ఈ కింది నిబంధనలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు చేపడతాయి.
|
Range for Distribution
|
Gram Panchayats
|
Block Panchayats
|
District Panchayats
|
|
Minimum
|
70%
|
10%
|
5%
|
|
Maximum
|
85%
|
25%
|
15%
|
గ్రామ, జిల్లా పంచాయతీలు మాత్రమే ఉన్న రెండంచెల వ్యవస్థ కలిగి ఉన్న రాష్ట్రాల్లో కేటాయింపు ఈ కింది విధంగా ఉంది.
|
Range for Distribution
|
Gram Panchayats
|
District Panchayats
|
|
Minimum
|
70%
|
15%
|
|
Maximum
|
85%
|
30%
|
ఒకవేళ రాష్ట్ర ఆర్థిక సంఘం సిఫార్సులు అందుబాటులో లేని సమయంలో పైన పేర్కొన్న నిబంధనలకు లోబడి వివిధ స్థాయిల మధ్య నిధుల పంపిణీని రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయించాలి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సంబంధిత సంస్థల మధ్య అంతర్గత స్థాయి పంపిణీని జనాభా విస్తీర్ణం ఆధారంగా 90:10 నిష్పత్తిలో లేదా తాజా రాష్ట్ర ఆర్థిక సంఘం ఆమోదించిన సిఫార్సుల ప్రకారం ఉండాలి.
15వ ఆర్థిక సంఘం కింద నిధుల విడుదల కోసం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం తప్పనిసరిగా ఉండాల్సిన అర్హత నిబంధనలు ఈ కింది విధంగా వివరించారు.
1. రాజ్యాంగంలోని 9వ భాగం వర్తించని రాష్ట్రాలు/ప్రాంతాలు మినహాయించి.. సక్రమంగా ఎన్నికైన గ్రామీణ స్థానిక సంస్థలు మాత్రమే నిధులు పొందేందుకు అర్హత కలిగి ఉంటాయి. ఒకవేళ అన్ని సంస్థలు సక్రమంగా ఏర్పడకపోతే.. సక్రమంగా ఏర్పాటైన వాటికి మాత్రమే వాస్తవ కేటాయింపు లేదా దామాషా ప్రాతిపదికన రాష్ట్రానికి నిధులు విడుదలవుతాయి.
2. సంబంధిత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్రణాళికలను ఆర్ఎల్ బీలు ఈ-గ్రామస్వరాజ్ వేదికలో తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాలి. అలా చేయలేకపోతే అప్‌లోడ్ చేసిన ఆర్ఎల్ బీలకు మాత్రమే నిధులు దామాషా ప్రాతిపదికన విడుదలవుతాయి.
3. 15వ ఆర్థిక సంఘం నిధుల లావాదేవీల కోసం అన్ని గ్రామీణ స్థానిక సంస్థలు తప్పనిసరిగా ఈ గ్రామస్వరాజ్ పీఎఫ్ఎంఎస్ వేదికతో అనుసంధానం కావాలి.
4. గత సంవత్సరం కంటే ముందు ఏడాది (రెండేళ్ల కిందటి నాటి) వార్షిక ఖాతాల ఆడిట్‌ను ఆడిట్ ఆన్‌లైన్ వేదికలో పూర్తి చేయాలి. అలా చేయకపోతే ఆడిట్ పూర్తి చేసిన సంస్థలకు మాత్రమే దామాషా ప్రాతిపదికన నిధులు అందుతాయి.
5. గత సంవత్సరానికి సంబంధించిన తాత్కాలిక ఖాతాలు ఈ గ్రామ్ స్వరాజ్ వేదికలో అందుబాటులో ఉండాలి. లేకపోతే ఈ గ్రామ్ స్వరాజ్ వేదికలో అందుబాటులో ఉన్న ఆర్ఎల్ బీలకు మాత్రమే దామాషా ప్రాతిపదికన నిధులు విడుదలవుతాయి.
6. ఇప్పటి వరకు రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయని రాష్ట్రాలు దానిని ఏర్పాటు చేసి, ఆ సంఘం సిఫార్సుల మేరకు చర్యలు తీసుకోవాలి. ఆ చర్యలకు సంబంధించిన వివరణాత్మక పత్రాన్ని మార్చి 2024 లోపు రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టాలి. మార్చి 2024 తర్వాత రాజ్యాంగ నిబంధనలను, షరతులను పాటించని ఏ రాష్ట్రానికి కూడా నిధులు విడుదల అవ్వవు.
7. సకాలంలో నిధుల పంపిణీ: కేంద్ర ప్రభుత్వం ద్వారా 15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసిన నిధులు అందిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వాలు ఆ నిధులను సంబంధిత పంచాయతీలకు, స్థానిక సంస్థలకు 10 పని దినాల లోపు బదిలీ చేయాలి. 10 రోజులకు మించి ఆలస్యమైతే.. గత సంవత్సరం మార్కెట్ రుణాలు లేదా రాష్ట్ర అభివృద్ధి రుణాల సగటు వడ్డీ రేటు ప్రకారం ఆలస్యమైన కాలానికి వడ్డీతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులను విడుదల చేయాల్సి ఉంటుంది.
15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు నిర్దేశించిన అర్హత నిబంధనలను పూర్తి చేసిన గ్రామీణ స్థానిక సంస్థలకు 2020-21 ఆర్థిక సంవత్సరం నుంచి 2025-26 వరకు సిఫార్సు చేసిన, విడుదలైన నిధుల వివరాలు రాష్ట్రాల వారీగా అనుబంధంలో ఉన్నాయి.
15వ ఆర్థిక సంఘం నిధుల పంపిణీ, వినియోగాన్ని రాష్ట్రాల వారీగా పర్యవేక్షించడానికి పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ పలు చర్యలు చేపట్టింది. పంచాయతీల పనితీరు, ప్రణాళికలు, బడ్జెట్ రూపకల్పన, ఖాతాల నిర్వహణ, ఆడిటింగ్ వంటి వివిధ అంశాలను పర్యవేక్షించడానికి ఏప్రిల్ 2020లో ఈ గ్రామ్ స్వరాజ్ అప్లికేషన్‌ను ప్రారంభించింది. దీనితో పాటు పంచాయతీ ఖాతాల ఆన్‌లైన్ ఆడిటింగ్, వాటి ఆర్థిక నిర్వహణ కోసం ఆడిట్ ఆన్‌లైన్ అనే మరో అప్లికేషన్‌ను కూడా ఏప్రిల్ 2020లోనే అభివృద్ధి చేసింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025–26లో దేశవ్యాప్తంగా మొత్తం 2,64,211 గ్రామ పంచాయతీలు, తత్సమాన సంస్థల్లో 2,54,604 (96.36%) గ్రామ పంచాయతీలు, తత్సమాన సంస్థలు తమ గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలను ఈ గ్రామ్ స్వరాజ్ వేదికలో అప్‌లోడ్ చేశాయి. 2,42,871 (91.92%) గ్రామ పంచాయతీలు, తత్సమాన సంస్థలు ఈ గ్రామ్ స్వరాజ్-పీఎఫ్ఎంఎస్ అనుసంధానం ద్వారా విక్రేతలకు రూ. 38,491 కోట్లను బదిలీ చేశాయి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను 2.58 లక్షలకు పైగా పంచాయతీ రాజ్ సంస్థలు తమ వార్షిక ఖాతాలను ముగించగా.. 1.63 లక్షల సంస్థలు ఆడిట్ నివేదికలను రూపొందించాయి.
15వ ఆర్థిక సంఘం కింద గ్రామీణ స్థానిక సంస్థలకు అన్‌టైడ్ (సాధారణ) నిధులు, టైడ్ నిధుల విడుదలను సిఫార్సు చేయడానికి పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ, తాగునీరు, పారిశుధ్య విభాగం నోడల్ మంత్రిత్వ శాఖలుగా వ్యవహరిస్తాయి.
15వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం గ్రామీణ స్థానిక సంస్థలకు ఇచ్చే ఈ నిధులు ప్రతి సంవత్సరం రెండు విడుతల్లో రాష్ట్రాలకు విడుదల చేస్తారు. చివరిగా విడుదల చేసిన విడతకు సంబంధించి ఒక రాష్ట్రం నుంచి నిధుల బదిలీ ధ్రువీకరణ పత్రం (జీటీసీ) అందిన తర్వాత మార్గదర్శకాల్లో పేర్కొన్న అర్హత నిబంధనలను పూర్తి చేసిన అనంతరం తదుపరి విడత సంబంధించిన అన్‌టైడ్ నిధులను విడుదల చేయమని ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ సిఫార్సు చేస్తుంది. వీటితోపాటు తాగునీరు, పారిశుద్ధ్య విభాగం టైడ్ నిధులను విడుదల చేయమని కూడా సిఫార్సు చేస్తుంది.
దీని ప్రకారం చివరగా విడుదల చేసిన విడతకు సంబంధించిన జీటీడీ అందడం, సంబంధిత రాష్ట్రం సూచించిన అర్హత నిబంధనలను నెరవేర్చడంపై ఆధారపడి నిధుల విడుదల సమయం మారుతూ ఉంటుంది. ఈ షరతులను పూర్తి చేసిన వెంటనే పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ సకాలంలో అన్‌టైడ్ నిధులను విడుదల చేస్తుంది.
అనుబంధం
15వ ఆర్థిక సంఘం కింద 2020-21 ఆర్థిక సంవత్సరం నుంచి 2025-26 వరకు గ్రామీణ స్థానిక సంస్థలకు సిఫార్సు చేసిన, విడుదలైన నిధుల వివరాలు రాష్ట్రాల వారీగా కింద ఉన్నాయి.
(రూ. కోట్లలో)
|
Sl. No.
|
States
|
2020-21
|
2021-22
|
2022-23
|
2023-24
|
2024-25
|
2025-26
|
Total
|
|
Allocation
|
Release
|
Allocation
|
Release
|
Allocation
|
Release
|
Allocation
|
Release
|
Allocation
|
Release
|
Allocation
|
Release
|
Allocation
|
Release
|
|
1
|
Andhra Pradesh
|
2625.00
|
2625.00
|
1939.00
|
1917.85
|
2010.00
|
1976.75
|
2031.00
|
1997.45
|
2152.00
|
2109.97
|
2099.00
|
2053.81
|
12856.00
|
12680.82
|
|
2
|
Arunachal Pradesh
|
231.00
|
231.00
|
170.00
|
170.00
|
177.00
|
35.40
|
179.00
|
0.00
|
189.00
|
0.00
|
185.00
|
0.00
|
1131.00
|
436.40
|
|
3
|
Assam
|
1604.00
|
1604.00
|
1186.00
|
1186.00
|
1228.00
|
1228.00
|
1241.00
|
1241.00
|
1315.00
|
1315.00
|
1283.00
|
1283.00
|
7857.00
|
7857.00
|
|
4
|
Bihar
|
5018.00
|
5018.00
|
3709.00
|
3709.00
|
3842.00
|
3842.00
|
3884.00
|
3855.33
|
4114.00
|
4109.01
|
4012.00
|
2806.31
|
24579.00
|
23339.65
|
|
5
|
Chhattisgarh
|
1454.00
|
1454.00
|
1075.00
|
1075.00
|
1114.00
|
1114.00
|
1125.00
|
1125.00
|
1192.00
|
1185.25
|
1163.00
|
802.06
|
7123.00
|
6755.32
|
|
6
|
Goa
|
75.00
|
75.00
|
55.00
|
55.00
|
57.00
|
48.46
|
58.00
|
36.13
|
62.00
|
0.00
|
61.00
|
0.00
|
368.00
|
214.59
|
|
7
|
Gujarat
|
3195.00
|
3195.00
|
2362.00
|
2362.00
|
2446.00
|
2446.00
|
2473.00
|
2473.00
|
2619.00
|
2619.00
|
2555.00
|
1782.04
|
15650.00
|
14877.04
|
|
8
|
Haryana
|
1264.00
|
1264.00
|
935.00
|
935.00
|
968.00
|
967.30
|
979.00
|
953.59
|
1036.00
|
1012.51
|
1011.00
|
988.14
|
6193.00
|
6120.54
|
|
9
|
Himachal Pradesh
|
429.00
|
429.00
|
317.00
|
317.00
|
329.00
|
329.00
|
332.00
|
318.04
|
352.00
|
352.00
|
343.00
|
341.50
|
2102.00
|
2086.53
|
|
10
|
Jharkhand
|
1689.00
|
1689.00
|
1249.00
|
1249.00
|
1293.00
|
1293.00
|
1307.00
|
1307.00
|
1385.00
|
962.94
|
1351.00
|
0.00
|
8274.00
|
6500.94
|
|
11
|
Karnataka
|
3217.00
|
3217.00
|
2377.00
|
2375.50
|
2463.00
|
2093.55
|
2490.00
|
2086.59
|
2637.00
|
2133.25
|
2572.00
|
0.00
|
15756.00
|
11905.89
|
|
12
|
Kerala
|
1628.00
|
1628.00
|
1203.00
|
1203.00
|
1246.00
|
1246.00
|
1260.00
|
1260.00
|
1334.00
|
1334.00
|
1301.00
|
650.50
|
7972.00
|
7321.50
|
|
13
|
Madhya Pradesh
|
3984.00
|
3984.00
|
2944.00
|
2944.00
|
3050.00
|
3050.00
|
3083.00
|
2923.89
|
3265.00
|
3262.75
|
3185.00
|
630.65
|
19511.00
|
16795.29
|
|
14
|
Maharashtra
|
5827.00
|
5827.00
|
4307.00
|
4267.16
|
4461.00
|
3696.71
|
4510.00
|
3629.21
|
4776.00
|
3169.72
|
4659.00
|
2507.25
|
28540.00
|
23097.05
|
|
15
|
Manipur
|
177.00
|
177.00
|
131.00
|
65.50
|
135.00
|
0.00
|
137.00
|
0.00
|
145.00
|
0.00
|
142.00
|
0.00
|
867.00
|
242.50
|
|
16
|
Meghalaya
|
182.00
|
182.00
|
135.00
|
94.50
|
140.00
|
0.00
|
141.00
|
0.00
|
149.00
|
0.00
|
146.00
|
0.00
|
893.00
|
276.50
|
|
17
|
Mizoram
|
93.00
|
93.00
|
69.00
|
69.00
|
71.00
|
71.00
|
72.00
|
72.00
|
76.00
|
76.00
|
74.00
|
37.00
|
455.00
|
418.00
|
|
18
|
Nagaland
|
125.00
|
125.00
|
92.00
|
92.00
|
96.00
|
48.00
|
97.00
|
0.00
|
102.00
|
0.00
|
99.00
|
0.00
|
611.00
|
265.00
|
|
19
|
Odisha
|
2258.00
|
2258.00
|
1669.00
|
1669.00
|
1728.00
|
1728.00
|
1747.00
|
1746.91
|
1851.00
|
1851.00
|
1805.00
|
1712.98
|
11058.00
|
10965.89
|
|
20
|
Punjab
|
1388.00
|
1388.00
|
1026.00
|
1026.00
|
1062.00
|
1062.00
|
1074.00
|
1058.35
|
1138.00
|
1127.86
|
1110.00
|
555.00
|
6798.00
|
6217.22
|
|
21
|
Rajasthan
|
3862.00
|
3862.00
|
2854.00
|
2854.00
|
2957.00
|
2955.34
|
2989.00
|
2847.96
|
3166.00
|
3166.00
|
3087.00
|
757.60
|
18915.00
|
16442.90
|
|
22
|
Sikkim
|
42.00
|
42.00
|
31.00
|
31.00
|
33.00
|
33.00
|
33.00
|
33.00
|
35.00
|
32.78
|
33.00
|
22.85
|
207.00
|
194.63
|
|
23
|
Tamil Nadu
|
3607.00
|
3607.00
|
2666.00
|
2666.00
|
2761.00
|
2761.00
|
2791.00
|
2791.00
|
2957.00
|
2957.00
|
2884.00
|
637.93
|
17666.00
|
15419.93
|
|
24
|
Telangana
|
1847.00
|
1847.00
|
1365.00
|
1365.00
|
1415.00
|
1415.00
|
1430.00
|
1430.00
|
1514.00
|
640.07
|
1477.00
|
0.00
|
9048.00
|
6697.07
|
|
25
|
Tripura
|
191.00
|
191.00
|
141.00
|
141.00
|
147.00
|
147.00
|
148.00
|
148.00
|
157.00
|
156.31
|
153.00
|
153.00
|
937.00
|
936.31
|
|
26
|
Uttar Pradesh
|
9752.00
|
9752.00
|
7208.00
|
7208.00
|
7466.00
|
7466.00
|
7547.00
|
7547.00
|
7994.00
|
7994.00
|
7797.00
|
5441.38
|
47764.00
|
45408.38
|
|
27
|
Uttarakhand
|
574.00
|
574.00
|
425.00
|
418.70
|
440.00
|
439.21
|
445.00
|
444.13
|
471.00
|
470.30
|
458.00
|
89.41
|
2813.00
|
2435.74
|
|
28
|
West Bengal
|
4412.00
|
4412.00
|
3261.00
|
3261.00
|
3378.00
|
3378.00
|
3415.00
|
3415.00
|
3617.00
|
3472.22
|
3528.00
|
3403.92
|
21611.00
|
21342.14
|
|
|
Total
|
60750.00
|
60750.00
|
44901.00
|
44726.22
|
46513.00
|
44869.71
|
47018.00
|
44739.57
|
49800.00
|
45508.95
|
48573.00
|
26656.33
|
297555.00
|
267250.78
|
ఈ సమాచారాన్ని కేంద్ర మంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లలన్ సింగ్ మార్చి 17న లోక్‌సభలో లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో తెలియజేశారు.
***
(రిలీజ్ ఐడి: 2241492)
సందర్శకుల సూచీ సంఖ్య : : 17